"మా వింత గాధ వినుమా" రివ్యూ

Sunday,November 15,2020 - 08:33 by Z_CLU

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, సీరత్‍ కపూర్‍, తనికెళ్ల భరణి, ప్రగతి, జయప్రకాష్‍, కమల్‍ కామరాజు, కల్పిక, రాజేశ్వరి నాయర్‍, ఫిష్‍ వెంకట్‍ తదితరులు
బ్యానర్: సిల్లీ మాంక్స్ స్టూడియోస్‍, ఆర్యత్‍ సినీ ఎంటర్‍టైన్‍మెంట్స్, మెలోడ్రామా స్టూడియోస్‍
నిర్మాతలు: సంజయ్‍ రెడ్డి, అనిల్‍ పల్లల, కీర్తి చిలుకూరి, జి. సునీత
దర్శకుడు: అదిత్య మండల
సంగీతం: శ్రీచరణ్‍ పాకాల
నేపథ్య సంగీతం: రోహిత్‍ పసుపర్తి, జాయ్‍ రాయరాల
రచన: సిద్ధు జొన్నలగడ్డ
స్క్రీన్ ప్లే: వంశీ అట్లూరి, సిద్ధు జొన్నలగడ్డ
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్‍ ఉమ్మడిసింగు
రన్ టైమ్: 101 నిమిషాలు
రిలీజ్ డేట్: నవంబరు 13, 2020

లాక్ డౌన్ టైమ్ లో సిద్ధు అండ్ హిజ్ లీల సినిమాతో హిట్ కొట్టిన సిద్ధూ జొన్నలగడ్డ.. దాదాపు అలాంటిదే మరో ప్రయత్నం చేశాడు. మా వింత గాధ వినుమా అంటూ మరోసారి
ఓటీటీలోకొచ్చాడు. మరి ఈసారి హిట్ కొట్టాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Maa Vintha Gaadha Vinuma Review telugu 3

కథ

ఇంజనీరింగ్ లో చేరిన సిద్ధూ (సిద్ధు జొన్నలగడ్డ), ఫస్ట్ ఇయర్ లోనే వినీత (సీరత్ కపూర్)కు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటాడు. కానీ సీనియర్స్ వల్ల సాధ్యం కాదు. రెండోసారి చెప్పాలనుకుంటాడు. కానీ అప్పటికే మరో క్లాస్ మేట్ ప్రపోజ్ చేస్తాడు. ఇక లాభం లేదనుకొని ఈసారి క్లాస్ రూమ్ లో అందరి ముందు చెప్పేస్తాడు. అలా వినీతకు ప్రపోజ్ చేసిన సిద్ధూ మెల్లగా ఆమె ప్రేమను పొందగలుగుతాడు.

అయితే సహజంగా ఉండే నిర్లక్ష్య ధోరణి, టెంపర్ వల్ల సిద్ధూ-వినీత మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. వినీతను తను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పేందుకు, ఆమెను ఉన్నఫలంగా పెళ్లి చేసుకుంటాడు సిద్ధూ. ఆ టైమ్ లో జరిగిన పార్టీలో తీసిన వీడియో వైరల్ అవ్వడంతో అది కాస్తా వివాదాస్పదంగా మారుతుంది. దీంతో వినీత కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది.

వైరల్ వీడియో వల్ల విడిపోయిన సిద్ధూ-వినీత మళ్లీ ఎలా కలిశారు..? వినీత ఫ్యామిలీ సిద్ధూను ఎలా అంగీకరించింది అనేది బ్యాలెన్స్ స్టోరీ.

 

నటీనటుల పనితీరు

సిద్ధూ మరోసారి తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. లవ్ సీన్స్, క్లైమాక్స్ లో బాగా చేశాడు. ఇలాంటి కథలకు తను పెర్ ఫెక్ట్ అని నిరూపించుకున్నాడు. సీరత్ కపూర్ కు కూడా మంచి పాత్ర దొరికింది కానీ బాగా చేయలేకపోయింది. ఆమెకు ఎందుకు అవకాశాలు పెద్దగా రావో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

సపోర్టింగ్ రోల్స్ చేసిన వాళ్లలో ప్రగతి నటన కాస్త అతి అనిపించగా.. కమల్ కామరాజు-కల్పిత చాలా బాగా చేశారు. వీళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి తణికెళ్ల భరణి. మధ్యమధ్యలో వచ్చే ఈ పాత్ర ఆడియన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. ఈసారి వైవా హర్షను పెద్దగా వాడుకోలేకపోయారు.

 

టెక్నీషియన్స్ పనితీరు:

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాకు ఇచ్చిన క్లాసికల్ టచ్, ఈ సినిమాకు కూడా ఇవ్వాలని చూశారు. కథపరంగా ఆ సినిమాకు క్లాసికల్ మ్యూజిక్ టచ్ ఇవ్వడం కరెక్ట్. కానీ ఈ సినిమాకు ఆ ఎత్తుగడ అస్సలు వర్కవుట్ కాలేదు. మరీ ముఖ్యంగా టైటిల్ జస్టిఫికేషన్ కోసం శ్రీచరణ్ పాకాల వృధా
ప్రయాస పడ్డాడు. రోహిత్-జాయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే.

ఈ చిన్న సినిమాకు సాయిప్రకాష్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీలో చాలా షాట్స్ మెప్పిస్తాయి. లైటింగ్ కంపోజిషన్ కూడా బాగుంది. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ ఓకే. నిర్మాతలు ఉన్నంతలో బాగానే ఖర్చుచేశారు.

