మూవీ రివ్యూ - 'భగవంత్ కేసరి'

Thursday,October 19,2023 - 01:27 by Z_CLU

నటీనటులు : నందమూరి బాలకృష్ణ,  శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ తదితరులు

డీవోపీ: సి రామ్ ప్రసాద్

సంగీతం: ఎస్ఎస్ థమన్

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది

బ్యానర్: షైన్ స్క్రీన్స్

రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి

విడుదల : 19 అక్టోబర్ 2023

నిడివి : 164 నిమిషాలు

బాలయ్య తో అనీల్ రావిపూడి సినిమా చేస్తున్నారని తెలియగానే ఈ కాంబో సినిమా ఎలా ఉండబోతుందా ? అంటూ డిస్కషన్ మొదలైంది. ఇప్పటి వరకూ ఎంటర్టైన్ మెంట్ బేస్డ్  కమర్షియల్ సినిమాలు చేసిన అనిల్ రావిపూడి తన జోనర్ నుండి బయటికి వచ్చి బాలయ్య కోసం కొత్త ప్రయత్నం చేశారు. మరి భగవంత్ కేసరి తో అనిల్ ప్రయత్నం మెప్పించిందా ? బాలయ్య మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

తనకి మేలు చేసిన జైలర్ (శరత్ కుమార్) చివరి కోరిక మేరకు ఆయన కూతురు విజ్జి పాప(శ్రీలీల) ను ఎలాగైనా ఆర్మీలో చేర్పించెందుకు చిన్నతనం నుండే ట్రైన్ చేస్తుంటాడు భగవంత్ కేసరి(బాలకృష్ణ).

అయితే చిన్న తనంలో తల్లి దండ్రులను కోల్పోయిన విజ్జి పాపను కంటికి రెప్పలా చూసుకుంటూ తనని ఎలాగైనా షేర్ లా పెంచాలని ప్రయత్నిస్తుంటాడు భగవంత్. కానీ విజ్జి కి ఏమో ఆర్మీ అంటే ఇంటరెస్ట్ ఉండదు. భగవంత్ తనని ఇబ్బంది పెడుతున్నట్టు భావిస్తూ ఆర్మీ ఎగ్జామ్ ను స్కిప్ చేస్తుంటుంది. మరి ఫైనల్ గా విజ్జి ను భగవంత్ తన సంకల్పంతో షేర్ గా మార్చగలిగాడా ? ఆర్మీ లో చేర్పించగలిగడా ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల  పనితీరు : 

బాలకృష్ణ హీరోగా ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేశాడు. భగవంత్ కేసరి నటుడిగా ఆయనకి మరో డిఫరెంట్ పాత్ర అని చెప్పవచ్చు. దర్శకుడు తన కోసం రాసిన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు బాలయ్య. సెటిల్డ్ గా నటిస్తూ సరికొత్తగా కనిపించాడు. యాక్షన్స్ ఎపిసోడ్స్ తో ఫ్యాన్స్ ను మెప్పించారు. విజ్జి పాత్రలో శ్రీలేల నటన బాగుంది. కథలో మంచి ఇంపార్టెన్స్ ఉన్న కరెక్టర్ దొరకడంతో బెస్ట్ ఇచ్చింది. కాజల్ కి పెద్దగా స్కోప్ ఉన్న పాత్ర దక్కలేదు. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంది.

అర్జున్ రాంపాల్ విలనిజం బాగుంది. స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు. మురళీధర్ , రఘుబాబు మిగతా నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు మ్యూజిక్ పరంగా బెస్ట్ వర్క్ ఇచ్చాడు తమన్. గణేష్ ఆంథమ్ , రోర్ ఆఫ్ భగవంత్ కేసరి లతో పాటు ఉయ్యాలో ఉయ్యాలా సాంగ్ బాగా ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో తమన్ ఇచ్చిన స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని చోట్ల తమన్ ఇచ్చిన స్కోర్ హంట్ చేయడం ఖాయం. రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ బాగుంది. కొన్ని షాట్స్ , ఫ్రేమ్స్ లో ఆయన పనితనం కనిపించింది. తమ్మి రాజు ఎడిటింగ్ పరవాలేదు. మొదటి భాగంలో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది. వెంకట్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ మాస్ అడియన్స్ ను మెప్పిస్తుంది.  ఫైట్స్ సినిమాకు మరో హైలైట్.

