'మాతంగి' రివ్యూ

Saturday,January 06,2018 - 12:53 by Z_CLU

నటీ నటులు : రమ్య కృష్ణ, జయరాం , సాయి కుమార్, ఓం పూరి, శీలు, రమేష్ తదితరులు

సినిమాటోగ్రఫీ : జిత్తు దామోదర్

మ్యూజిక్ : రతీష్ వేఘ

ఎడిటింగ్ : పవన్ కుమార్

రచన : వెన్నెల కంటి

ఎడిటింగ్ : పవన్ కుమార్ .వి

నిర్మాణం : శ్రీనివాస విజువల్ ప్రై.లి.

నిర్మాత : వినయ కృష్ణన్

కథ : దినేష్ పల్లాత్

దర్శకత్వం : కన్నన్ తమరాక్కులమ్

 

2016 లో మలయాళంలో తెరకెక్కిన ‘అడుపులియాట్టం’ సినిమా తెలుగులో మాతంగి గా రిలీజ్ అయింది.. రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసిందో..తెలుసుకుందాం.


కథ :

సత్య జిత్(జయరాం) ఓ ప్రముఖ వ్యాపార వేత్త.. ఉన్నట్టుండి రాత్రి వేళలో సత్యజిత్ కి కొన్ని పీడ కలలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రోజు తన కుటుంబమంతా నాశనం అవ్వబోతుందనే కల కంటాడు… తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, సమస్య కి పరిష్కారం వెతుక్కుంటూ మహేశ్వర బాబా(ఓం పూరి) ని కలుస్తాడు. అయితే సత్యజిత్ గతంలో కొన్న ఓ పాత భవనం వల్లే ఈ సమస్య వచ్చిందని…అందులో ఉన్న మాతంగి అనే ఓ ఆత్మ వల్లే ఇదంతా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ పాత భవనంలో  ఆత్మగా మారిన మాతంగి ఎవరు …?  మాతంగి కి సత్యజిత్ కి సంబంధం ఏమిటి..? చివరికి ఆ ఆత్మ నుంచి సత్యజిత్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా…? అనేది సినిమా కథాంశం.

 

నటీ నటుల పనితీరు :

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో సత్యజిత్ గా జయరాం ఆకట్టుకున్నాడు. పవర్ ఫుల్ పాత్రలకు పెట్టింది పేరైన రమ్య కృష్ణ మరో సారి తన నటనతో మెస్మరైజ్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచింది. బాబా గా ఓం పూరి బెస్ట్ అనిపించుకున్నాడు. సంపత్ తన పర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు. ఇక శీలు అబ్రహం, రమేష్ పిశ్రడోయ్, సజు నవోదయ,అక్షర కిషోర్,ఆన్జేలీన అబ్రహం,సిద్దిక్, ఎస్.ఫై.శ్రీ కుమార్, ప్రదీప్ కొట్టాయం,రాహుల్ దేవ్, వీణ నయర్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

టెక్నిషియన్స్ పని తీరు :

హర్రర్ థ్రిల్లర్ సినిమాకు బాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎంత ముఖ్యమో తెలిసిందే… తన బాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు రతీష్ వేగ. జిత్తు దామోదర్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ బాగుంది.. శేఘు కె.యం.ఆర్ సౌండ్ డిజైన్ సినిమాకు ప్లస్ అయ్యింది. మాఫియా శశి కంపోజ్ చేసిన స్టంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. పవన్ కుమార్ ఎడిటింగ్ బాగుంది. సహస్ బాల ఆర్ట్ వర్క్ బాగుంది. దినేష్ పల్లాత్ అందించి అందించిన కథ రొటీన్ అనిపించినా దర్శకుడు కన్నన్ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించి ఎంటర్ టైన్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

మలయాళంలో విజయం సాదించిన ‘ఆడుపులియాట్టం’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రమ్య కృష్ణ చెల్లెలు విని కృష్ణన్. ఇటివలే బాహుబలి తో అందినీ మెప్పించిన రమ్య కృష్ణ ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ తో సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఇక సినిమా విషయానికొస్తే కథ పాతదే అయినప్పటికీ… దర్శకుడు తన మేకింగ్ తో ఆధ్యాంతం ఆసక్తికరంగా రూపొందించి ఎంటర్టైన్ చేశాడు. సినిమా ప్రారంభం నుంచే సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించి చివరి వరకూ అదే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో భయపెడుతూ ఎంటర్ టైన్ చేశాడు. ముఖ్యంగా జయరాం , రమ్యకృష్ణ,  క్యారెక్టర్స్ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు.

ప్రారంభంలో పదినిమిషాల పాటు వచ్చే హారర్ ఎలిమెంట్స్, ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే , రమ్యకృష్ణ, జయరాం, ఓం పూరి, సంపత్ రాజ్ క్యారెక్టర్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అక్కడక్కడ థ్రిల్లి కలిగించే ఎలిమెంట్స్, బాగ్రౌండ్ స్కోర్, పాటలు , ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. రొటీన్ స్టోరీ, రమ్య కృష్ణ మినహా తెలుగులో పరిచయం ఉన్న నటులు లేకపోవడం,   థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, కామెడీ పండకపోవడం, అక్కడక్కడ బోర్ అనిపించే సీన్స్ సినిమాకు మైనస్.. ఓవరాల్ గా ‘మాతంగి’ హారర్ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికీ నచ్చుతుంది.

రేటింగ్ : 2.5 /5