'లండన్ బాబులు' రివ్యూ

Friday,November 17,2017 - 12:00 by Z_CLU

న‌టీన‌టులు : ర‌క్షిత్‌(ప‌రిచ‌యం), స్వాతి, ఆలి, ముర‌ళిశ‌ర్మ‌, రాజార‌వీంద్ర‌, జీవా, స‌త్య‌ ధ‌న‌రాజ్‌, అజ‌య్ ఘోష్, సాయి, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు న‌టించగా..

సినిమాటోగ్రాఫర్ : శ్యామ్ కె నాయుడు

మ్యూజిక్ : కె

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్

నిర్మాత : మారుతి

స్క్రీన్ ప్లే-దర్శకుడు : చిన్ని కృష్ణ

రక్షిత్ ను హీరోగా పరిచయం చేస్తూ చిన్నికృష్ణ డైరెక్షన్ లో దర్శకుడు మారుతి నిర్మించిన ‘లండన్ బాబులు’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో చూద్దాం.

 

కథ :

అంతర్వేది అనే పల్లెటూరిలో సాధారణ కుర్రాడిగా జీవితాన్ని గడిపే గాంధీ(రక్షిత్) అప్పుల కారణంగా దొంగదారిన లండన్ వెళ్లి డబ్బు సంపాదించాలని స్నేహితుడు(సత్య)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. పాస్ పోర్టు నుంచి ఇమ్మిగ్రేషన్ వీసా వరకూ జరిగే అన్యాయం నేపథ్యంలో గాంధీ… సూర్య కాంతం( స్వాతి)ని ఎలా కలుస్తాడు. ఈ క్రమంలో గాంధీ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..లండన్ వెళ్లాలని ఎన్నో కలలు కన్న గాంధీ చివరికీ లండన్ వెళ్లగలిగాడా… అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

మొదటి సినిమా అయినప్పటికీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు హీరో రక్షిత్. హీరోయిన్ గా ఇప్పటికే పలు క్యారెక్టర్స్ తో మంచి గుర్తింపు అందుకున్న స్వాతి మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయింది. తన కామెడి టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేశాడు సత్య. ఫస్టాఫ్ లో వచ్చే సత్య కామెడి సినిమాకే హైలైట్ గా నిలిచింది. విడాకుల స్పెషలిస్ట్ లాయర్ గా అలీ కామెడీ పంచాడు. ఇప్పటివరకూ చేయని ఎమోషనల్ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు ధన్ రాజ్. ఇక సురభి నాటక సంస్థ హెడ్ గా మురళీ శర్మ, ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ గా అజయ్ ఘోష్ , లాయర్ గా సత్య కృష్ణ, రాజా రవీంద్ర, జీవ, అల్లరి సుభాషిని తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకొని ఒదిగిపోయారు.

టెక్నిషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ గురించే. కే అందించిన మ్యూజిక్, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యాయి. కే అందించిన సాంగ్స్ లో ‘ బాబు జాబు వచ్చేరా’, ఎక్కడ ఎక్కడ’, ‘తిరిగి తిరిగి’ పాటలు ఆకట్టుకున్నాయి. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం బాగుంది. ఎస్.బి.ఉద్దవ్ ఎడిటింగ్ బాగుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే కామెడీ డైలాగ్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిన్ని కృష్ణ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.


జీ సినిమాలు సమీక్ష :

‘వీడు తేడా’,’బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు చిన్ని కృష్ణ ఎంచుకున్నది ఓ తమిళ్ సినిమా రీమేక్ అయినప్పటికీ మన తెలుగు నేటివిటీ తో ఎంటర్ టైనింగ్ గా దాన్ని మలిచాడు. మెసేజ్ తో కూడిన స్టోరీని సింపుల్ అండ్ స్వీట్ గా తెరకెక్కించి దర్శకుడిగా తన మార్క్ చూపించాడు. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకూ సినిమాలో స్క్రీన్ ప్లే ఎంటర్టైన్ చేస్తుంది. అలా ఒక రీమేక్ సినిమా అనే ఫీలింగ్ కలగకుండా సినిమాను డీల్ చేశాడు దర్శకుడు.

ఇక మారుతి టాకీస్ బ్యానర్ లో అప్ కమింగ్ దర్శకులకు అవకాశం ఇస్తూ నూతన నటీనటులను పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తున్న మారుతి.. రక్షిత్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాడు. రక్షిత్ క్యారెక్టర్, ఫస్టాఫ్ లో వచ్చే సత్య కామెడీ, సెకండ్ హాఫ్ లో అలీ-సత్య కృష్ణ మధ్య వచ్చే కామెడీ సీన్స్, క్యారెక్టర్స్, సాంగ్స్, రక్షిత్-స్వాతి మధ్య వచ్చే సీన్స్, ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ లో జరిగే అవకతవకలు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా, అక్కడక్కడ కాస్త బోర్ కొట్టించే సీన్స్ సినిమాకు మైనస్.

ఫైనల్ గా ఓ చక్కని మెసేజ్ తో కూడిన ఫన్ మూవీగా ‘లండన్ బాబులు’ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది .

 

రేటింగ్ : 3/5