Movie Review- కార్తికేయ 2

Saturday,August 13,2022 - 03:55 by Z_CLU

నటీ నటులు : నిఖిల్ సిద్దార్థ్ , అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి , తులసి, వైవా హర్ష తదితరులు

సంగీతం : కాల భైరవ

కెమెరా – ఎడిటింగ్ : కార్తీక్ ఘట్టమనేని

మాటలు – స్టోరీ డెవలప్ మెంట్ : మణిబాబు

నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్

నిర్మాతలు : TG విశ్వప్రసాద్ , అభిషేక్ అగర్వాల్

రచన -దర్శకత్వం : చందూ మొండేటి

విడుదల తేది : 13 ఆగస్టు 2022

నిఖిల్ , చందూ మొండేటి కాంబినేషన్ లో ‘కార్తికేయ’కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. ట్రైలర్స్ తో భారీ హైప్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా ? టాలీవుడ్ లో సీక్వెల్ కి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ ని చెరిపేసిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

డాక్టర్ కార్తికేయ (నిఖిల్ సిద్దార్థ్) ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనే ఆతృత కలిగిన కుర్రాడు. అనుకోకుండా తన తల్లితో కలిసి ద్వారక వెళ్తాడు. అక్కడ జరిగే సంఘటనలు కార్తికేయకి ఆసక్తి కలిగిస్తాయి. మరో వైపు కృష్ణ కంకణం ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు సయింటిస్ట్ డాక్టర్ శాతనం (ఆడిత్యా మీనన్ ). ఇక తన తాత చేసిన రీసెర్చ్ తెలుసుకొని అతని మరణానంతరం కార్తికేయ దగ్గరికి చేరుతుంది ముగ్ద(అనుపమ పరమేశ్వరన్). ద్వారాక లో తనకు ఎదురైన విపత్తులు దాటి ఫైనల్ గా కృష్ణ కంకణం వెతికే కోసం ప్రయాణం మొదలు కార్తికేయ. ఫైనల్ గా లోక కళ్యాణానికి ఉపయోగపడే ఔషధ గుణాలు ఉన్న కృష్ణ కంకణంని కార్తికేయ తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా కనిపెట్టాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

కార్తికేయ కేరెక్టర్ కి హీరో నిఖిల్ సిద్దార్థ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ పాత్రలో ఒదిగిపోయి మెప్పించాడు. కొన్ని సన్నివేశాల్లో నిఖిల్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. అనుపమ కి రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాకుండా కథలో మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కింది. ఆ పాత్రకు అనుపమ న్యాయం చేసింది. శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్ష లకు మంచి పాత్రలు దక్కడంతో ఆ కేరెక్టర్స్ తో అలరించారు. కొన్ని సందర్భాల్లో శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష డైలాగ్ కామెడీ నవ్విస్తుంది. ప్రత్యేక పాత్రలో అనుపమ్ ఖేర్ ఆకట్టుకున్నాడు. ఆంధుడిగా నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారాయన. స్టైలిష్ విలన్ గా ఆదిత్యా మీనన్ ఫరవాలేదనిపించుకున్నాడు. అమ్మ పాత్రలో తులసి, ఫ్రెండ్స్ పాత్రల్లో సత్య, ప్రవీణ్ మిగతా నటీ నటులంతా బాగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఏ సినిమాకైనా టెక్నీషియన్స్ సపోర్ట్ అవసరం. వారి నుండి బెస్ట్ అందుకోగలిగితే సినిమా ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి మైథలాజికల్ డ్రామా సినిమాలకు సాంకేతిక నిపుణుల పనితనం గొప్పగా ఉంటే ప్రేక్షకుడు అద్భుతంలా ఫీలవుతాడు. కార్తికేయ 2 కి ప్రతీ టెక్నీషయన్ నుండి బెస్ట్ వర్క్ లభించింది. ముఖ్యంగా కార్తిక్ ఘట్టమనేని , కాల భైరవ సినిమాకు బ్యాక్ బోన్ లా నిలిచారు. కాల భైరవ నేపథ్య సంగీతం, కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. కార్తిక్ ఘట్టమనేని కెమెరా వర్క్ తో పాటు తన గ్రిప్పింగ్ ఎడిటింగ్ తో మంచి మార్కులు అందుకున్నాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా తన కత్తెర వాడిన విధానం బాగుంది. అలాగే సాహి సురేష్ ఆర్ట్ వర్క్ కూడా ప్లస్ అయ్యింది. మణిబాబు మాటలు సన్నివేశాలకు బలం చేకూర్చాయి. అలాగే స్క్రిప్ట్ డెవలప్మెంట్ అతని టాలెంట్ కనిలించింది. దర్శకుడు చందూ మొండేటి కథ, కథనం బాగున్నాయి. సినిమాను తను హ్యాండిల్ చేసిన విధానం మెప్పిస్తుంది. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

