Movie Review - మంచి రోజులు వచ్చాయి

Thursday,November 04,2021 - 12:10 by Z_CLU

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, అజయ్ ఘోష్ , కోటేశ్వరావు, వెన్నెల కిషోర్ , ప్రవీణ్,సత్యం రాజేష్ , సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి , సుదర్శన్ , రజిత తదితరులు

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

సంగీతం: అనూప్ రూబెన్స్

నిర్మాణం : యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్

నిర్మాత: వి సెల్యూలాయిడ్ SKN

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి

నిడివి : 142 నిమిషాలు

విడుదల తేది : 4 నవంబర్ 2021

సంతోష్ శోభన్, మెహ్రీన్ కాంబోలో మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘మంచి రోజులు వచ్చాయి‘ సినిమా ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘పక్కా కమర్షియల్’ షూటింగ్ గ్యాప్ లో కోవిడ్ టైంలో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? మారుతి బ్రాండ్ ఎంటర్టైన్ మెంట్ పూర్తి స్థాయిలో అలరించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

manchi rojulochaie movie review
కథ :

బాలాజీ నగర్ కాలనీలో ఉండే గుండు గోపాళం(అజయ్ ఘోష్) ఎప్పుడూ సంతోషంగా ఉండటంతో జెలసీగా ఫీలయ్యే పక్కింటి మిత్రులు కోటి(కోటేశ్వరరావు), మూర్తి (పీడి శ్రీనివాస్) అతని ముఖంపై చిరునవ్వు దూరం చేయాలనుకుంటారు. అందులో భాగంగా కూతురు పద్దు(మెహ్రీన్) ప్రేమ విషయాన్ని గోపాళంకి తెలియజేస్తూ అతన్ని భయపెడుతూ బాధపడేలా చేస్తుంటారు.

పక్కింటి మిత్రుల మాటలతో కూతురు ప్రేమించిన సంతోష్(సంతోష్ శోభన్)ని అల్లుడిగా రిజెక్ట్ చేస్తాడు గోపాళం. అలా భయస్తుడైన గోపాళం చివరికి తన సంతోష్ ద్వారా ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు? గోపాళంని భయపెట్టి జీవించేలా చేసిన కోటి, మూర్తిలు చివరికి ఏం తెలుసుకున్నారు ? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

సంతోష్ శోభన్ చాలా ఈజ్ తో నటించాడు. సంతు పాత్రకి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. కంప్లీట్ గా మారుతి హీరోలానే కనిపించాడు. పద్దు పాత్రలో మెహ్రీన్ మంచి నటన కనబరిచి సినిమాకు ప్లస్ అయింది. ఇక కథ అంతా తన చుట్టూనే తిరిగే పాత్ర దొరకడంతో అజయ్ ఘోష్ తన నటనతో మెప్పించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇటు ఎమోషన్, అటు కామెడీ రెండిని బ్యాలెన్స్ చేస్తూ నటించాడు. సినిమా అంతా ఉండే ఫుల్ లెంగ్త్ పాత్రలు దొరకడంతో కోటేశ్వరరావు, పీడి శ్రీనివాస్ క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చారు. వెన్నెల కిషోర్ డైలాగ్ కామెడీ అలరించింది. కామెడీ ఎపిసోడ్స్ లో ప్రవీణ్ బాగా నవ్వించాడు. సప్తగిరి క్యారెక్టర్ లో పెద్దగా ఫన్ లేకపోవడంతో నవ్వించలేకపోయాడు.

సుదర్శన్ తన టైమింగ్ తో నవ్వించాడు. భర్తపై అనుమానపడే కామెడీ ఎపిసోడ్ లో రజిత నటన నవ్వు తెప్పించింది. వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం పనితీరు :

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ఎక్కేసిందేక్కేసింది పాటతో పాటు టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అలాగే సాంగ్ లో బ్లర్ చేస్తూ కొత్తగా ట్రై చేశారు. ఉద్దవ్ ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. మారుతి కథ -కథనం ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

Manchi Rojulochaie movie santosh shoban mehreen
జీ సినిమాలు సమీక్ష :

మారుతి బ్రాండ్ నుండి ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ రాబోతుందని తెలియగానే ‘మంచి రోజులు వచ్చాయి’ పై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. ‘ప్రతి రోజు పండగే’ లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి నుండి వస్తున్న సినిమా కావడంతో రిలీజ్ కి ముందే మంచి బజ్ కూడా దక్కించుకుంది. అయితే టీజర్, ట్రైలర్ చూసి అలా అంచనాలు పెట్టుకొని థియేటర్స్ లో అడుగు పెట్టిన ఆడియన్స్ ని ఈసారి పూర్తిగా మెప్పించలేకపోయాడు మారుతి.

