Movie Review - విజయ్ సేతుపతి

Saturday,May 15,2021 - 03:34 by Z_CLU

కోలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి క్రేజ్ అందుకున్న విజయ్ సేతుపతి ఇటివలే ‘సైరా’,’ఉప్పెన’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. తాజాగా విజయ్ సేతుపతి నటించిన తమిళ సినిమా OTT ద్వారా తెలుగు ప్రేక్షకుల మునుకొచ్చింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘సంఘతమిజన్’ సినిమా తెలుగులో ‘విజయ్ సేతుపతి’గా విడుదలైంది.

రామాపురం అనే ఊరిలో ఫ్యాక్టరీ పెట్టాలనుకునే బిజినెస్ మెన్ . దానికి రాజకీయనాయకుడి సపోర్ట్ . తర్వాత ఊరి జనం కోర్టు కి వెళ్ళడం, దాంతో ఫ్యాక్టరీ పనులు ఆగిపోవడం ఇక అదే సమయంలో ఆ ఊరిలో ఉండే విజయ్ సేతుపతి లానే ఉండే చరణ్ ని ఆ ఊరికి పంపి తమ ఫ్యాక్టరీ పూర్తి చేయించాలని చూసే వ్యాపారస్తుడు.

మరి అచ్చం విజయ్ సేతుపతి లానే ఉండే చరణ్ ఆ ఊరికెళ్ళి చివరికి ఏం చేసాడనే కథతో తెరకెక్కిన ఈ విలేజ్ యాక్షన్ డ్రామా సినిమా పూర్తి స్థాయిలో మెప్పించదు. కానీ ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది. మొదటి భాగాన్ని ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించి రెండో భాగాన్ని విలేజ్ సన్నివేశాలతో కూడిన డ్రామాతో నడిపించాడు దర్శకుడు.

ఇప్పటికే చూసేసిన పాత కథ కావడం, పైగా రొటీన్ సన్నివేశాలు ఉండటంతో సినిమా అక్కడక్కడా బొర్ కొడుతుంది. పైగా విలన్ డబ్బులతో ప్రజలకు దగ్గరై చివరికి విలన్ కే ట్విస్ట్ ఇచ్చే ఓల్డ్ ఫార్ములా కూడా ప్రేక్షకులకు కిక్ ఇవ్వదు. ఇక విజయ్ సేతుపతి డబుల్ యాక్షన్ తో మెప్పించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. రాశీ ఖన్నా తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే సూరి కామెడీ అలరిస్తుంది.

ఇక ఇలాంటి విలేజ్ డ్రామా యాక్షన్ సినిమాలను కాస్త తక్కువ నిడివితో ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేయాలి. విజయ్ సేతుపతి కి అదే మైనస్. నిడివి ఎక్కువ ఉండటం వలన కొన్ని సన్నివేశాలు స్కిప్ చేయాలనిపిస్తుంది. తెలుగు వర్షన్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండాల్సింది. కనీసం పాటలయినా కట్ చేయాల్సింది. ఫైనల్ గా ‘విజయ్ సేతుపతి’ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ సినిమాగా ఫరవాలేదనిపిస్తుంది. విజయ్ సేతుపతి నటన, సూరి కామెడీ, కొన్ని సన్నివేశాల కోసం ఓ లుక్కేయోచ్చు.

రేటింగ్ – 2.5/5

 

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics