'మెంటల్ మదిలో' రివ్యూ

Friday,November 24,2017 - 11:54 by Z_CLU

నటీనటులు : శ్రీ విష్ణు, నివేత పేతురాజ్, అమృత, శివాజీ రాజా, అనిత తదితరులు

సంగీతం : ప్రశాంత్ విహారి

కెమెరా : వెదరామన్

నిర్మాణం : ధర్మపథ క్రియేషన్స్

నిర్మాత : రాజ్ కందుకూరి

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వివేక్ ఆత్రేయ

రిలీజ్ డేట్ : 24 -11 2017

‘పెళ్ళిచూపులు’ తర్వాత వివేక్ ఆత్రేయ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మాత రాజ్ కందుకూరి ఓ మ్యూజికల్ లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తున్నాడనగానే “మెంటల్ మదిలో” సినిమా పై బజ్ క్రియేట్ అయింది. ఇక సెలెబ్రిటీ లు సైతం ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ఈ సినిమా రిలీజ్ కి ముందే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీ విష్ణు,, నివేత పెతురాజ్ జంటగా నటించిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసిందో..తెలుసుకుందాం.

కథ :

చిన్నతనం నుంచి ప్రతీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ కన్ఫ్యూజన్ కి బ్రాండ్ అంబాసిడర్ లా మారిన అరవింద్ కృష్ణ(శ్రీ విష్ణు)…ఎన్నో పెళ్లిచూపులు చూస్తూ తన కన్ఫ్యూజన్ తో ప్రతీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తుంటాడు. ఫైనల్ గా స్వేచ్చ(నివేత పెతురాజ్) అనే అమ్మాయిని పెళ్ళిచూపుల్లో చూసి భార్యగా పర్ఫెక్ట్ అని భావించి నిశ్చితార్థం చేసుకుంటాడు అరవింద్ కృష్ణ. అయితే ఈ క్రమంలో అరవింద్ కృష్ణ కి రేణుక(అమృత శ్రీనివాసన్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అసలు రేణుక ఎవరు.. అరవింద్ కి ఎలా పరిచయం అవుతుంది. డబుల్ మైండ్ తో ఏది కరెక్ట్ అని నిర్ణయించుకోలేని అరవింద్ చివరికీ ఈ ఇద్దరిలో ఎవర్నీ పెళ్లి చేసుకున్నాడు. అనేది సినిమా కథాంశం.


నటీనటుల పనితీరు :

కెరీర్ స్టార్టింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని క్యారెక్టర్స్ తో ఆకట్టుకున్న శ్రీ విష్ణు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ తో హీరోగా అందరినీ ఎట్రాక్ట్ చేసి హీరోగా ఓ సెపరేట్ ఇమేజ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విషయానికొస్తే తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో అరవింద్ కృష్ణ అనే కన్ఫ్యూజన్ క్యారెక్టర్ తో మరోసారి అందరినీ ఆకట్టుకొని సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. కోలీవుడ్ బ్యూటీ నివేత పెతురాజ్ తన పర్ఫార్మెన్స్ తో పాటు క్యూట్ లుక్ తో మెస్మరైజ్ చేసి సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. రేణుక క్యారెక్టర్ తో అమృత శ్రీనివాసన్ జస్ట్ పరవాలేదనిపించుకుంది. ఇక చాలా రోజుల తర్వాత శివాజీ రాజా తన కామెడి టైమింగ్ తో ఎంటర్టైన్ చేశాడు. అనిత, మధుమణి, కిరీటి మిగతా నటీ నటులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకుని పాత్రల్లో ఒదిగిపోయారు.

టెక్నిషియన్స్ పనితీరు :

మ్యూజికల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంగీతం ఎంత ఇంపార్టెన్స్ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి అలా సాగిపోతున్న ఈ సినిమాకు తన బాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ తో సినిమాకు ప్రాణం పోసి మెయిన్ హైలైట్ గా నిలిచాడు మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి. ముఖ్యంగా ‘మనవి ఆలకించరాదటే’,’గుమ్మడి కాయ హల్వా’,’ఏదోలా’,’ఊహలే’ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కిట్టు విస్సప్రగడ, వివేక్ ఆత్రేయ, భాస్కరభట్ల అందించిన సాహిత్యం బాగుంది. విప్లవ్ ఎడిటింగ్ బాగుంది… కానీ సెకండ్ హాఫ్ లో ఇంకాస్త ట్రిమ్ చేసి ఉండొచ్చనినిపిస్తుంది. మనీషా సత్యవోలు ఆర్ట్ వర్క్ బాగుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే సహజమైన మాటలు ఆకట్టుకున్నాయి. వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే- డైరెక్షన్ బాగుంది. రాజ్ కందుకూరి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

‘పెళ్లి చూపులు’ వంటి సూపర్ హిట్ తర్వాత వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడిని వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మాత రాజ్ కందుకూరి ‘మెంటల్ మదిలో’ అంటూ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ తో ఓ సినిమా నిర్మిస్తున్నాడగానే సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. ఇక స్టార్స్ సైతం ప్రేక్షకులు ఈ సినిమాను కచ్చితంగా చూడాలంటూ ప్రమోట్ చేయడంతో ‘మెంటల్ మదిలో’ ఇండస్ట్రీ లో కూడా ఓ చిన్న సైజు బజ్ క్రియేట్ చేసింది. నిజానికి ‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత ఓ స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోని సంప్రదించకుండా మళ్ళీ కొత్త వాళ్ళను ప్రోత్సహించాలనే ఆలోచనతో యంగ్ టీంతో కలిసి ఈ సినిమాను నిర్మించిన నిర్మాత రాజ్ కందుకూరిని ఈ సందర్భంగా అభినందించాల్సిందే.

ఇక సినిమా విషయానికొస్తే కొత్త దర్శకుడయినప్పటికీ ఈ కన్ఫ్యూజన్ సబ్జెక్ట్ ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా తెరకెక్కించి ఎంటర్టైన్ చేశాడు వివేక్ ఆత్రేయ. కొన్ని ఎమోషనల్ సీన్స్ , లవ్ సీన్స్ తో తన ప్రతిభ చాటుకున్నాడు. ముఖ్యంగా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే నటులను సెలెక్ట్ చేసుకొని దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు వివేక్.

శ్రీ విష్ణు క్యారెక్టర్, నివేత పెర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫన్, లవ్ ట్రాక్, శ్రీ విష్ణు-నివేత మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, స్క్రీన్ ప్లే, సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ట్విస్ట్, ఇంట్రెస్టింగ్ గా సాగే ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్స్ గా నిలవగా, సెకండ్ హాఫ్ లో కాస్త నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే, కొన్ని సందర్బాలలో వచ్చే రొటీన్ ఎలిమెంట్స్, శ్రీ విష్ణు – అమృత లవ్ ట్రాక్ సినిమాకు మైనస్. ఫైనల్ గా ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ గా ‘మెంటల్ మదిలో’ బాగానే ఎంటర్టైన్ చేస్తుంది.

రేటింగ్3/5