OTT Review గాలివాన (వెబ్ సిరీస్ )

Friday,April 15,2022 - 01:57 by Z_CLU

OTT Review : Gaali Vaana

నటీ నటులు : రాధిక శరత్ కుమార్ , సాయి కుమార్ , చాందిని చౌదరి , నందిని రాయ్, చైతన్య కృష్ణ , శరణ్య , అర్మాన్ , ఆశ్రిత వేముగంటి, శ్రీ లక్ష్మి , తాగుబోతు

రమేష్ , ఇందు, జయచంద్ర వర్మ తదితరులు

సంగీతం : గౌర హరి

సినిమాటోగ్రఫీ : సుజాత సిద్దార్థ్

ఎడిటింగ్ : సంతోష్ కామిరెడ్డి

నిర్మాతలు : శరత్ మరార్ , సమీర్ గోగటే

దర్శకత్వం : శరణ్ కొప్పిశెట్టి

రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2022

OTT : Zee5

ఎపిసోడ్స్ : 7

ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన రాధిక శరత్ కుమార్ , సాయి కుమార్ కలిసి ఫస్ట్ టైం ‘గాలి వాన’ అనే వెబ్ సిరీస్ చేశారు. ZEE5 ద్వారా OTT ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సిరీస్ కి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మర్డర్ మిస్టరీతో క్రైం డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది ? ‘గాలి వాన‘ ఈ వీకెండ్ విన్నర్ గా నిలిచిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

కొమర్రాజు లంకకి చెందిన ఊరి పెద్ద కొమర్రాజు (సాయి కుమార్) అదే గ్రామంలో ఉండే సరస్వతి (రాధిక) పిల్లలు అజయ్ వర్మ (చరిత్) , గీత (శ్రీ నిఖిత) కొత్తగా పెళ్లి చేసుకొని వైజాగ్ కి షిఫ్ట్ అవుతారు. ఊహించని విధంగా అజయ్, గీతలను శ్రీను అనే ఒక కిల్లర్ హత్య చేయబడతారు. అలా కొత్త జంటని హత్య చేసి ఎస్కేపయిన కిల్లర్ శ్రీను అనుకోకుండా కొమర్రాజు లంకలో ఉన్న సరస్వతి ఇంటి ముందు యాక్సిడెంట్ జరిగి గాయపడతాడు.

అలా గాయాలతో ఇంటి ముందు పడి ఉన్న కిల్లర్ శ్రీనుకి సరస్వతి కూతురు శ్రావని( చాందిని) ట్రీట్ మెంట్ చేసే క్రమంలో గీత , అజయ్ వర్మలను చంపింది అతనే అని తెలుసుకుంటారు. దీంతో సరస్వతి కుటుంబంతో పాటు కొమర్రాజు కుటుంబం కూడా కిల్లర్ శ్రీనుని చంపేయాలని భావిస్తారు. కానీ శ్రావని అడ్డుపడటంతో పోలీసులకి అప్పజెప్పాలని చూస్తారు. కాని అదే రోజు రాత్రి గాయాలతో ఉన్న శ్రీను హత్య చేయబడతాడు. అసలు అజయ్ , గీత లను శ్రీను ఎందుకు చంపాడు ? ఇంతకీ కిల్లర్ శ్రీనుని చంపెందెవరు ? అనేది తెలుసుకోవాలంటే ‘గాలి వాన’ సిరీస్ 7 ఎపిసోడ్స్ చూడాల్సిందే.

నటీ నటులు :

