"మిస్టర్" రివ్యూ

Friday,April 14,2017 - 03:21 by Z_CLU

విడుదల : ఏప్రిల్ 13th, 2017

నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్

సినిమాటోగ్రఫీ : కె.వి.గుహన్

మ్యూజిక్ : మిక్కీ జె.మేయర్

నిర్మాత : నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు

రచన : గోపి మోహన్, శ్రీధర్ సీపాన

స్క్రీన్-దర్శకత్వం : శ్రీను వైట్ల

వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్’ ఈ రోజే థియేటర్స్ లోకొచ్చింది. మరి మిస్టర్ గా వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలా ఎంటర్టైన్ చేసాడో..చూద్దాం..

కథ :

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడు… అలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ మీరా, చై కి ఏం చెప్పింది? చై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరు? చివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.? ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను
ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం..


నటీనటుల పనితీరు:

లవర్ బాయ్ లుక్ లో ‘మిస్టర్’ గా ఎట్రాక్ట్ చేసిన వరుణ్ తేజ్ తన పెర్ఫార్మెన్స్ తో పిచ్చై నాయుడు రోల్ కి పూర్తి న్యాయం చేశాడు.హెబ్బా పటేల్, లావణ్య తమ గ్లామర్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు. ప్రిన్స్ గెస్ట్ రోల్ తో పరవాలేదనిపించుకున్నాడు. రఘుబాబు-శ్రీనివాసరెడ్డి , మాస్టర్ బిగ్ న్యూ తమ కామెడీ తో ఎంటర్టైన్ చేశారు. ఇక నాజర్,చంద్ర మోహన్, నాగినీడు, తనికెళ్ళ భరణి, నీకితిన్ ధీర్, రవి ప్రకాష్, పృథ్వి, శేషు,ఫిష్ వెంకట్, షకలక శంకర్, సత్య, ప్రియదర్శి, భద్రం, అభయ్ తమ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు.


టెక్నీషియన్స్ పనితీరు :

తన సినిమాటోగ్రఫీతో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు కె.వి.గుహన్. ముఖ్యంగా కొన్ని లొకేషన్స్, పాటల పిక్చరైజేషన్ లో సీనియర్ సినిమాటోగ్రాఫర్ గా తన సత్తా చాటాడు.. మిక్కీ మ్యూజిక్ పరవాలేదు. ‘ఏదో ఏదో బాగుందే’ సాంగ్ బాగుంది. కొన్ని కామెడీ డైలాగ్స్ ఎంటర్టైన్ చేశాయి. స్టోరీ-స్క్రీన్ ప్లే మైనస్ గా నిలిచాయి..ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష:

తన బ్రాండ్ కామెడీ, స్టోరీలైన్స్ తో గ్రాండ్ హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల ‘ఆగడు’,’బ్రూస్ లీ’ సినిమాల తర్వాత తెరకెక్కించిన సినిమా ‘మిస్టర్’. ప్యూర్ లవ్ స్టోరీగా టీజర్ తో అందరినీ మెస్మరైజ్ చేసి సినిమా పై అంచనాలు పెంచిన వైట్ల… ‘మిస్టర్’ తో మరోసారి రొటీన్ కమర్షియల్ స్టోరీ తోనే అలరించే ప్రయత్నం చేశాడు. గతంలో తన మార్క్ కామెడీ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసినప్పటికీ.. మరోసారి అదే రొటీన్ కామెడీని నమ్ముకొని రొటీన్ కథతో మెప్పించలేకపోయాడు.. కథలో ఫస్ట్ హాఫ్ అంతా యూరప్ చుట్టూ తిప్పిన శ్రీను వైట్ల సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ తో బోర్ కొట్టించాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్, వరుణ్ తేజ్, హెబ్బా- లావణ్య గ్లామర్,ఎమోషన్ సీన్స్, డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. రొటీన్ స్టోరీ, కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు, ఊహించేవిధంగా సాగే స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్ పాయింట్స్. ఫైనల్ గా ‘మిస్టర్’ లవర్ బాయ్ గా ఎంటర్టైన్ చేయలేకపోయాడు.

రేటింగ్ 2/5