అనిల్ రావిపూడి కథ , కథనం బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అనిల్ రావిపూడి రైటింగ్ సెన్సిబులిటీ తెలుస్తుంది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ సినిమా క్వాలిటీ ని పెంచాయి.

జీ సినిమాలు సమీక్ష : 

బాలయ్యను ప్రేక్షకులు ఇప్పటికే చాలా లౌడ్ కేరెక్టర్స్ లో చూశారు. ఎంజాయ్ చేశారు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలతో బాలయ్య ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు ,  బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. కానీ ఆయనతో సినిమా చేస్తే ఏదో కొత్తగా ప్రయత్నించాలని దర్శకుడు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి కథ రాసుకున్నట్టున్నాడు. బర్నింగ్ టాపిక్ ఒకటి తీసుకొని దాని చుట్టూ ఫ్యామిలీ ఎమోషన్స్ తో డ్రామా క్రియేట్ చేసి ఓ మంచి సందేశం ఇచ్చాడు అనిల్. బాలయ్య పాత్రను కొత్తగా డిజైన్ చేసి సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. అనిల్ రావిపూడి క్రియేట్ చేసిన కొత్త పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచాడు.

సినిమా ఆరంభంలోనే కథ ఓపెన్ చేసేసి ఎలాంటి ట్విస్టులు లేకుండా కథను నడిపించిన తీరు కాస్త కొత్తగా అనిపిస్తుంది. తన మార్క్ కామెడీ నుండి అనిల్ రావిపూడి కంప్లీట్ గా బయట కొచ్చి చేసిన ప్రయత్నంగా భగవంత్ కేసరి చెప్పుకోవచ్చు. అలాగే డ్యూయెట్ సాంగ్స్ లేకుండా , స్పెషల్ నంబర్ లేకుండా ఎక్కడా డీవియేట్ అవ్వకుండా  తను చెప్పాలకున్న కథను నిజాయిగా చెప్పే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి.  బాలయ్య పర్ఫెక్ట్ గా వాడుకొని ఆయనతో ఓ మంచి సందేశాన్ని చెప్పించాడు. అక్కడక్కడా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ బ్లాక్ లు , ఎలివేషన్స్ కూడా బాగా ప్లాన్ చేసుకున్నాడు. అవి సినిమాకి హైలైగ్ గా నిలిచాయి. బాలయ్య ఇంట్రడక్షన్ ఫైట్ , ఇంటర్వెల్ ఫైట్ , ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే ఫైట్ బాగున్నాయి. వాటిని డిజైన్ చేసిన విధానం బాగుంది. బాలయ్య – కాజల్ ట్రాక్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. వారి మధ్య వచ్చే లవ్ సీన్స్ వర్కవుట్ అవ్వలేదు. విలన్ పాత్ర , ఆ పాత్ర తాలూకు రీవెంజ్ రొటీన్ అనిపిస్తుంది. అలాగే హీరో తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో లేదు. ఇవి కాస్త మైనస్ అనిపిస్తాయి.

 ఆడ పిల్లను షేర్ లా పెంచాలి అంటూ ఈ సినిమా ద్వారా దర్శకుడు అనిల్ రావిపూడి ఇచ్చిన సందేశం బాగుంది. ఆ సందేశంతో కూడిన సీన్ క్లాప్స్ కొట్టిస్తుంది. బాలయ్య చిన్న పిల్లల మంచి కోరి చెప్పే డైలాగ్స్ తో వచ్చే ఆ  సీన్ హైలైట్ అనిపిస్తుంది. ‘భగవంత్ కేసరి’ మాస్ కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో కరెంట్ జెనెరేషన్ కి మంచి  సందేశం  ఉంది. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి.

 

రేటింగ్ : 3 /5