'నిను వీడని నీడను నేనే' రివ్యూ

Friday,July 12,2019 - 02:10 by Z_CLU

నటీనటులు : సందీప్ కిషన్ , అన్యా సింగ్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, , పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు

సంగీతం: ఎస్.ఎస్. తమన్

ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ

ఎడిటింగ్: కేఎల్ ప్రవీణ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌.

నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్

దర్శకత్వం : కార్తీక్ రాజు

విడుదల తేది : 12 జూలై 2019

నిడివి : 126 నిమిషాలు

వరుస అపజయాల తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సంస్థను నెలకొల్పి నిర్మాతగా ‘నిను వీడని నీడను నేనే’ సినిమాను తీసాడు సందీప్ కిషన్. ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి హీరోగా , నిర్మాతగా సందీప్ హిట్టు కొట్టాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ :

2035లో ఒక సైకాలజీ ప్రొఫెసర్‌ (మురళీ శర్మ) తను డీల్‌ చేసిన ఓ ఆసక్తికరమైన కేసుకు సంబంధించిన విషయాలను కొందరు స్టూడెంట్స్ ఆసక్తి మేరకూ చెప్పటం మొదలు పెడతాడు. తను 2013 సంవత్సరంలో ఎదుర్కొన్న ఓ డిఫరెంట్ కేసు గురించి తెలియజేస్తాడు . అర్జున్ (సందీప్‌ కిషన్‌), మాధవి (ఆన్య సింగ్) భార్య భర్తలు. ఓ బంగ్లాలో నివాసం ఉంటున్న వీరు అనుకోకుండా ఓ యాక్సిడెంట్ కి గురవుతారు. ఆ యాక్సిడెంట్ తరువాత కొన్ని భయానక సంఘటనలు ఎదురవుతాయి. వారు అద్దంలో చూసుకున్నప్పుడు వారికి బదులుగా రిషీ(వెన్నెల కిషోర్), దియా అనే మొఖాలు కనిపిస్తుంటాయి. అద్దంలో వేరే వ్యక్తులు కనబడటంతో అర్జున్ -మాధవి ఇద్దరూ భయపడి సైకాలజీ స్పెషలిస్ట్ ను కలుస్తారు. అయితే వీరిద్దరి మోఖాలకు బదులుగా వేరే వ్యక్తుల మొఖాలు కనిపించడానికి కారణం ఏంటి.? ఇంతకీ అద్దంలో కనిపించే రిషి , దియా ఎవరు? చివరకు అర్జున్ -మాధవి ఏమయ్యారు? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

సందీప్ కిషన్ ఎప్పటి లాగే తన క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన బాగుంది. ఈ సినిమాతో సందీప్ కి అన్ని ఎమోషన్స్ పండించే క్యారెక్టర్ లభించింది. అన్యా సింగ్ లుక్ పరంగా పరవాలేదు అనిపించుకొని నటన పరంగా ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. పోసాని తన మార్క్ కామెడీతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు.

మురళీ శర్మ తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేసారు. ప్రగతి , పూర్ణిమ భగ్యరాజ్, మహేష్ విట్ట తదితరులు పరవాలేదు అనిపించారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సిద్దార్థ్ పాడిన ఎక్స్ క్యూజ్మీ రాక్షసి పాట బాగుంది. ఆ పాటకు పిక్చరైజేషన్ కూడా ఆకట్టుకుంది. ప్రమోద్ వర్మ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అతని పనితనం కనిపించింది. కే.ఎల్. ప్రవీణ్ ఎడిటింగ్ పరవాలేదు. కథ పరవాలేదు అనిపించినా కథనం మాత్రం పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. కార్తీక్ రాజు దర్శకత్వంలో లోపాలున్నాయి.ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

‘నిను వీడని నీడను నేనే’ అంటూ హార్రర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సందీప్ కిషన్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. సినిమా ప్రారంభంలో ప్రేక్షకుడిలో కాస్త ఆసక్తి నెలకొల్పిన దర్శకుడు అక్కడక్కడా తడబడుతూ కథను నెమ్మదిగా నడిపిస్తూ బోర్ కొట్టించాడు. చెప్పాలనుకున్న పాయింట్ ను లాజిక్స్ లేకుండా చూపించాడు  కార్తీక్ రాజ్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను కాస్త వేగంగా నడిపించి ఉంటే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేది. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం ‘ఆనందో బ్రహ్మ’ సినిమాను గుర్తు చేస్తుంది. కానీ కథ పరంగా ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం ఉండదు.

మొదటి భాగం కాస్త ఆకట్టుకున్నా రెండో భాగంలో వచ్చే సన్నివేశాలు, నెరేషన్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. రెండో భాగంలో వచ్చే సన్నివేశాలు , ఎడిటింగ్ మీద ఫోకస్ చెయ్యాల్సింది. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ సన్నివేశాలపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కామెడీ సన్నివేశాలను మాత్రం బాగా తెరకెక్కించాడు దర్శకుడు. కథని డిస్టర్బ్ చేయకుండా వచ్చే సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. సినిమా ప్రారంభంలో వచ్చే ఫోర్స్ద్ రొమాంటిక్ సీన్స్ అనవసరం అనిపిస్తాయి.

కొన్ని సందర్భాల్లో థ్రిల్ కలిగించే సన్నివేశాలు, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ కి ముందు వచ్చే ట్విస్టులు. కామెడీ సినిమాకు హైలైట్ కాగా , స్లో నెరేషన్ , ఎడిటింగ్, రెండో భాగంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు మైనస్. ఓవర్ ఆల్ గా  ట్విస్టులు, కామెడీతో ‘నిను వీడను నీడను నేనే’ పరవాలేదు అనిపిస్తుంది.

రేటింగ్ : 2.5 /5