'మనసుకు నచ్చింది' మూవీ రివ్యూ

Friday,February 16,2018 - 02:17 by Z_CLU

నటీనటులు: సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, నాజర్, అదిత్, పునర్నవి భూపాలం, జాన్వి స్వరూప్, ప్రియదర్శి, అభయ్ తదితరులు ముఖ్యపాత్రలు
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ: రవియాదవ్
సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: పి.కిరణ్-సంజయ్ స్వరూప్
కథ-కథనం-దర్శకత్వం: మంజుల ఘట్టమనేని
రిలీజ్ డేట్ : 16 ఫిబ్రవరి 2018

 

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల మొదటిసారిగా దర్శకత్వం వహించిన ‘మనసుకి నచ్చింది’ సినిమా ఈరోజే విడుదలైంది. మరి యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో సందీప్ కిషన్ ఎలా ఎంటర్టైన్ చేసాడో…చూద్దాం.


కథ : సూరజ్(సందీప్ కిషన్) నిత్య(అమైరా దస్తూర్) ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరి రిలేషన్ షిప్ చూసి ఇంట్లో వీళ్లిద్దరికి పెళ్లి నిశ్చయిస్తారు. అయితే ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరూ భార్యభర్తలుగా మారడం ఇష్టం లేకపోవడంతో మాకు ఈ పెళ్లి ఇష్టంలేదంటూ ఓ లెటర్ ద్వారా ఇంట్లో వాళ్ళకి తెలియజేసి గోవాకి వెళ్ళిపోతారు. అలా గోవా వెళ్లిన వీరిద్దరూ తమ మధ్య ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ప్రేమ ఉందని ఎలా తెలుసుకున్నారు. చివరికి ఎలా ఒకటయ్యారు అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

సందీప్ కిషన్ తన పెర్ఫార్మెన్ తో ఎప్పటి లాగే జస్ట్ పరవాలేదనిపించుకున్నాడు. అమైరా దస్తూర్, త్రిదా తమ గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసారే తప్ప తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోలేకపోయారు. ప్రియదర్శి, అభయ్ కొన్ని సందర్భాల్లో ఎంటర్టైన్ చేశారు. అదిత్ తన పెర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకున్నాడు. బేబీ జాన్వీ నటన బాగుంది. ఇక నాజర్, పునర్నవి భూపాలం, జాన్వి, స్వరూప్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు పనిచేసిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ రవి యాదవ్ గురించే. తన కెమెరా వర్క్ తో మెస్మరైజ్ చేసి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు రవి యాదవ్. ముఖ్యంగా ప్రకృతిని అద్భుతంగా చూపించాడు. కొన్ని ఫ్రేమ్స్ పెయింటింగ్ లా అనిపిస్తాయి. రధన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. పర్ఫెక్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి హైలైట్ గా నిలిచాడు. ఎడిటింగ్ పరవాలేదు కానీ ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చనిపించింది. కొన్ని సందర్భాల్లో సాయి మాధవ్ అందించిన సంభాషణలు బాగున్నాయి. మంజుల స్క్రీన్ ప్లే బోర్ కొట్టిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

తెలుగులో ఎన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ వచ్చినా స్క్రీన్ ప్లే తో మేజిక్ చేస్తే సూపర్ హిట్. అందుకోవడం చాలా ఈజీ. లేటెస్ట్ గా వచ్చిన కొన్ని లవ్ స్టోరీసే దీనికి ఉదాహరణ. ఆ మధ్య రెండు సినిమాలతో నటిగా అలరించిన మంజుల మొదటిసారిగా దర్శకత్వం వహిస్తుందంటే, ఓ లేడి డైరెక్టర్ గా ఈ లవ్ స్టోరీని బాగానే డీల్ చేస్తుందని ఊహించారు ప్రేక్షకులు. అయితే అలా ఊహించిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది.

ఓ ఇద్దరూ స్నేహితుల మధ్య జరిగే ప్రేమకథను ప్రకృతితో కనెక్ట్ చేస్తూ చూపించాలనుకున్న మంజుల.. ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా సందీప్ కిషన్ కి అమైరా దస్తూర్ కి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాకపోవడం సినిమాకు పెద్ద మైనస్. ఒకానొక సందర్భంలో అసలీ రొటీన్ లవ్ స్టొరీ, స్లో నెరేషన్ తో మంజుల ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలనుకున్నారనే డౌట్ వస్తుంది.

సినిమాటోగ్రఫీ, సాంగ్స్, కొన్ని సన్నివేశాలు, సాంగ్స్ పిక్చరైజేషన్, రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా… హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాకపోవడం, సాదాసీదాగా అనిపించే స్క్రీన్ ప్లే, స్లో నెరేషన్, లవ్ ట్రాక్ కనెక్ట్ కాకపోవడం మైనస్.

రేటింగ్ – 2.5/5