సరస్వతి పాత్రలో రాధిక శరత్ కుమార్ , కొమర్రాజు పాత్రలో సాయి కుమార్ వెబ్ సిరీస్ కి మరింత బలం చేకూర్చారు. సాయి కుమార్, రాధికా ఇద్దరూ తమ యాక్టింగ్ తో సెంటిమెంట్ డ్రామాను బాగా పండించారు. చాందినికి మంచి ఇంపార్టెన్స్ ఉన్న కేరెక్టర్ దొరకడంతో తన పెర్ఫార్మెన్స్ తో శ్రావని రోల్ కి బెస్ట్ ఇచ్చింది. సిరీస్ మొత్తం కనిపించే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నందిని రాయ్ ఆకట్టుకుంది. మార్తాండ్ పాత్రలో చైతన్య కృష్ణ , జ్యోతి పాత్రలో శరణ్య , తులసి పాత్రలో ఆశ్రిత , శ్రీకాంత్ పాత్రలో అర్మాన్ బాగా నటించారు. సూరిబాబు – సావిత్రి కేరెక్టర్స్ తో జయచంద్ర , ఇందు రిజిస్టర్ అయ్యారు. ముఖ్యంగా సావిత్రి పాత్రలో ఇందు మంచి నటన కనబరిచింది.

కథలో కీలకమైన పాత్రల్లో చరిత్ , నిఖిత బాగా నటించారు. వీరిద్దరికీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ కథ అంతా వీరి పాత్రల చుట్టూనే నడుస్తుంది. శ్రీ లక్ష్మి , సతీష్ సారిపల్లి ,నానాజీ కర్రి , కేశవ్ దీపక్ , నవీన్ సనక తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం :

మర్డర్ మిస్టరీ డ్రామాకి టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం. ది బెస్ట్ స్కోర్ , ఎట్రాక్ట్ చేసే విజువల్స్ , డ్రాగ్ లేకుండా ఎడిటింగ్ ఇలా అన్నీ కుదరాలి. ‘గాలివాన’ కి ఇలా అన్ని చక్కగా కుదిరాయి. ముఖ్యంగా సుజాత సిద్దార్థ్ విజువల్స్ బాగున్నాయి. కోనసీమ అందాలను బాగా చూపించి సిరీస్ ని అందంగా మలిచారు. గౌర హరి మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాలకు మంచి స్కోర్ అందించాడు. సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ బాగుంది. ప్రణయ్ నైని ఆర్ట్ వర్క్ బాగుంది.

చంద్ర పెమ్మరాజు స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ కూడా బాగున్నాయి. యంగ్ డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి సిరీస్ ని బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించి మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాడు. శరత్ మరార్ , సమీర్ గోగటే నిర్మాణ విలువలు బాగున్నాయి.

జీ సినిమాలు రివ్యూ :

The Storm is Coming : ఒక కొత్త జంట మర్డర్ దాని చుట్టూ జరిగే కథ అని వరుస సన్నివేశాలతో ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పేశాడు దర్శకుడు. అక్కడి నుండి కథలో కీలకమైన ఒక్కో కేరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆసక్తి కరంగా ఎపిసోడ్ ని ముందుకు నడిపించాడు దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. మిగతా ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాల్సిందే, మిస్టరీ తెలుసుకోవాల్సిందే అనే ఆసక్తి కలిగించేలా చేసేది మొదటి ఎపిసోడే. ఆ విషయంలో ‘గాలి వాన’ మొదటి ఎపిసోడ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎపిసోడ్ 1 లో వచ్చే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి ఆడియన్స్ కి కలిగించడంతో స్కిప్ చేయకుండా ఆటోమేటిక్ గా రెండో ఎపిసోడ్ ప్లేయ్ చేసేలా ఉంది.

One Of Us Knows it All : రెండో ఎపిసోడ్ లో కిల్లర్ మర్డర్ చుట్టూ మంచి సీన్స్ రాసుకొని ఎవరు చేసి ఉంటారనే క్యూరియాసిటీ రైజ్ చేశాడు
దర్శకుడు. అక్కడి నుండి ఆడియన్స్ లో అసలు కిల్లర్ ని చంపిందెవరు ? అనే ఆసక్తి కలుగుతుంది. దాంతో ప్రతీ కేరెక్టర్ మీద డౌట్ కలుగుతుంది. అక్కడి నుండి ఆడియన్ మైండ్ కి పదును పెడతాడు. మొదటి భాగంలోనే కేరెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయిపోవడంతో రెండో భాగంలో వచ్చే సన్నివేశాల్లో ప్రతీ కేరెక్టర్ కి కనెక్ట్ అవుతుంటారు ప్రేక్షకులు. ఇక రెండో ఎపిసోడ్ లో నందిని రాయ్ ని పోలీస్ కేరెక్టర్ లో ఇంట్రడ్యూస్ చేసి ఆమెకి డిపార్ట్ మెంట్ కొత్త జంట హత్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలనే భాద్యత అప్పగించినట్టుగా చూపించారు. అక్కడి నుండి ఇన్వెస్టిగేషన్ సీన్స్ సిరీస్ ని ఎగ్జైటింగ్ గా ముందుకు నడిపిస్తుంటాయి. నటీ నటుల నటన , ఆసక్తి కలిగించే సీన్స్ మూడో ఎపిసోడ్ కూడా వెంటనే ప్లే చేసేలా చేస్తాయి. రెండు కుటుంబాలు కలిసి కిల్లర్ మర్డర్ గురించి ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేసే సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి.

The Buried Truth పోలీస్ ఆఫీసర్ నందిని సరస్వతిని కలిసి ఈ మర్డర్ మిస్టరీ వెనుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకునే సీన్ తో ఎపిసోడ్ మొదలవుతుంది. తర్వాత పోలీసులకి కిల్లర్ బాడీ దొరక్కుండా రెండు కుటుంబాలు కలిసి ఎవరికీ తెలియని ప్లేస్ లో కారులో బాడీ ని దాచే సీన్ హైలైట్ గా నిలిచింది. ఒకవైపు సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మరో వైపు శ్రావని ఫేస్బుక్ చేసి హ్యాక్ చేసి శ్రీకాంత్ కొన్ని విషయాలు తెలుసుకోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

The Knife Knows the Killer సరస్వతి ఇంట్లో అనుకోకుండా ఒక కత్తి దొరకడం ఆ కత్తి మార్తాండ్ రూమ్ లో కనిపించడంతో మార్తాండ్ పాత్ర మీద
అనుమానం క్రియేట్ అవుతుంది. అప్పటికే రెండు ఎపిసోడ్స్ లో మార్తాండ్ ఎలాంటి వాడో చెప్తూ తన కోపాన్ని ఎలివేట్ చేయడంతో అతనే హత్య చేసి ఉంటాడని అనుమానం కలుగుతుంది. హాస్పటల్ లో వచ్చే సీన్స్ , అలాగే ఊరిలో రెండు కుటుంబాల్లో జరిగే ఇన్సిడెంట్స్ చూపిస్తూ మూడో ఎపిసోడ్ కూడా ఎగ్జైట్ చేస్తుంది. అలాగే ఈ ఎపిసోడ్ లో ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. బాడీస్ ఊరికి వచ్చే సీన్ తర్వాత జరిగే తంతు సన్నివేశాలు ఎమోషనల్ గా ఉంటాయి. అలాగే కిల్లర్ డెడ్ బాడీని అతను ప్రయాణించిన కారుని రెండు కుటుంబాలు కలిసి ఎవరికీ కనిపించకుండా దాచే సీన్స్ బాగున్నాయి.

Is it Right to Be Wrong ? పోలీస్ ఆఫీసర్ నందిని ఒక డ్రగ్ సరఫరా చేసే వ్యక్తి బెదిరించడం సన్నివేశంతో ఎపిసోడ్ మొదలవుతుంది. ఆ తర్వాత
కిల్లర్ డెడ్ బాడీతో పాటు కారుని కూడా పోలీసులు వెతికి తీసే సన్నివేశంతో తర్వాత ఏం జరుగబోతుందనే ఎగ్జైటింగ్ కలుగుతుంది. అలాగే శ్రీకాంత్ కేరెక్టర్ తో కథ మరో మలుపు తిరుగుతుంది. నందిని తన ఇన్వేస్టిగేషన్ ని మరింత వేగవంతం చేస్తూ కొమర్రాజు లంకకి రావడం, అలాగే డ్రగ్ సరఫరా చేసే డేవిడ్ రాజు పోలీసులకు చిక్కడం, మరో వైపు నందిని ఆధారాలు సేకరించే ప్రయత్నాలతో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి.

