'ఎం.ఎల్.ఎ' మూవీ రివ్యూ

Friday,March 23,2018 - 03:32 by Z_CLU

నటీ నటులు : కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, రవి కిషన్, బ్రహ్మానందం, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా,ప్రభాస్ శ్రీను, లాస్య , మనాలి రాథోడ్ తదితరులు

సంగీతం : మణి శర్మ

సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ

సమర్పణ : T.G. విశ్వప్రసాద్

కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల

నిర్మాతలు : C భరత్ చౌదరి, M. V. కిరణ్ రెడ్డి

కథ- స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.

విడుదల తేది : 23 మార్చ్ 2018

 

‘ఎంఎల్.ఎ’ అంటూ ఈరోజే థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఉపేంద్ర మాధవ్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందీ సినిమా. మరి ఈ సినిమాతో మంచి లక్షణాలున్న అబ్బాయిగా కళ్యాణ్ రామ్ ఎలా ఎంటర్టైన్ చేశాడో..తెలుసుకుందాం.


కథ :

మంచి లక్షణాలున్న అబ్బాయి అనిపించుకునే కళ్యాణ్(కళ్యాణ్ రామ్) తల్లి దండ్రులను ఎదురించి చెల్లిలు లక్ష్మి(లాస్య)కి తను ప్రేమించే ప్రసాద్ (వెన్నెల కిషోర్)తో పెళ్లి చేస్తాడు. అయితే ఆ పెళ్లి ఇంట్లో ఇష్టం లేకపోవడంతో వారిద్దరినీ తీసుకొని బెంగుళూర్ వెళ్తాడు కళ్యాణ్. ఈ క్రమంలో కళ్యాణ్ అనుకోకుండా మ్యాజికల్  బాండింగ్  లా  పదే పదే కలిసే ఇందు(కాజల్) తో ప్రేమలో పడతాడు. కళ్యాణ్ పనిచేసే ఆఫీస్ కి చైర్మన్ కూతురిగా అడుగుపెడుతుంది ఇందు. అలా చైర్మన్ కూతురిగా ఆఫీస్ లోకి ఎంటర్ అయిన ఇందు గతం తెలుసుకొని షాక్ అవుతాడు కళ్యాణ్. ఇంతకీ ఇందు ఎవరు..? ఆమెకి వీరభద్రపురం ఎం.ఎల్.ఎ గాడప్ప(రవి కిషన్) కి సంబంధం ఏమిటి ? ఆ నియోజిక వర్గంలో గాడప్ప కు పోటీగా కళ్యాన్ ఎం.ఎల్.ఎ గా ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది. ఇంతకీ కళ్యాణ్ ‘ఎం.ఎల్.ఎ’ గా గెలిచాడా..? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

‘మంచి లక్షణాలున్న అబ్బాయి’గా తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు కళ్యాణ్ రామ్. కాజల్ గ్లామరస్ క్యారెక్టర్ తో మరోసారి ఆకట్టుకుంది. బ్రహ్మానందం, పోసాని తమ కామెడితో ఎంటర్ టైన్ చేశారు. మురళి మోహన్, మనాలి రాథోడ్, రవి కిషన్, నాగినీడు,అజయ్, జయప్రకాశ్ రెడ్డి, పృథ్వి , శివాజీ రాజా మిగతా వారందరు తమ పరిధిలో బాగానే నటించి క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

ఇలాంటి పక్కా కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. సాంగ్స్ తో పాటు బాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్టుగా అందించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు మణిశర్మ. ‘మోస్ట్ వాంటెడ్ అబ్బాయి’,’ఓ ఇందు’,’గర్ల్ ఫ్రెండ్’,’యుద్ధం యుద్ధం’ పాటలు బాగున్నాయి. పాటలకు రామజోగయ్య శాస్త్రీ, కాసర్ల శ్యాం అందించిన సాహిత్యం బాగుంది. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయ్యింది. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాల్లో దర్శకుడు ఉపేంద్ర మాధవ్ కామెడి డైలాగ్స్ బాగానే పేలాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

‘ఇజం’ సినిమా తర్వాత హీరోగా ఏడాది గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎం.ఎల్.ఎ’ అంటూ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గతంలో శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన ఉపేంద్ర మాధవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

మొదటి సినిమాకు కమర్షియల్ ఎంటర్ టైనర్ కథను సెలెక్ట్ చేసుకున్న ఉపేంద్ర మాధవ్ తన స్క్రీన్ ప్లేతో జస్ట్ పరవాలేదనిపించుకున్నాడు. రొటీన్ కథే అయినా దాన్ని మరీ బోర్ కొట్టించకుండా బ్యాలెన్స్ చేశాడు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. అలాగే  పిల్లలందరూ చదువుకోవాలనే చిన్నపాటి సందేశం కూడా అందించాడు. మంచి లక్షణాలున్న అబ్బాయి, ఎం.ఎల్.ఎ గా ఎందుకు మారాడు అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఇంటర్వెల్ ట్విస్ట్, సాంగ్స్, ఫైట్స్ , కామెడితో ఓ మోస్తరుగా ఎంటర్ టైన్ చేశాడు. ఇక ఈ సినిమాతో పూర్తిస్థాయి పొలిటికల్ సినిమాను కూడా బాగానే డీల్ చేయగలడని నిరూపించుకున్నాడు కళ్యాణ్ రామ్. ‘పటాస్’ సినిమాతో మళ్ళీ ఫాంలొకొచ్చిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో కూడా అదే రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తాడనుకుంటే మాత్రం నిరాశ తప్పదు.

కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామర్, మణిశర్మ మ్యూజిక్, బ్రహ్మానందం- పోసాని కామెడి, ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ లో పొలిటికల్ సన్నివేశాలు, క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. ఇక రొటీన్ అనిపించే కథ, కొన్ని సన్నివేశాలు గతంలో గత సినిమాలను గుర్తుచేసేలా ఉండటం, లాజిక్స్ లేని సన్నివేశాలు సినిమాకు మైనస్. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ‘ఎం.ఎల్.ఎ’ పరవాలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2.75 /5