Movie Review - కనబడుటలేదు

Thursday,August 19,2021 - 05:04 by Z_CLU

నటీనటులు: సునీల్ , వైశాలి రాజ్ ,సుక్రాంత్ వీరెళ్ళ, యుగ్రం , హిమజ , రవివర్మ, కిరీటి , కిషోర్ (కంచెర పాలెం) సుబ్బారావు తదితరులు

కెమెరా : సందీప్ బద్దుల

సంగీతం : మధు పొన్నాస్

నిర్మాత :సాగర్ , సతీష్ , దిలీప్ ,శ్రీనివాస్ , దేవి ప్రసాద్

రచన -దర్శకత్వం : బాల రాజు .ఎం

నిడివి : 115 నిమిషాలు

విడుదల తేది : 19 ఆగస్ట్ 2021

సుకుమార్ లాంచ్ చేసిన టీజర్ తో మూవీ లవర్స్ ఎట్రాక్ట్ చేసిన ‘కనబడుట లేదు’. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

kanabadutaledu movie review in telugu
కథ :

ఆదిత్య(యుగ్రం) అనే అబ్బాయి శశిధ(వైశాలి రాజ్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ శశిధ సూర్య అనే డెలివరీ బాయ్ తో ఆల్రెడీ ప్రేమలో ఉంటుంది. సూర్య(సుక్రాంత్) అనాధ కావడంతో శశిధ ఇంట్లో వారిద్దరి పెళ్ళికి అబ్జెక్షన్ చెప్తారు. ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవడంతో అనాధ అయిన సూర్య లేచిపోవడానికి రెడీ అవుతుంది శశిధ. కానీ అక్కడి నుండి సూర్య కనబడడు. ఆ తర్వాత శశిధ ఆదిత్యని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంది. కానీ సూర్య తనని నమ్మించి ఎందుకు మోసం చేశాడు అనే ఆలోచన ఆమెను వెంటాడుతుంది. అనుకోకుండా డంప్ యార్డ్ లో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది.

ఈ కేసుని సి.ఏ విక్టర్ రాజ్(కిషోర్ కంచెర పాలెం) డీల్ చేస్తుంటాడు. కేసుకి సంబంధించి ఎంక్వైరీ మొదలు పెట్టిన తర్వాత విక్టర్ రాజ్ కూడా మిస్ అవుతాడు. ఫైనల్ గా సూర్య మిస్సింగ్ కేసుని డిటెక్టివ్ (సునీల్) కి అప్పగిస్తుంది శశిధ. అక్కడి నుండి డిటెక్టివ్ సూర్య కేసుని ఎలా చేదించాడు ? ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదీ ? ఫైనల్ గా దీని వెనుక ఉన్నది ఎవరు ? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

సినిమా సెకండాఫ్ లో వచ్చే డిటెక్టివ్ పాత్రలో సునీల్ మెప్పించాడు. కథకి కంక్లూజన్ ఇచ్చే కీలకమైన పాత్ర కావడంతో సునీల్ మంచి నటన కనబరిచాడు. మొదటి సినిమా అయినప్పటికీ సుక్రాంత్ , యుగ్రం , వైశాలీ బాగానే నటించారు. మంచి క్యారెక్టర్ పడటంతో హిమజ తన నటనతో ఆకట్టుకుంది. రవివర్మ , కిరీటి తమ పాత్రలకు న్యాయం చేశారు. కంచెరపాలెం కిషోర్ నటన పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ పాత్రకు డబ్బింగ్ కూడా సూటవ్వలేదు. సుబ్బారావు మిగతా నటీ నటులు పరవాలేదు అనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

క్రైం థ్రిల్లర్ జానర్ సినిమాకి మంచి మ్యూజిక్ ముఖ్యం. మధు పొన్నాస్ నేపథ్య సంగీతం కొన్ని సందర్భాల్లో బాగుంది. సందీప్ బద్దుల కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ రవితేజ సినిమాను పర్ఫెక్ట్ గా రన్ టైంతో కట్ చేశాడు. ఆర్ట్ వర్క్ పరవాలేదు. దర్శకుడు బాల రాజు ఒక రొటీన్ క్రైం థ్రిల్లర్ కథతో ఆకట్టుకోలేకపోయాడు. అతని దర్శకత్వంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

kanabadutaledu movie review in telugu

జీ సినిమాలు సమీక్ష :

మంచి కథ, అదిరిపోయే ట్విస్టులు, సినిమాను ఆసక్తిగా నడిపించే కథనం, సన్నివేశాలకు బలాన్నిచ్చే నేపథ్య సంగీతం, క్యారెక్టర్స్ లో ఒదిగిపోయే నటీనటులు ఇవే క్రైం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ముఖ్యమైన ముడి సరుకు. ఇవి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ జానర్ సినిమాలతో మెప్పించడం సులువు. అందుకే దర్శకుడు బాలరాజు తన మొదటి సినిమాకు ఈ జోనర్ సెలెక్ట్ చేసుకొని దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

అయితే దర్శకుడు రాసుకున్న కథ రొటీన్ గా అనిపించడం కథనం కూడా వీక్ గా ఉండటం సినిమాకు పెద్ద మైనస్. ఒక డంప్ యార్డులో డెడ్ బాడీ చూపించి అక్కడి నుండి క్యురియాసిటీ కలిగించిన దర్శకుడు ఆ వెంటనే వచ్చే పేలవమైన సన్నివేశాలతో మెప్పించలేకపోయాడు. దాంతో మొదటి భాగంలో వచ్చే సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. ఇక ఇంటర్వెల్ లో కూడా సరైన ట్విస్టు ప్లాన్ చేసుకోలేదు దర్శకుడు.

సెకండాఫ్ లో సునీల్ డిటెక్టివ్ గా ఎంటర్ అయ్యాక సినిమా కాస్త పరవాలేదనిపిస్తుంది. అప్పటివరకు బోరింగ్ గా సాగుతుంది. ఇక సెకండాఫ్ కూడా జెట్ స్పీడ్ లో ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ముందుగు సాగదు కానీ మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం పరవాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ లో సర్ ప్రయిజింగ్ ట్విస్టు ప్లాన్ చేసుకున్నాడు. అప్పటివరకు విలన్ ఎవరనేది చెప్పకుండా రెండు మూడు పాత్రలపై డౌట్ క్రియేట్ చేస్తాడు. ఆ ట్విస్టు వరకు బాగానే ఉంది. కానీ విలన్ ఫ్లాష్ బ్యాక్ లో అనాధ శరణాలయం, కొన్ని పరిస్థుతుల వాళ్ళ సైకో గా మారడం అనేవి చాలా థ్రిల్లర్ సినిమాలను గుర్తు చేస్తాయి. టీజర్, ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన దర్శకుడు సినిమాతో మెస్మరైజ్ చేయలేకపోయాడు. ఫైనల్ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ‘కనబడుట లేదు’ మెప్పించలేకపోయింది.

రేటింగ్ : 2/5