ఇక డైరక్షన్ పరంగా చూసుకుంటే.. దర్శకుడు ఆదిత్య తన మార్క్ చూపించలేకపోయాడు. కథ ఇతడిది కాదు, స్క్రీన్ ప్లే కూడా ఇతడిది కాదు. బౌండెడ్ స్క్రిప్ట్ తో కేవలం డైరక్షన్ మాత్రమే చేశాడు. అలాంటప్పుడు దర్శకుడిగా తానేంటో, తన మార్క్ ఏంటో చూపించుకోవాలి. ఈ సినిమాలో దర్శకుడి మెరుపులు కంటే.. సిద్ధూ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. హీరోగా నటించడమే కాకుండా.. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కూడా ఇచ్చాడు సిద్ధూ.

చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ, దాని చుట్టూ అల్లుకున్న కథ అంతగా మెప్పించదు. వైరల్ వీడియో కాన్సెప్ట్ తో మీకుమాత్రమేచెప్తా అంటూ గతంలో ఓ సినిమా వచ్చింది. అది కామెడీ యాంగిల్ లో సాగితే.. మా వింత గాధ వినుమా సినిమాలో అదే వైరల్ వీడియో కాన్సెప్ట్ ను కాస్త సీరియస్ గా చెప్పాలనుకున్నారు. ఆ విషయంలో సిద్ధూకు పాస్ మార్కులే పడతాయి.

Maa Vintha Gaadha Vinuma Review telugu 1
జీ సినిమాలు రివ్యూ

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో ఓటీటీ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ.. దాదాపు అలాంటిదే మరో యూత్ సబ్జెక్ట్ తీసుకున్నాడు. కానీ సక్సెస్ ను రిపీట్ చేయలేకపోయాడు. సబ్జెక్ట్ ఏదైనా దానికి సోల్ (ఆత్మ) ముఖ్యం. ఆకట్టుకునే సన్నివేశాలు, కదిలించే ఎమోషన్స్ చాలా అవసరం. యూత్ సబ్జెక్ట్ కు మందు సీసాలు, సిగరెట్లు, డజను బూతులు, అర్బన్ యూత్ మాట్లాడుకునే పదాలు పెడితే సరిపోతుందనుకుంటే.. అవన్నీ అందరూ చేయగలరు. రాసుకున్న కథను ఎంత ఎఫెక్టివ్ గా చెప్పగలిగాం అనే పాయింట్ పైనే సక్సెస్ డిపెండ్ అవుతుంది. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలో ఇది వర్కవుట్ అయింది. మా వింత గాధ వినుమా సినిమాలో అదే లోపించింది.

దర్శకుడు కథను ిబాగానే స్టార్ట్ చేశాడు. కథను అలా చెప్పుకుంటూ వెళ్లకుండా, మధ్యమధ్యలో బ్రేకులిచ్చి తణికెళ్ల భరణి పాత్రను ఇన్ వాల్వ్ చేయడం బాగుంది. కానీ స్క్రీన్ ప్లే పరంగా ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా, అసలు కథ-సన్నివేశాలు బాగున్నప్పుడే ఇలాంటివి యాడ్-ఆన్స్ గా పనికొస్తాయి. ఈ సినిమాకు హీరో సిద్ధూనే కథ రాసుకున్నాడు, మరొకరితో కలిసి స్క్రీన్ ప్లేపై కూడా వర్క్ చేశాడు. వైరల్ వీడియో వల్ల జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతాయో చెప్పాలనుకున్న సిద్ధు.. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలపై మాత్రం పెద్దగా దృష్టిపెట్టలేకపోయాడు.

ఇంకా చెప్పాలంటే.. వైరల్ వీడియో అనే మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ సీన్ ను కూడా సరిగ్గా రాసుకోలేకపోయాడు. హీరోయిన్ ను పెళ్లి చేసుకునే సీన్ కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించదు. సిద్ధు చెప్పే ప్రేమకథ కంటే.. మధ్యమధ్యలో వచ్చే తణికెళ్ల భరణి సీన్స్ నచ్చుతున్నాయంటే దానికి కారణం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కథ చెప్పాలనే కాన్సెప్ట్ నుంచి సిద్ధూ, ముందే బయటకొచ్చేశాడు. మరీ ముఖ్యంగా థియేట్రికల్ గా రిలీజ్ చేయమని కూడా ముందే ఫిక్స్ అయిపోయాడు. పూర్తిగా అర్బన్ యూత్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నాడు. మనం ఏ కథ చెప్పాలనుకుంటున్నాం, ఎవరికి చెప్పాలనుకున్నాం అనే క్లారిటీ ఉన్నప్పుడు రైటింగ్ ఈజీ అవుతుంది. కానీ అదే రాతలో ఎమోషనల్ కనెక్ట్, ఫ్లో లేకపోతే ఏ సెక్షన్ ఆడియన్ కూ ఇది ఎక్కదు.

ఓవరాల్ గా చెప్పాలంటే సిద్ధూ మరోసారి అన్నీతానై కాస్త గట్టిగానే ప్రయత్నించాడు. కానీ రైటింగ్ కోసం టైమ్ ఎక్కువగా తీసుకోకపోవడం, ఈ లాక్ డౌన్ టైమ్ లోనే ఓటీటీకి ఇచ్చేయాలనే గాబరాలో వింతగా చెప్పాలనుకున్న గాధను కాస్త కన్ఫ్యూజింగ్ గా, ఇంకాస్త చెత్తగా చెప్పేశాడు. అంతే తేడా.

బాటమ్ లైన్ – ఈ వింత గాధ వినలేం
రేటింగ్2.25/5