'నెపోలియన్' రివ్యూ

Friday,November 24,2017 - 12:26 by Z_CLU

నటీనటులు : ఆనంద్ రవి ,రవివర్మ, కోమలి, కేదార్ శంకర్ తదితరులు

మ్యూజిక్ : సిద్ధార్థ్ సదాశివుని

నిర్మాణం : ఆచార్య క్రియేషన్స్

నిర్మాత : భోగేంద్ర గుప్త

రచన – స్క్రీన్ ప్లే -దర్శకత్వం : ఆనంద్ రవి

రిలీజ్ డేట్ : 24 నవంబర్ 2017

 

నీడ పోయిందంటూ ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ‘నెపోలియన్’ సినిమా ఈరోజే విడుదలైంది. రచయిత ఆనంద్ రవి హీరోగా మారి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం.

కథ

తన నీడ పోయిందంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లంట్ ఇచ్చి పోలీసులందరినీ షాక్ కి గురిచేస్తాడు అశోక్ అలియాస్ నెపోలియన్(ఆనంద్ రవి)… ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో ఎప్పుడో క్లోజ్ అయిపోయిన తిరుపతి అనే వ్యక్తి యాక్సిడెంట్ కేసును మర్డర్ కేసు అని చెప్పి రీ-ఓపెన్ చేయిస్తాడు నెపోలియన్. ఇంతకీ అశోక్, నెపోలియన్ లా ఎలా మారాడు.. చనిపోయిన తిరుపతి ఎవరు..? అతను ఎందుకు చంపబడ్డాడు. చివరికి పోలీస్ ల సహాయంతో నెపోలియన్ హంతకులను ఎలా అంతమొందించాడు అనేది సినిమా కథాంశం.


నటీనటుల పనితీరు :

నెపోలియన్ అనే క్యారెక్టర్ తో పాటు అశోక్ క్యారెక్టర్ తో ఆనంద్ రవి పరవాలేదనిపించుకున్నాడు. అయితే నటుడిగా ఇదే మొదటి సినిమా కావడంతో హీరోగా ఆకట్టుకోలేకపోయాడు. నటనలో అనుభవం లేకపోవడంతో కొన్ని సన్నివేశాల్లో తేలిపోయాడు ఆనంద్ రవి. నిజానికి ఈ క్యారెక్టర్ మరో హీరో చేసి ఉంటే బాగుండేది అనే ప్రశ్న కూడా ప్రేక్షకులకు కలగక మానదు. కోమలి తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. సిన్సియర్ పోలీస్ పాత్రతో రవివర్మ సినిమాకు హైలైట్ గా నిలిచాడు. కేదార్ శంకర్, మధుమణి మిగతా నటీనటులు వారి పరిధిలో నటించి పరవాలేదనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు :

టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గురించే. సిద్ధార్థ్ సదాశివుని మ్యూజిక్ సినిమాకు మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ‘వింతలు- వింతలు’,ప్రాణమా’ పాటలు ఆకట్టుకున్నాయి. సినిమాకు సరైన బ్యాగ్రౌండ్ అందించి కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేశాడు సిద్దార్థ్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. ఆనంద్ రవి మాటలు ఆకట్టుకున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.


జీ సినిమాలు సమీక్ష :

రచయిత దర్శకుడిగా మారితే ఎలా ఉంటుందనేది ఇప్పటికీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిరూపించాయి. అయితే ప్రతినిధి సినిమాతో రచయితగా మంచి గుర్తింపు అందుకున్న ఆనంద్ రవి కూడా ఈ సినిమాతో అదే రూటులోకి వెళ్తాడనుకున్నారంతా. అయితే రచయిత నుంచి దర్శకుడిగా మారడం బాగానే ఉన్నా తనే హీరోగా నటించడం అనేది మైనస్ అనిపించింది. నీడ పోయింది అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించి తనలో ప్రతిభను మరో సారి తెలియజేసాడు ఆనంద్ రవి. కొన్ని సందర్భాలలో తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో మెస్మరైజ్ చేశాడు.
రొటీన్ స్టోరీ అయినప్పటికీ దర్శకుడిగా తన స్క్రీన్ ప్లే తో పాటు నీడ పోయింది అనే ఎలిమెంట్ ను కూడా యాడ్ చేసి ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేశాడు. నెపోలియన్ క్యారెక్టర్, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా సాగే స్క్రీన్ ప్లే, సాంగ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, ఎమోషనల్ సీన్స్, కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
ఇక స్టార్టింగ్ లో బోర్ కొట్టించే సీన్స్, ప్రీ ఇంటర్వెల్ లో సాగదీతలా అనిపించే స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ లో వచ్చే కన్ఫ్యూజన్, రవివర్మ మినహా మిగతా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే నటులు లేకపోవడం సినిమాకు మైనస్. ఓవరాల్ గా ఓ డిఫరెంట్ పాయింట్ తో మేజికల్ స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘నెపోలియన్’ ఓ మోస్తరుగా ఎంటెరైన్ చేస్తుంది

రేటింగ్2.5/5