'లాల్ సింగ్ చడ్డా' మూవీ రివ్యూ

Thursday,August 11,2022 - 06:06 by Z_CLU

న‌టీన‌టులు : ఆమిర్ ఖాన్, క‌రీనా కుమార్, నాగ చైత‌న్య త‌దిత‌రులు

సంగీతం : ప్రీతిమ్

రచన :  అతుల్ కుల్ క‌ర్ణి

స‌మ‌ర్ప‌ణ : మెగాస్టార్ చిరంజీవి

నిర్మాణం  : వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్

నిర్మాత‌లు : ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే

ద‌ర్శ‌క‌త్వం : అద్వైత్ చంద‌న్

నిడివి : 163 నిమిషాలు

విడుదల తేది : 11 ఆగస్ట్ 2022

కొన్ని నెలలుగా ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఫారెస్ట్ గంప్ నుండి కథ తీసుకొని మన నెటివిటీకి తగ్గట్టుగా మార్చి అద్వైత్ చందన్ తెరకెక్కించిన ఈ సినిమా నేడే థియేటర్స్ లోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తెలుగు వర్షన్ ని ప్రెజెంట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి ఆ అంచనాలను ‘లాల్ సింగ్ చడ్డా’ అందుకుందా ? ఆమీర్ ఈ సినిమాతో హిట్టు కొట్టాడా జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

చిన్నతనం నుండి అమాయకుడిగా, తెలివి తక్కువ వాడిలా ఉండే లాల్ సింగ్ చడ్డా(ఆమీర్ ఖాన్) తన తల్లి కోరిక మేరకు ఆర్మీలో జాయిన్ అవుతాడు. అక్కడ బాలరాజు(నాగ చైతన్య) అనే మిత్రుడ్ని కలుసుకుంటాడు. అయితే ఓ యుద్ధంలో తన మిత్రుడు బాలరాజుని కోల్పోతాడు లాల్. అలాగే చిన్నతనం నుండి తనతో పాటే కలిసి పెరిగిన రూప(కరీనా కపూర్) కూడా లాల్ కి దూరమవుతుంది.

యుద్ధంలో గాయపడిన లాల్ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అలా సొంత గ్రామానికి తిరిగి వచ్చిన లాల్ బాలరాజు చెప్పిన ఓ వ్యాపారం మొదలుపెట్టి అందులో సక్సెస్ అవుతాడు. కానీ రూప లేని లోటు అతన్ని వెంటాడుతోంది. ఫైనల్ గా లాల్ ని రూప కలుసుకుందా ? వీరిద్దరూ కలిసి ఎలాంటి జర్నీ చేశారు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

ఆమీర్ ఖాన్ నటన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. దేశం గర్వించదగిన నటుల్లో ఆమీర్ ఒకరు. లాల్ సింగ్ చడ్డా గా ఆయన కేరెక్టర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాకపోతే లాల్ పాత్రకు పీకే లో కారెక్టర్ కి సిమిలారిటీ ఉండటంతో ఆమీర్ అదే నటన రిపీట్ చేసినట్టుగా అనిపించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆమీర్ నటన ఆకట్టుకుంటూ అలరిస్తుంది. కరీనా తన పాత్ర మేరకూ మెప్పించింది. రూప పాత్రలో ఆకట్టుకుంది.  బాలరాజు పాత్రలో నాగ చైతన్య బాగా నటించాడు. నాగ చైతన్య కథలో ఇంపార్టెన్స్ ఉన్న స్పెషల్  కేరెక్టర్ లభించింది కానీ అతని కేరెక్టర్ తాలూకు నేపథ్యం మాత్రం సరిగ్గా కుదరలేదనిపిస్తుంది. లాల్ చిన్నప్పటి పాత్రలో అహ్మద్ ఉమర్ నటన బాగుంది. తల్లి పాత్రలో మోనా సింగ్ , మహమ్మద్ పాత్రలో మన్నావ్ విజ్ వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు సంబంధించి సినిమాటోగ్రాఫర్ నుండి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ నుండి సినిమాకు బెస్ట్ సపోర్ట్ అందింది. సత్యజిత్ పాండే విజువల్స్ కట్టేపరేశాయి. అలాగే ప్రీతం మ్యూజిక్ చాలా బాగుంది. వీరిద్దరి హార్డ్ వర్క్ స్క్రీన్ పై కనిపించింది.  తెలుగు పాటలకు భాస్కరభట్ల అందించిన సాహిత్యం వినసొంపుగా ఉంది. ముఖ్యంగా ఒంటరిగా నడువూ ఒక్కడివే నడువూ పాటలో భాస్కరభట్ల మంచి ఫిలాసఫీతో సాహిత్యం అందించారు. హేమంతి సర్కార్ ఎడిటింగ్ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. రన్ టైం తగ్గించి కాస్త క్రిస్ప్ గా కట్ చేసి బెటర్ గా ఉండేది. అతుల్ కులకర్ణి రచన ఫరవాలేదు కానీ ఒరిజినల్ కంటెంట్ ని అడాప్షన్ చేసుకొని కథలో కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేది. అద్వైత్ చందన్ దర్శకత్వం బాగుంది కానీ ఈ కథను ఆకట్టుకునే చెప్పడంలో ఆయన ఫెయిల్ అయ్యారు.