మైథలాజికల్ డ్రామాను హ్యాండిల్ చేయడం కాస్త కష్టమే. ఈ జానర్ లో సినిమా తీసేముందు స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా ఆ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళగలగాలి. దర్శకుడు చందూ మొండేటి సెట్స్ పైకి వెళ్ళక ముందే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగా చేసుకున్నాడు. ముఖ్యంగా మణిబాబు తో కలిసి మంచి నెరేషన్ రాసుకున్నాడు. చందూ తో పాటు స్క్రిప్ట్ డెవలప్ మెంట్ వర్క్ చేసిన మణిబాబుని కూడా మెచ్చుకోవాలి. ఇలాంటి కథల్ని ఎంత గొప్పగా రాసుకున్న అంతే గొప్పగా తీయగలిగే ప్రతిభ అవసరం. దర్శకుడు చందూ మొండేటి తన టాలెంట్ , అనుభవంతో ఈ సీక్వెల్ ని బాగా హ్యాండిల్ చేసి మంచి మార్కులు అందుకున్నాడు. కార్తికేయ నుండి కేవలం పాత్రలను తీసుకొని దానికి కృష్ణ కంకణం అనే కాన్సెప్ట్ కనెక్ట్ చేసి తన నెరేషన్ తో మెస్మరైజ్ చేశాడు. సినిమా మీద నిఖిల్ కి ఉన్న ఫ్యాషన్ ఎంతో సినిమాలో తన నటన తో చెప్పాడు. నిఖిల్ పెర్ఫార్మెన్స్ కథలు మోసుకెళ్ళిన తీరు సినిమాకు మెయిన్ హైలైట్ అని చెప్పాలి. తన కేరెక్టర్ తో సినిమాను ఆసక్తిగా ముందుకు నడిపించాడు నిఖిల్. చందూ ని ఇక్కడ మరోసారి మెచ్చుకోవాలి. సినిమాలో అందరికీ ఇంపార్టెన్స్ కేరెక్టర్స్ డిజైన్ చేసి వాటి ద్వారా సినిమాను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.

సినిమాకు దర్శకుడు తీసుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునేలా చెప్పాడు. అతని విజన్ కి టెక్నీషియన్స్ కూడా బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చి పిల్లర్స్ లా నిలబడ్డారు. ముఖ్యంగా కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ తో ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. తన విజువల్స్ తో బెస్ట్ ఇచ్చి సినిమాను పెర్ఫెక్ట్ రన్ టైమ్ కి కట్ చేసి గ్రిప్పింగ్ గా చూపించాడు. కాల భైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మేజర్ హైలైట్. ప్రతీ సన్నివేశాన్ని రక్తి కట్టించే విధంగా అతను ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా హే మాధవ హే గోవిందా అనే పదాలతో వచ్చే స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. కార్తికేయ , ముగ్ద , సులోమాన్, సదానంద కలిసి ద్వారక నుండి మధుర వెళ్లే సన్నివేశాలు , కృష్ణ కంకణం కనిపెట్టి అన్వేషణ తాలూకు సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సినిమా ఆరంభం నుండి చివరి వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా కథను ఆసక్తిగా నడిపించిన తీరు సీటుకి కట్టిపారేస్తుంది. ఓవరాల్ గా నిఖిల్ , చందూ మొండేటి కంబినేషన్ లో వచ్చిన మైథలాజికల్ మిస్టరీ డ్రామాగా కార్తికేయ2 అందరినీ ఆకట్టుకొని మెప్పిస్తుంది.

రేటింగ్ : 3.25/ 5