A Truth Greater Than Confession కొమర్రాజు లంకలో కిల్లర్ డెడ్ బాడీ దొరకడంతో నందిని రెండు కుటుంబాలను ఇన్వెస్టిగేషన్ దృష్ట్యా పోలీస్
స్టేషన్ కి తీసుకెళ్లడం , మార్తాండ్ పై అనుమానం ఉండటంతో అతన్ని స్పెషల్ గా ఇంటరాగేషన్ చేయడం, తర్వాత మార్తాండ్ మీద కేసు నమోదు చేసి అతన్ని జైల్లో పెట్టడంతో వచ్చే సీన్స్ సిరీస్ ని ఇంట్రెస్టింగ్ గా ముందుకు నడిపించాయి. ఈ ఎపిసోడ్ లో పోలీస్ ఆఫీసర్ నందిని కి తన కూతురి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. అలాగే ఎపిసోడ్ ఎండింగ్ లో గీత నీ చెల్లెలు అంటూ శకుంతల అనే ముసలి పాత్ర శ్రావనికి చెప్పడంతో కథలో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరుతుంది. దాంతో ఎపిసోడ్ ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది.

An Innocent Mind Knows No Boundaries సిరీస్ కి సంబంధించి లాస్ట్ ఎపిసోడ్ ని బాగా ప్లాన్ చేసుకున్నారు. తులసి తల్లి శకుంతల శ్రావనికి అలాగే నందినికి అసలు విషయం చెప్తూ కథలో ట్విస్టుని రివీల్ చేసే సీన్ నుండి ఎపిసోడ్ స్టార్టవుతుంది. అక్కడి నుండి ఊహించని ట్విస్టుతో క్లైమాక్స్ వరకూ ఎపిసోడ్ ఎట్రాక్ట్ చేస్తుంది. అసలు కిల్లర్ కి సుపారీ ఇచ్చి గీత , అజయ్ లను చంపించిందెవరు అనే విషయాన్ని రివీల్ చేస్తూ అసలు కథ ఏంటో ఓపెన్ చేసే సీన్ సిరీస్ కే హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా సాయి కుమార్ పెర్ఫార్మెన్ ఆకట్టుకుంటుంది.

బ్రిటిష్ వెబ్ సిరీస్ ని ఆధారంగా తీసుకొని చేసిన ‘గాలివాన’ సిరీస్ ని దర్శకుడు శరణ్ బాగానే హ్యాండిల్ చేశాడు. ప్రతీ ఎపిసోడ్ లో రెండు మూడు ట్రాక్ లు రన్ చేస్తూ ఎట్రాక్ట్ చేశాడు. ప్రతీ కేరెక్టర్ కి కథలో ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటూ కేరెక్టరైజేషణ్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ మర్డర్ మిస్టరీలో కాళ్ళు పోయి నడవలేకపోతున్నానంటూ హాస్పిటల్ లో బాధపడే కుర్రాడి కథను అలాగే తన కూతురు క్యాన్సర్ బారిన పడిందని తెలిసి ఆపరేషన్ డబ్బు కోసం డ్రగ్స్ సరఫరా చేస్తూ తప్పు దారి పట్టిన పోలీస్ కేరెక్టర్ కథను కూడా మర్జ్ చేశారు. ఆ రెండూ కథలు మెయిన్ కథలోకి మర్జ్ చేసిన విధానం బాగుంది.

ఓవరాల్ గా మర్డర్ మిస్టరీతో సాగే ఇన్వెస్టిగేషన్ క్రైం డ్రామాగా తెరకెక్కిన ‘గాలి వాన’ కేరెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చే నటీ నటులతో, ఆకట్టుకునే సన్నివేశాలతో, ఆసక్తి కలిగించే కంటెంట్ తో మెప్పిస్తుంది. ఫైనల్ గా ‘గాలి వాన’ ఈ వారం వచ్చిన OTT సిరీస్ లలో విన్నర్ గా నిలిచింది.

రేటింగ్ :  3 /5

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress
    Photos and Special topics