Micro Review - FCUK

Saturday,February 13,2021 - 12:40 by Z_CLU

తెలుగులో ఈమధ్య కాలంలో చాలా బోల్డ్ సినిమాలొస్తున్నాయి. బోల్డ్ పేరిట చెత్త చూపించే సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన FCUK అనే సినిమాను ఏ కేటగిరీలో పెట్టలేం. మంచి మెసేజ్ తో కూడిన బోల్డ్ సినిమా అంటూ దీనికి ప్రచారం కల్పించినప్పటికీ.. మూవీలో తలనొప్పి సన్నివేశాలే ఎక్కువే.

అక్రమ సంబంధాలు, కండోమ్స్, స్త్రీల ఆరోగ్య సమస్యలు, లవ్-సెక్స్.. ఇలా చాలా అంటే చాలానే చర్చించారు ఈ సినిమాలో. కానీ ఏదీ పద్ధతిగా ఉండదు. FCUK అనే టైటిల్ చూస్తే ఇదేదో బూతు సినిమా అనే ఫీలింగ్ వస్తుందని, కానీ ఇదొక బోల్డ్ సినిమా అంటూ మేకర్స్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్లు చెప్పినట్టు ఇది బోల్డ్ సినిమానే. కాకపోతే “మీడియం లెవెల్ బూతు బోల్డ్ సినిమా” అనొచ్చు.

రంజిత్ మూవీస్ బ్యానర్ పై మంచి సినిమాలొచ్చాయి. ఇది కూడా ఆ బ్యానర్ స్థాయికి తగ్గట్టు డిఫరెంట్ గా ఉంటుందని చాలామంది ఊహించారు. కానీ కొత్తదనం కోసం పాకులాడే క్రమంలో తీసిన నాసిరకం సినిమా ఇది. చివరికి హీరోహీరోయిన్ల మధ్య కాన్ ఫ్లిక్స్ కోసం కూడా కండోమ్ ను వాడడం ఈ సినిమాలో పరాకాష్ట. అందుకేనేమో బయటకొచ్చిన ప్రేక్షకులు దీన్ని ‘కండోమ్ సినిమా’ అంటున్నారు. అందులో తప్పులేదనిపిస్తుంది.

నటీనటులు: రామ్ కార్తిక్, అమ్ము అభిరామి, జగపతిబాబు, బ్రహ్మాజి, శ్రీలక్ష్మి, కృష్ణభగవాన్, ఆలి, మాస్టర్ భరత్ తదితరులు.
ఎడిటింగ్‍: మద్దాలి కిషోర్
సంగీతం: భీమ్స్
ఛాయాగ్రహణం: జి. శివ
నిర్మాత: దామోదర్ ప్రసాద్
రచన, దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిడివి: 2 గంటల 49 నిమిషాలు
సెన్సార్: A
విడుదల తేదీ: ఫిబ్రవరి 12, 2021
రేటింగ్: 1.5/5