'మహాన్' మూవీ రివ్యూ

Thursday,February 10,2022 - 07:19 by Z_CLU

నటీ నటులు : విక్రమ్ కుమార్ , ధృవ్ విక్రమ్ , బాబీ సింహా , సిమ్రాన్ , వాణి భోజన్ తదితరులు

సంగీతం : సంతోష్ నారాయణ్

సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ

రచన -దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్

నిర్మాత : లలిత్ కుమార్

విడుదల : 10 ఫిబ్రవరి 2022

కొత్త కథలు , విభిన్న పాత్రలతో సినిమాలు చేసే విలక్షణ నటుడు విక్రమ్ కొంత కాలంగా ప్రేక్షకులను నిరాశ పరుస్తూ వస్తున్నాడు. తాజాగా ‘మహాన్’ తో మరో సారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు విక్రమ్. తనయుడు ధృవ్ విక్రమ్ తో కలిసి విక్రమ్ చేసిన ఈ సినిమా మీద ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. మరి విక్రమ్ , ద్రువ్ విక్రమ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి ఆకట్టుకున్నారా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథేంటి ?

మహాన్ గాంధీ (విక్రమ్) ని తన తండ్రి (ఆడుకులం నరేన్) ఎలాంటి మచ్చ లేకుండా తన కొడుకు గాంధీ అంత గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. అలాగే ఎదిగిన గాంధీ మహాన్ నాచి (సిమ్రాన్) ని పెళ్లి చేసుకొని తనకిష్టం లేని లైఫ్ నే కొనసాగిస్తాడు. తరతరాలుగా మధ్యాపాన నిషేదంపై పోరాటం చేసే కుటుంబంలో పుట్టి పెరిగిన మహాన్ ఓ సందర్భంలో మద్యపానం చేస్తూ చివరికి దానికి బానిసగా మరాతాడు.తర్వాతి క్రమంలో (సత్యవన్) బాబీ సింహాతో కలిసి ఒక గ్యాంగ్ స్టర్ గా మారతాడు. ఈ క్రమంలో మహాన్ కి ఎదురైన సవాళ్ళు ఏంటి ? మహాన్ కి నైరోజి(ధృవ్ విక్రమ్) మధ్య ఎలాంటి సంఘర్షణలు జరిగాయి ? అసలు వీరిద్దరికీ సంబంధం ఏమిటి ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పేదేముందు. గొప్ప నటుడని తెలిసిందేగా .. ఎప్పటిలానే క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు. మహాన్ క్యారెక్టర్ కోసం కొత్త లుక్ ట్రై చేసి ఎట్రాక్ట్ చేశాడు. పాత్రలో ఒదిగిపోయి నటించాడు. తండ్రికి తగ్గట్టుగానే నటించి దాదా పాత్రకు న్యాయం చేశాడు ద్రువ్. క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ తీసుకొని పెర్ఫామ్ చేశాడు. సిమ్రన్ , బాబీ సిన్హా,వాణి భోజన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే శ్రేయాస్ కృష్ణ కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంది. కొన్ని విజివల్స్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. వివేక్ హర్షన్ ఎడిటింగ్ పరవాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని అలరించేలా తెరకెక్కించారు. కార్తీక్ సుబ్బరాజ్ ఎంచుకున్న కథ రొటీన్ గానే ఉంది. కథనం అక్కడక్కడా నెమ్మదిగా సాగింది. అది సినిమాకు కొంత వరకూ మైనస్. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 

జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ :

కార్తీక్ సుబ్బరాజ్ ‘మహాన్’ కోసం చాలా సినిమాల్లో చూసిన రొటీన్ కథనే ఎంచుకున్నాడు. కాకపోతే ట్రీట్ మెంట్ మార్చే ప్రయత్నం చేశాడు. తను అనుకున్నది అనుకున్నట్లు చెప్పాడు కానీ స్క్రీన్ ప్లే అక్కడక్కడా నెమ్మదిగా సాగడం సినిమాకు పెద్ద మైనస్. అలాగే మొదటి భాగంలో వచ్చే సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగాన్ని కాస్త ఆసక్తిగా నడిపించే ప్రయత్నం చేసి కొంత వరకూ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కొన్ని సందర్భాల్లో యాక్షన్ క్రైం డ్రామాను తన స్మార్ట్ స్క్రీన్ ప్లే తో బాగానే డీల్ చేశాడని అనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.

అయితే మద్యపాన నిషేదాన్ని కథా వస్తువుగా తీసుకొని దానికి తగ్గట్టుగా యాక్షన్ డ్రామా క్రియేట్ చేసి మెస్మరైజ్ చేయలేకపోయాడు దర్శకుడు. విక్రమ్ , ధృవ్ విక్రమ్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. అవి వారి అభిమానులను మెప్పించేలా ఉన్నాయి. ఇక కొన్ని సన్నివేశాలు చూస్తే ఎడిటర్ తన ఎడిటింగ్ టాలెంట్ చూపించి ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదనిపించింది.

నిజానికి గ్యాంగ్ స్టర్ కథను అదిరిపోయే ట్విస్టులతో రేసింగ్ స్క్రీన్ ప్లేతో తీస్తే సినిమా కచ్చితంగా వర్కౌట్ అవుతుంది.  దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం తను నమ్మిన సిద్దంతాన్నే పట్టుకొని తన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే తోనే కథను నడిపించాడు. దీంతో సినిమా కొన్నిసందర్భాల్లో స్లో నెరేషన్ తో బోర్ కొట్టిస్తుంది. ఓవరాల్ గా విక్రమ్ , ధృవ్ విక్రమ్ లతో కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ‘మహాన్’ ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది తప్ప, పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

రేటింగ్ : 2.5 /5

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics