Movie Review - 'చావు కబురు చల్లగా'

Friday,March 19,2021 - 02:15 by Z_CLU

నటీనటులు : కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగర్, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు

మ్యూజిక్ : జేక్స్‌ బిజాయ్

సినిమాటోగ్రాఫ‌ర్ – క‌ర‌మ్ ఛావ్లా

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌వింద్

నిర్మాణం : జీఏ2 పిక్చ‌ర్స్

నిర్మాత : బ‌న్నీ వాసు

రచన -దర్శకత్వం : కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి

నిడివి : 137 నిమిషాలు

విడుదల : 19 మార్చ్ 2021

‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత సరైన విజయం అందుకోలేకపోతున్న హీరో కార్తికేయ మరో కొత్త దర్శకుడితో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా చేశాడు. ‘గీతా ఆర్ట్స్ 2’ బేనర్ లో డిఫరెంట్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంది ..? హీరో కార్తికేయ విజయం అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

Chaavu-Kaburu-Challaga-karthikeya-lavanya-tripathi 2
కథ :

వైజాగ్ లో శవాలను స్మశానానికి తీసుకెళ్ళే స్వర్గపురి వాహనం నడిపే బస్తి బాలరాజు( కార్తికేయ) ఓ చావు ఇంటి దగ్గర మల్లిక(లావణ్య త్రిపాఠి)అనే విధవ ని చూసి ప్రేమలో పడతాడు. నిత్యం ఆమెనే తలుచుకుంటూ వెంటే తిరుగుతుంటాడు. భర్త పీటర్ హఠాన్మరణంతో బాధలో ఉన్న మల్లికకి బాలరాజు చేష్టలు విసిగెత్తిస్తాయి. బాలరాజు పదే పదే మల్లిక వెంట పడుతూ ఉండటంతో ఆమె మావయ్య తనకి మరో అబ్బాయితో రెండో పెళ్లి ఫిక్స్ చేస్తాడు .

మరో వైపు తన తండ్రి బ్రతికి ఉండగానే తల్లి గంగమ్మ(ఆమని) కి ఇంకో పెళ్లి చేసేందుకు రెడీ అవుతాడు బాలరాజు. ఇంతకీ బాలరాజు తన తల్లి గంగ కి మరో పెళ్లి చేయడానికి కారణం ఏమిటి ? చివరికి తను కోరుకున్న అమ్మాయి మల్లిక ని పెళ్లి చేసుకున్నాడా ? లేదా అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

స్వర్గపురి డ్రైవర్ బస్తి బాలరాజు పాత్రలో కార్తికేయ బాగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో క్యారెక్టర్లో ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. మల్లికగా లావణ్య త్రిపాఠి మంచి నటన కనబరిచి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. చాలా రోజులకి ఓ మంచి పాత్ర లభించడంతో ఆమని బెస్ట్ ఇచ్చింది. హీరోయిన్ మావయ్య పాత్రలో మురళి శర్మ సినిమాకు ప్లస్ అయ్యాడు.

శ్రీకాంత్ అయ్యంగర్ క్యారెక్టర్ కి సూటయ్యాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే కామెడీతో భద్రం అలరించాడు. ప్రభు , రజిత, మహేష్, శరత్ తదితరులు తమ పాత్రలకు ఉన్నంతలో న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

జేక్స్‌ బిజాయ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. చావు కబురు చల్లగా , పైన పటారం సాంగ్స్ హైలైట్ గా నిలిచాయి. కథలో వచ్చే మిగతా పాటలు కూడా బాగున్నప్పటికీ థియేటర్స్ బయటికొచ్చే ప్రేక్షకులకు మాత్రం టైటిల్ సాంగ్ , స్పెషల్ సాంగ్ మాత్రమే గుర్తుంటాయి. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు జేక్స్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఇక క‌ర‌మ్ ఛావ్లా నేచురల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది. స‌త్య జి ఎడిటింగ్ ఫరవాలేదు.

సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కి డైలాగ్స్ మరింత బలాన్నిచ్చాయి. ముఖ్యంగా జీవితం గురించి చెప్పే ఫిలాసఫీ డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. కౌశిక్ కథకుడిగా పాస్ మార్కులు వేసుకున్నాడు కానీ దర్శకుడిగా మాత్రం ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా ఉన్నాయి.

Chaavu Kaburu Challaga March 19 release zeecinemalu

జీ సినిమాలు సమీక్ష :

కొన్ని కథలు వినడానికి బాగుంటాయి. కానీ స్క్రీన్ పైకి వచ్చేసరికి తేలిపోతుంటాయి. అలా తెలిపోవడానికి చాలా కారణాలుంటాయి. అనుకున్న కథకి మంచి కథనం రాసుకోవడం క్యారెక్టర్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం సక్సెస్ ఫార్ములా. కానీ ఈ ఫార్ములాని డైరెక్టర్ కౌశిక్ ఫాలో అవ్వకుండా తను అనుకున్న విధంగా సినిమాను తీశాడు. ఇలాంటి డిఫరెంట్ కథతో సినిమా చేయాలంటే కొంత అనుభవం కూడా కావాలి. అయితే దర్శకుడిగా తొలి సినిమా కావడంతో కౌశిక్ ఈ కథతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు. బలమైన డైలాగ్స్ తో కొన్ని ఎమోషనల్ సీన్స్ ని బాగానే తెరకెక్కించినప్పటికీ చాలా సందర్భాల్లో దర్శకుడిగా తడబడ్డాడు.

క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చే నటీ నటులను ఎంపిక చేసుకోవడంలో మాత్రం కౌశిక్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా కథలో కీలక పాత్ర పోషించే హీరో తల్లి క్యారెక్టర్ కి ఆమని తీసుకోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. కాకపోతే ఆమె క్యారెక్టర్ ని ప్రాపర్ గా డిజైనింగ్ చేయలేదనిపిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో పదునైన మాటలతో తను చెప్పాలనుకున్నది చెప్పినప్పటికీ సినిమాలో ఉండే కీ పాయింట్ మాత్రం కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు దర్శకుడు. అదే సినిమాకు ప్రధాన బలహీనత అనిపిస్తుంది. రెండో భాగంలో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే జీవితం గురించి ఫిలాసఫీ మరీ ఎక్కువైనట్టుగా ఆడియన్స్ ఫీలవుతారు.అలాగే హీరో తన తల్లితో కలిసి మందేసే సన్నివేశాలు , భర్త ఉండగానే మరో పెళ్లి అనేవి ఆడియన్స్ కి డైజెస్ట్ కావు.

తెల్లవారితో చావు -పుటకల మధ్య వ్రుత్తి చేసే అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ అనే ఎలిమెంట్ కొత్తగా ఉంది. కానీ దాన్ని సరైన స్క్రీన్ ప్లేతో ఇంకా స్ట్రాంగ్ గా చెప్పి మంచి సందేశం ఇవ్వగలిగితే బాగుండేది. కథ పరంగా సినిమా కొత్తగా అనిపిస్తుంది… కానీ కథనం వీక్ గా ఉండటం, స్లో నరేషన్. మెయిన్ థీం కనెక్ట్ అయ్యేలా చెప్పకపోవడం సినిమాకు మైనస్. ఇక మొదటి భాగం పూర్తయ్యే సరికే మిగతా కథ ఇదే అని ప్రేక్షకులు ఊహించేలా నడిచే ఫ్లాట్ స్క్రీన్ ప్లే కూడా నిరాశ పరుస్తుంది. ఫైనల్ గా కొత్త కథతో తెరకెక్కిన ‘చావు కబురు చల్లగా’ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల కోసం ఒకసారి చూడొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

కార్తికేయ , ఆమని నటన

కథ

ఎమోషనల్ సన్నివేశాలు

మాటలు

అనసూయ స్పెషల్ సాంగ్

 

మైనస్ పాయింట్స్ :

లవ్ ట్రాక్

స్లో స్క్రీన్ ప్లే

క్లైమాక్స్

రేటింగ్ 2.5 / 5