'ఝాన్సీ' మూవీ రివ్యూ

Friday,August 17,2018 - 01:42 by Z_CLU

నటీ నటులు : జ్యోతిక, జీ.వి.ప్రకాష్ , ఇవన, రాక్ లైన్ వెంకటేష్ తదితరులు

సంగీతం : ఇళయరాజా

ఛాయాగ్రహణం : థేని ఈశ్వర్

నిర్మాణం : కల్పనా చిత్ర & యశ్వంత్ మూవీస్

నిర్మాతలు : కోనేరు కల్పన , డి అభిరాం, అజయ్ కుమార్

రచన -దర్శకత్వం : బాల

విడుదల తేది : 17 ఆగస్ట్ 2018

నిడివి : 100 నిమిషాలు

కథ :

సిన్సియర్ ఐ.పి.ఎస్ పోలీస్ ఆఫీసర్ అయిన ఝాన్సీ (జ్యోతిక)… ఓ మైనర్ అయిన రాసి (ఇవన) రేప్ కేసును టెక్ అప్ చేస్తుంది. ఆ కేసులో రాసి ప్రియుడు గాలి రాజు(జీ వి ప్రకాష్) ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతుంది. ఏ కేసునైనా ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకునే ఝాన్సీ మైనర్ రేప్ కేసును కూడా అంతే ఛాలెంజింగ్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఝాన్సీ కి ఎన్నో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. చివరికీ ఈ కేసు మిస్టరీ ని ఝాన్సీ ఎలా ఛేదించి నిందుతుడికి ఎలాంటి శిక్ష వేసింది అనేది సినిమా కథ.

 

నటీ నటులు పని తీరు  :

దర్శకుడు బాల సినిమాలో నటీ నటులు కనిపించరు కేవలం క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. తన ప్రతీ సినిమాలో నటీ నటుల నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకునే బాల ఈసారి మాత్రం ఓ ముగ్గురి క్యారెక్టర్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఐ.పి.ఎస్ పోలీస్ ఆఫీసర్ గా జ్యోతిక పర్ఫెక్ట్ అనిపించుకోగా జీ.వి.ప్రకాష్ , ఇవన మాత్రం ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో హైలైట్ గా నిలిచారు. జీ.వి ప్రకాష్ పూర్తిగా బాల హీరోలా కనిపించాడు. ఈ ముగ్గురు మినహా చెప్పుకునే క్యారెక్టర్స్ కానీ పెర్ఫార్మెన్స్ లు కానీ సినిమాలు కనిపించవు. రాక్ లైన్ వెంకటేష్ జస్ట్ పరవాలేదనిపించాడు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం.. ఇళయరాజా ఆయన స్టైల్ లో సినిమాకు పర్ఫెక్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాటోగ్రఫీ చాలా నేచురల్ గా ఉంది.. థేని ప్రతీ సన్నివేశాన్ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. ఎడిటింగ్ పరవాలేదు. దర్శకుడు బాల మార్క్ ఈసారి మిస్ అయ్యింది. ముఖ్యంగా తన స్క్రీన్ ప్లే , డైలాగ్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.


జీ సినిమాలు సమీక్ష :

కొందరు తమిళ దర్శకులకు తెలుగులో ఓ ఇమేజ్ ఉంది. అందులో తమిళ దర్శకుడు బాల ఒకరు. ఆయన తీసిన కొన్ని సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు సాధించాయి. అందుకే బాల నుండి ఓ సినిమా వస్తుందంటే రొటీన్ కి భిన్నంగా నటీ నటుల అద్భుతమైన నటన లాంటివన్నీ ఊహిస్తారు ప్రేక్షకులు.. అయితే ఈసారి బాల మార్క్ ఈ సినిమాలో కనిపించలేదు. సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మినహా మిగతా సన్నివేశాల్లో బాల మార్క్ ఎక్కడ కనిపించదు. ఇక ఇటివలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ్యోతికకు ఈ సినిమా రూపంలో ఓ మంచి క్యారెక్టర్ దొరికింది. ఇలాంటి రోల్స్ కూడా చేయగలనని మరో సారి రుజువు చేసింది జ్యోతిక.

ఓ మైనర్ రేప్ కేసుతో మిస్టరీ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బాల తన స్క్రీన్ ప్లే తో మేజిక్ చేయలేకపోయాడు. ఈ సినిమా విషయంలో రచయితగా ఫెయిల్ అయ్యాడు బాల. సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఆయన స్టైల్ లో సంభాషణలు పడుంటే బాగుండేది.. ముఖ్యంగా జ్యోతిక క్యారెక్టర్ తో కథను మరింత ఎంగేజింగ్ గా చెప్పడంలో  బాల విఫలం అయ్యాడు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్స్ లేకపోవడం , ఇన్వెస్టిగేషన్ సీన్స్ పెద్దగా ఆసక్తిగా అనిపించకపోవడం, క్లైమాక్స్ తేలిపోవడం సినిమాకు మైనస్. జీ.వి.ప్రకాష్ కుమార్ ఇవన మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కొంత వరకూ ఆకట్టుకున్నప్పటికీ అవి గతంలో వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమాలను గుర్తుచేస్తాయి. కాకపోతే సినిమాకు కొద్దో గొప్పో అవే హైలైట్ అనిపిస్తాయి.

కొన్ని సందర్భాల్లో టివీల్లో వచ్చే సి.ఐ.డి లాంటి క్రైమ్ సీరియల్స్ ను గుర్తు చేస్తుంది ఈ సినిమా. బాల తీసుకున్న పాయింట్ కొత్తగా అనిపించకపోగా స్క్రీన్ ప్లే కూడా తేడా కొట్టడంతో ‘ఝాన్సీ’ కేవాలం ఓ సాదా సీదా సినిమా అనిపిస్తుంది.

రేటింగ్ : 2 /5