'ఓయ్ నిన్నే' రివ్యూ

Friday,October 06,2017 - 03:16 by Z_CLU

నటీ నటులు : భరత్ , సృష్టి, నాగినీడు, తనికెళ్ల భరణి, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేష్, తులసి, ప్రగతి, ధనరాజ్‌ తదితరులు

కెమెరా : సాయి శ్రీరామ్

సంగీతం : శేఖర్‌ చంద్ర

ఎడిటింగ్‌ : మార్తాండ్‌ కె. వెంకటేష్

లిరిక్స్‌ : రామజోగయ్య శాస్త్రి

నిర్మాణం : ఎస్.వి.కె.సినిమా

నిర్మాత : వంశీ కృష్ణ శ్రీనివాస్

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : సత్య చల్లకోటి

రిలీజ్ డేట్ : 6 అక్టోబర్ 2017

 

పల్లెటూరిలో బావ మరదళ్ల ప్రేమ కథతో సత్య చల్లకోటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓయ్ నిన్నే’ సినిమా ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భరత్ సృష్టి హీరో హీరోయిన్ గా పరిచయమైన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసిందో.. తెలుసుకుందాం.

 

కథ : 

మన సంతోషానికి దగ్గరగా ఉన్నప్పుడే మనం సుఖంగా ఉంటామని నమ్మే ఓ పల్లెటూరి కుర్రాడు విష్ణు( భరత్‌ మార్గాని) చిన్నతనం నుంచే తనతో పాటే ఇంట్లో కలిసి పెరిగిన మరదలు వేద(సృష్టి) ను తెలియకుండానే ప్రేమలో పడతాడు. అయితే చిన్నతనం నుంచి బావతో కలిసిన వేద కూడా విష్ణు ని ప్రేమిస్తుంటుంది.. ఓ దశలో ప్రేమా? కుటుంబమా? రెండిటిలో ఏదో ఒకదాన్నే ఎంపిక చేసుకోమని అమ్మాయి కోరుతుంది. ఆమె మాట వింటే ప్రేమ… అతని మనసు మాట వింటే కుటుంబం ఉంటుంది. అప్పుడు విష్ణు ఏం చేశాడు..? అనేది సినిమా కథాంశం.

 

నటీ నటులు :

ఇదే మొదటి సినిమా అయినప్పటికీ తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకున్నాడు హీరో భరత్‌. సృష్టి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో నటి గా మంచి మార్కులే అందుకుంది. సత్య తన కామెడీ, తాగుబోతు రమేష్ తమ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. ఇక నాగినీడు, తనికెళ్ళ భరణి, తులసి, ప్రగతి,రఘు బాబు, ధన్ రాజ్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ గురించే.. ముఖ్యంగా ఇప్పటికే తన మ్యూజిక్ తో ఎన్నో సినిమాలకు హైలైట్ గా నిలిచిన శేఖర్ చంద్ర ఈ సినిమాకు కూడా తన దైన సాంగ్స్ ,సినిమాకు సరిపడే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి హైలైట్ గా నిలిచాడు. ఇక పల్లెటూరి అందాలను తన కెమెరాతో మరింత అందంగా చూపించి సినిమాకు ప్లస్ అయ్యాడు సాయి శ్రీరామ్. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది. ముఖ్యంగా ‘అనుకున్నది చేస్తాం’,’మనసా మనసా’,’ఎటు వైపో’ పాటలు సాహిత్యం పరంగా బాగా ఆకట్టుకున్నాయి. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ పరవాలేదు. గతంలో ‘సోలో’, ‘నువ్వా నేనా’ వంటిస్ సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎస్.వి.కె.సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

పల్లెటూర్లో బావ మరదళ్ల ప్రేమ కథతో సినిమా వస్తుందంటే ఆ సినిమా పై ఎంతో కొంత క్యూరియాసిటీ ఉండడం సహజమే…ఆ జోనర్ అలాంటిది మరి. ఈ జోనర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కాస్త కొత్తదనం చూపిస్తూ ఎమోషన్ పండిస్తే చాలు సినిమాకు కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు. అందుకే రొటీన్ అయినప్పటికీ దర్శకుడిగా పరిచయం అవ్వాలన్నా.. హీరోగా పరిచయం అవ్వాలన్నా.. ఈ జోనర్ నే నమ్ముకుంటారు న్యూ కమ్మర్స్.

అందుకే దర్శకుడు సత్య చెల్లకోటి కూడా రొటీన్ కథే అయినప్పటికి తన మొదటి సినిమాకు ఈ స్టోరీనే సెలెక్ట్ చేసుకున్నాడు.. అయితే ఈ కథను తన స్క్రీన్ ప్లేతో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేయలేకపోయాడు దర్శకుడు. ముఖ్యంగా కథలో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ తో ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయాడు. అక్కడక్కడా తను రాసుకున్న డైలాగ్స్ , సదా సీదా స్క్రీన్ ప్లే తో దర్శకుడిగా పరవాలేదని పించుకున్నాడు సత్య.

క్యారెక్టర్స్, సాంగ్స్ , సినిమాటోగ్రఫీ, కామెడీ సీన్స్, డైలాగ్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా రొటీన్ స్టోరీ, డ్రాగ్ స్క్రీన్ ప్లే, బోర్ కొట్టించే సీన్స్,లవ్ ట్రాక్, ఎమోషన్ పండకపోవడం సినిమాకు మైనస్. ఫైనల్ గా బావ మరదళ్ల ప్రేమకథతో ‘ఓయ్ నిన్నే’ అంటూ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే ఈ సినిమా జస్ట్ పరవాలేదనిపిస్తుంది.

 

రేటింగ్ : 2/5