'కాశి' మూవీ రివ్యూ

Friday,May 18,2018 - 02:20 by Z_CLU

నటీనటులు: విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, నాజర్, జెపి తదితరులు

సంగీతం : విజయ్ ఆంటోని

సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం.నాథన్

నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న  చంద్రపతి

రచన-దర్శకత్వం : కిరుతిగ ఉదయనిధి

విడుదల తేది : 18 మే 2018

సెన్సిబుల్ సినిమాలతో.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ లేటెస్ట్ గా “కాశి” సినిమాతో థియేటర్స్ లోకి వచ్చారు. మరి ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ తెలుగు ఆడియన్స్ ని  ఎంటర్ టైన్ చేశాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ :

అమెరికాలో భరత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎం.డి గా గొప్ప జీవితాన్ని అనుభవించే డాక్టర్ భరత్(విజయ్ ఆంటోనీ)కి ఓ పెద్ద పాము కనిపించినట్టుగా… అలాగే ఎద్దు పరుగెడుతూ వచ్చి ఓ మహిళను పొడిచినట్టుగా ఓ కల వస్తుంది. అయితే ఆ కల నిజామా..లేదా..అనే భ్రమలో ఉన్న భరత్ కి అమెరికాలో తనతో పాటు ఉన్న తల్లిదండ్రులు తన సొంత తల్లిదండ్రులు కారనే నిజం తెలుస్తుంది. చిన్నతనంలో అనాధగా ఉన్న తనను దత్తత తీసుకొని అమెరికా తీసుకొచ్చి పెంచుకున్నారని తెలుసుకున్న మరుక్షణం తన గతం వెతుక్కుంటూ ఇండియాకి బయలుదేరతాడు భరత్.. అలా తన తల్లితండ్రుల జాడ తెలుసుకోవడానికి కంచర్లపాలెం చేరుకున్న భరత్ కి ఆ ఊళ్ళో కొన్ని అనుకోని కథలు ఎదురవుతాయి. ఇంతకీ భరత్ తల్లిదండ్రులు ఎవరు..? వారు బ్రతికే ఉన్నారా..? చివరికి భరత్ వాళ్ళ గురించి ఎలా తెలుసుకున్నాడు..అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు:

ఇప్పటి వరకూ డిఫరెంట్ క్యారెక్టర్స్, పెర్ఫార్మెన్స్ తో తమిళ్..తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ ఈసారి కూడా నటుడిగా మంచి మార్కులే అందుకున్నాడు. ముఖ్యంగా రత్తయ్య క్యారెక్టర్ లో అందరినీ ఎట్రాక్ట్ చేశాడు. విజయ్ ఆంటోనీ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శిల్పా మంజునాద్ గురించే. తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయింది. అంజలి..సునయనా..అమృత వారి క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నాడు. కొన్ని సీన్స్ లో యోగి బాబు తన కామెడీ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేశాడు. నాజర్, జయప్రకాశ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

రిచర్డ్ ఎం.నాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్ లో రిచర్డ్ తన కెమెరా టాలెంట్ చూపించాడు. విజయ్ ఆంటోనీ ఈ సినిమా కోసం కంపోజ్ చేసుకున్న సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు..కానీ బాగ్రౌండ్ స్కోర్ బాగుంది. భాష్య శ్రీ అందించిన మాటలతో పాటు సాహిత్యం కూడా బాగుంది. కొన్ని కామెడీ డైలాగ్స్ బాగా పేలాయి. లారెన్స్ కిషోర్ ఎడిటింగ్ పరవాలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

 

జీ సినిమాలు సమీక్ష :

విజయ్ ఆంటోనీ నుండి ఓ సినిమా వస్తుందంటే తమిళ్ తో పాటు తెలుగులో కూడా కొంత బజ్ ఉంటుంది.. కానీ ‘బిచ్చగాడు’ మినహా విజయ్ ఆంటోనీ నటించిన గత సినిమాలేవి ఆడియన్స్ ని  పూర్తి స్థాయిలో ఎంటర్ టైన్ చేయలేకపోయాయి. కెరీర్ ఆరంభం నుండి డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్న విజయ్ ఆంటోనీ ప్రస్తుతం దర్శకులపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

సినిమాకు సంబంధించి ఎప్పటిలాగే ‘కాశి’ సినిమా నుంచి దాదాపు 7 నిమిషాల మూవీని ముందే రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయలేకపోయాడు విజయ్ ఆంటోనీ. ఆ వీడియో పెద్దగా క్యూరియాసిటీ పెంచకపోగా, గతంలో విజయ్ ఆంటోనీ నటించిన ‘భేతాళుడు’ సినిమాను గుర్తుచేసింది. మొదటి 10 నిమిషాల పాటు తన స్క్రీన్ ప్లేతో ఎంటర్టైన్ చేసి సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ కలిగించిన దర్శకురాలు కృత్తిక ఆ తర్వాత కథకు కొన్ని ట్విస్టులు జత చేసి మరికొన్ని కథలను జోడించి బోర్ కొట్టించారు.

తన తల్లిదండ్రుల కోసం.. గతాన్ని వెతుక్కుంటూ అమెరికా నుండి ఇండియా వచ్చిన ఓ కుర్రాడి కథను ఎంచుకున్న దర్శకురాలు ఆ కథను ఎమోషనల్ గా తెరకెక్కించకడంలో ఫెయిలైంది. ముఖ్యంగా సెన్సిబుల్ పాయింట్ ను అంతే సెన్సిబుల్ గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంలో తడబడి తన స్క్రీన్ ప్లే తో బోర్ కొట్టించింది.

కెరీర్ ఆరంభంలో నటనపై మాత్రమే ఫోకస్ పెట్టిన విజయ్ ఆంటోనీ ఇప్పడు ఒకే సినిమాలో మల్టిపుల్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ పెడుతూ కాస్త చిరాకు తెప్పిస్తున్నాడు. నిజానికి కథలో మరో రెండు పిట్ట కథలు రావడం.. పైగా అన్ని కథల్లో విజయ్ ఆంటోనీ రకరకాల గెటప్స్ లో కనిపించడం ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెడతాయి. ప్రీ క్లైమాక్స్ కి వచ్చే సరికి ఇదో సెన్స్ లెస్ సినిమా అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది.

 

ప్లస్ పాయింట్స్ :

– విజయ్ ఆంటోనీ పెర్ఫార్మెన్స్

– శిల్పా మంజునాథ్ పెర్ఫార్మెన్స్

– ట్విస్టులు

– బాగ్రౌండ్ స్కోర్

– కొన్ని సన్నివేశాలు

 

మైనస్ పాయింట్స్ :

– సాంగ్స్

– డైరెక్షన్

– కథలో వచ్చే ఉపకథలు

– స్క్రీన్ ప్లే

– ఎమోషన్ పండకపోవడం

– క్లైమాక్స్

 

రేటింగ్ : 2 / 5