జీ సినిమాలు సమీక్ష :

ఆమీర్ ఖాన్ సినిమాలకు ఓ సెపరేట్ ఇమేజ్ ఉంటుంది. ‘3 ఇడియట్స్’, ‘పీకే’, ‘దంగల్’ సినిమాలు ఆమీర్ స్థాయిని మరింత పెంచి నటుడిగా ఆయనకి గొప్ప కీర్తి తీసుకొచ్చాయి. అయితే దంగల్ తర్వాత ఆమీర్ ఉంది మళ్ళీ ఆ రేంజ్ హిట్ సినిమా రాలేదు. ఆ లోటును లాల్ సింగ్ చడ్డా తో భర్తీ చేయాలనీ ఆమీర్ గట్టిగా ప్రయత్నించాడు. కాకపోతే కంటెంట్ తో ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. నిజానికి ఫారెస్ట్ గంప్ సినిమాను మళ్ళీ తీయాలనుకోవడమే పెద్ద సాహసం. ఇలాంటి రిస్క్ చేసే ముందు స్క్రిప్ట్ పై ఎక్కువ వర్కౌట్ చేయాల్సి ఉంది. మార్పులు చేర్పులు ఎక్కువ చేసుకొని మన ప్రేక్షకులకు నచ్చేలా తీసుకోవాలి. దర్శకుడు అద్వైత్ దర్శకుడిగా తన జాబ్ బాగానే చేసినప్పటికీ ఈ కథతో స్లో నెరేషన్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.

ఆమీర్ కేరెక్టర్ , నటన పీకే సినిమాను గుర్తుచేశాయి తప్ప కొత్తగా అనిపించలేదు. ఆ కేరెక్టర్ కి లాల్ కి కాస్త సిమిలారిటీ ఉండటం వల్ల మళ్ళీ పీకే లో ఆమీర్ ని చూసినట్టే అనిపిస్తుంది తప్ప ఆ కేరక్టర్ ఫ్రెష్ గా కనెక్ట్ అవ్వలేదు. ఇక సినిమాలో లాల్ కేరెక్టర్ డిజైనింగ్ లో కూడా లోటుపాట్లు ఉన్నాయి. ఆ కేరెక్టర్ కి సంబంధించి డీటైలింగ్ మిస్సయింది. అలాగే లవ్ ట్రాక్ కూడా విసుగు తెప్పిస్తుంది తప్ప ఆకట్టుకోలేదు. ఆర్మీ ఎపిసోడ్ బాగుంది కానీ అందులో నాగ చైతన్య పాత్ర ఊహించిన స్థాయిలో లేకపోవడం తెలుగు ఆడియన్స్ ని నిరాశ పరుస్తుంది. ఆ పాత్రతో చెడ్డీలు , బనియన్లు అంటూ క్లాత్స్ గురించి చెప్పిందే చెప్పి ప్రేక్షకుడిని దర్శకుడు ఇబ్బంది పెట్టాడు. దీంతో చైతన్య ఈ పాత్ర చేయడం అవసరమా అన్నట్టుగా అక్కినేని ఫ్యాన్స్ కూడా భావిస్తారు.

ఇక సినిమాకు తీసుకున్న కోర్ పాయింట్ కూడా పెద్ద మైనస్ అనిపిస్తుంది. హీరో ఆర్మీ ఆఫీసర్ గా ఉంటూ టెర్రరిస్ట్ ని కాపాడటం అతనితో ట్రావెల్ అవ్వడం ప్రేక్షకుడికి మింగుడు పడదు. క్లైమాక్స్ లో ఆ పాత్ర ద్వారా దర్శకుడు ఏదో చిన్న సందేశం ఇవ్వాలని చూసినా అది వర్కౌట్ అవ్వలేదు. ఇక సెకండాఫ్ అంతా హీరో బనియన్లు, చెడ్డీలు అంటూ వ్యాపారం చేసుకోవడం తాలూకు సన్నివేశాలు చూస్తూ రూప కంపెనీకి అడ్వర్టైజ్ మెంట్ చేయడం కోసం సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. చివర్లో హీరో రెండేళ్ళు ఆగకుండా పరుగెత్తడం అనే ఎలిమెంట్ కూడా దర్శకుడు ఎందుకో పెట్టాడో అర్థం కాని పరిస్థితి. ఇక కథలో కొన్ని లాజిక్స్ కూడా గాలికి వదిలేశాడు దర్శకుడు. అలాగని సినిమాలో ప్లస్ పాయింట్స్ లేవని కాదు కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. చైల్డ్ హుడ్ ఎపిసోడ్ ఆకట్టుకుంది. అక్కడక్కడా వచ్చే ప్రీతం సాంగ్స్ అలరిస్తాయి. కాకపోతే వాటి కోసం సినిమా అంతా భరించాల్సి వస్తుంది.

రేటింగ్ : 2.25 /

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics