'లంక' రివ్యూ

Friday,April 21,2017 - 04:22 by Z_CLU

నటీనటులు : రాశి, సాయి రోనక్, ఎన సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు

విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

కెమెరా: వి.రవికుమార్

మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల

నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముణి

రాశి కీలకపాత్రలో శ్రీముణి డైరెక్షన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం “లంక”. మరి రాశి డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం..

కథ :

మోనో ఫోబియో అనే వ్యాధితో బాధపడే మలయాళం స్టార్ హీరోయిన్ స్వాతి(ఎన సాహా) ఒకానొక సందర్భంలో ఓ వ్యక్తి కి దూరంగా యు.ఎస్ వెళ్లాలని నిశ్చయించుకుంటుంది.. ఈ క్రమంలో వీసా కోసం హైదరాబాద్ వచ్చిన స్వాతి తన షార్ట్ ఫిలిం కోసం ఓ అమ్మాయి ని వెతుకుతున్న దర్శకుడి (సాయి రోనాక్) కంట్లో పడుతుంది.. అలా ఓ పాత గెస్ట్ హౌస్ లో షార్ట్ ఫిలిం ప్లాన్ చేసిన దర్శకుడు స్వాతి ఒప్పుకోవడం తో ఊరి చివరి లో ఉన్న ఓ పాత గెస్ట్ హౌస్ లో షార్ట్ ఫిలిం తీయడానికి రెడీ అవుతాడు.. ఆ దర్శకుడికి షూటింగ్ నిమిత్తం తన పాత గెస్ట్ హౌస్ ఇచ్చి సహాయపడుతుంది రేబాక(రాశి).. షార్ట్ ఫిలిం పూర్తి అవ్వగానే స్వాతి అనుమానాస్పద మృతి చెందుతుంది.. ఇంతకీ స్వాతి నిజంగానే అనుమానాస్పద మృతి చెందిందా?.. అసలు రేబాక ఎవరు..? చివరికి ఏం జరిగింది.. అనేది ఈ సినిమా స్టోరీ.

 

నటీనటుల పనితీరు:

గతంలో హీరోయిన్ గా తన గ్లామరస్ యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ను బాగా అలరించిన రాశి ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ సరికొత్త లుక్, క్యారెక్టర్ తో రేబాక గా మెస్మరైజ్ చేసింది…ఇక సినిమాలో రాశి తర్వాత చెప్పుకోవాల్సింది ఐనా సాహా గురించే.. మోనో ఫోబియా వ్యాధి తో భాధ పడుతున్న అమ్మాయిగా తన నటన, గ్లామర్ తో ఆకట్టుకుంది ఈ మలయాళ బ్యూటీ.. హీరోగా సాయి రోనక్ పరవాలేదనిపించుకున్నాడు.. సుదర్శన్, సత్య తమ కామెడీ టైమింగ్ పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేశారు.. ఇక గిరిబాబు, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు,రవి శంకర్, సత్యం రాజేష్ , వేణు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు..

 

టెక్నీషియన్స్ పనితీరు :

వి.రవికుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఫరవాలేదు.. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో పరవాలేదనిపిస్తుంది. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలను మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఎలివేట్ చేయలేకపోయింది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే కాస్త బోర్ కొట్టించింది..


జీ సినిమాలు సమీక్ష :

గతం లో కథానాయికగా ఒక స్టార్ ఇమేజ్ అందుకున్న రాశి సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ పాత్రలతో మంచి మార్కులు అందుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత రాశి నటిగా ఇలాంటి లీడ్ రోల్ చేయడం, ఈ తరహా కథను ఎంచుకోవడం అభినందించాల్సిన విషయమే.. రేబాక అనే డిఫరెంట్ క్యారెక్టర్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ కు స్ట్రాంగ్ పునాది వేసుకుంది రాశి. ఇక టెలీపతీ కాన్సెప్ట్ తో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దాన్ని టైట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడిగా సినిమాలో ఇంట్రెస్టింగ్ ట్విస్టులు పెట్టి థ్రిల్ చేసినప్పటికీ, అవే ట్విస్ట్ లు సినిమాకు కొన్ని చోట్ల మైనస్ గా కూడా మారాయి. సినిమాలో మరీ ట్విస్టులెక్కువైన ఫీలింగ్ వస్తుంది.

ఇక రాశి క్యారెక్టర్, ఫస్ట్ హాఫ్ లో సుదర్శన్-సత్య కామెడీ, డైలాగ్స్, టెలిపతి గురించి తెలియజేసే సీన్స్ , పెయింటింగ్ తో కూడిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కథ, అనుకోని ట్విస్టులు, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలువగా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్, ఎడిటింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “లంక” ఓ మోస్తరుగా మెప్పిస్తుంది.

 

రేటింగ్ : 2 /5