భయం అనే ఒక సింపుల్ లైన్ తీసుకొని దాని చుట్టూ కథనం రాసుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. ముఖ్యంగా తక్కువ టైంలో రెడీ అయిన స్క్రిప్ట్ కావడంతో కంటెంట్ లో క్వాలిటీ మిస్ అయిందనిపించింది. ఇక కొన్ని సన్నివేశాలు చూస్తే మారుతి లాంటి దర్శకుడు ఇలాంటి సన్నివేశాలు రాసుకున్నాడేంటి అనిపించకమానదు. ప్రాణం పోతుందని భయపడే వ్యక్తి ని, తన చుట్టూ జెలసీతో ఉండే ఇద్దరు వ్యక్తులు ఎలా భయపెట్టారు? అతన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారు ? ఇదే మారుతి సినిమా కోసం తీసుకున్న కథా వస్తువు. ఈ సింపుల్ లైన్ తో రెండు గంటల సినిమా నడిపించడం అంటే మాటలు కాదు. మధ్యలో చాలానే యాడ్ చేయాలి. మారుతి లవ్ ట్రాక్ తో పాటు కొన్ని హిలేరియస్ ఎపిసోడ్స్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. అవి మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి.

ప్రతీ రోజు పండగే సినిమా కోసం ఒక థిన్ లైన్ తీసుకొని దాని చుట్టూ హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ అల్లాడు మారుతి. అందులో ఎమోషన్ కూడా క్యారీ అయింది. ఇందులో ఆ రెండూ మిస్ అయ్యాయి. అలా అని సినిమాలో ఎంటర్టైన్ మెంట్ లేదని చెప్పలేం. అప్పడాల విజయలక్ష్మి అనే కామెడీ ట్రాక్ తో రెండు ఎపిసోడ్స్ బాగా పేలాయి. ఆ ఎపిసోడ్స్ కి నవ్వులతో థియేటర్ అంతా ఊగిపోయింది. అజయ్ ఘోష్-ప్రవీణ్ క్యారెక్టర్స్ తో మారుతి రాసుకున్న ఆ కామెడీ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఇలా సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ బాగా రాసుకున్నాడు మారుతి.

ఇక సినిమా ఆరంభంలో తండ్రి కూతురు మధ్య అలాగే చివర్లో తల్లి కొడుకు మధ్య ఎమోషనల్ సీన్స్ రాసుకున్నాడు మారుతి కానీ అవి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అవి కొంత వరకూ మాత్రమే కనెక్ట్ అయ్యాయి తప్ప సినిమాకు ఎడ్వాంటేజ్ అవ్వలేకపోయాయి.

ఒక కాలనీ అక్కడ ఉండే ఇద్దరు తమ జెలసీతో ఒక మిత్రుడిని భయం అనే జబ్బుతో ఎలా భయపెట్టారు? అంటూ తన వాయిస్ ఓవర్ తో సినిమా మొదలు పెట్టిన దర్శకుడు మారుతి మొదటి భాగాన్ని ఎంటర్టైన్ మెంట్, లవ్ సీన్స్ తో బాగానే నడిపించినప్పటికీ సెకండాఫ్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యాడు. బలమైన సన్నివేశాలు రాసుకోలేకయాడు. ముఖ్యంగా కరోన అనే ఎలిమెంట్ పెట్టుకొని దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. దాంతో సెకండాఫ్ లో కరోన మీద మారుతి మార్క్ హిలేరియస్ కామెడీ ఉంటుందని ఊహించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఫైనల్ గా ‘చెడపకురా చెడేవు’ అనే సందేశంతో పాటు భయమే మనిషికి ఉన్న అతి పెద్ద జబ్బు అంటూ ఎంటర్టైనర్ మెంట్ తో మారుతి తీసిన ‘మంచి రోజులు వచ్చాయి’ కామెడీ సినిమాలను ఎంజాయ్ చేసే వారిని మోస్తరుగా మెప్పిస్తుంది.

రేటింగ్ 2.5 /5