జయ జానకి నాయక రివ్యూ

Friday,August 11,2017 - 02:30 by Z_CLU

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్, జగపతి బాబు, శరత్ కుమార్, నందు,తరుణ్ అరోరా తదితరులు

సంగీతం: దేవిశ్రీప్రసాద్

మాటలు: ఎం.రత్నం

నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్

నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను

రిలీజ్ డేట్ : 11 -08 -2017

 

యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుందనగానే ‘జయ జానకి నాయక’ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల నడుమ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం.


కథ :

కాలేజ్ స్టూడెంట్ గా జీవితాన్ని గడిపే గగన్(బెల్లంకొండ శ్రీనివాస్) నాన్న చక్రవర్తి(శరత్ కుమార్), అన్నయ్య(నందు)లతో అన్యాయాలను ఎదుర్కుంటుంటాడు.  ఈ క్రమంలో తనకి పరిచయమైన స్వీట్ అలియాస్ జానకి ప్రేమలో పడతాడు గగన్. తను ప్రేమించిన జానకి పంతం-పరువు మధ్య నలిగి జీవితాన్ని కోల్పోవడంతో ప్రేయసి జీవితాన్ని చక్కదిద్దడం కోసం ఎంతకైనా తెగించే గగన్.. చివరికీ లిక్కర్ మాఫియా అర్జున్ పవర్(తరుణ్ అరోరా), అశ్విత్ నారాయణ(జగపతి బాబు) నుంచి జానకిని ఎలా కాపాడాడు.. ఫైనల్ గా తన కుటుంబంతో కలిసి జానకికి ఎలా అండగా నిలిచాడనేది సినిమా కథ.

 

నటీనటుల పనితీరు :

మొదటి సినిమాతో హీరోగా తానేంటో నిరూపించుకొని యాక్షన్, డాన్సులతో మెస్మరైజ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారో పవర్ ఫుల్ కుర్రాడిగా ఆకట్టుకొని సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో  తన యాక్షన్, డాన్సులతో మెస్మరైజ్ చేశాడు.  తన గ్లామర్, పర్ఫార్మెన్స్ తో జానకిగా మెప్పించి సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది రకుల్. ఇక వైజాగ్ అమ్మాయిగా తన గ్లామర్ తో పరవాలేదనిపించుకుంది ప్రగ్య. ప్రెజెంట్ స్టైలిష్ విలన్ గా ఎంటర్టైన్ చేస్తూ దూసుకెళ్తున్న జగపతి బాబు మరోసారి పరువునే ప్రాణంగా భావించే స్టైలిష్ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు. శరత్ కుమార్ మరోసారి తండ్రి క్యారెక్టర్ తో మెప్పించాడు . ఐటెం సాంగ్ లో తన అందాలతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది క్యాథరిన్. ఇక  విలన్ గా తరుణ్ అరోరా, వాని విశ్వనాధ్, నందు,సుమన్, ఎస్తర్, జీవి, శివన్నారాయణ, భరణి,చలపతి రావు, శశాంక్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పని తీరు :

సినిమాకు ముందు నుంచే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందనుకున్నారంతా. అయితే సాంగ్స్ తో ఆడియన్స్ ను నిరాశ పరిచాడు దేవి. ‘వీడే వీడే’ , ‘నువ్వేలే నువ్వేలే’ సాంగ్స్ తో పరవాలేదనిపించుకున్న దేవి  బ్యాగ్రౌండ్ స్కోర్ తో తన మేజిక్ చూపించాడు . కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తన  బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాలలో ఎం.రత్నం అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘రాయిలో దేవుడిని చూసే మీరు ఆడదాని మనసును అర్ధం చేసుకోలేకపోయారు బాధగా ఉందమ్మా’ అనే డైలాగ్ తో పాటు ఆడాళ్ళ పై వచ్చే మరికొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్.. యాక్షన్ ఇష్టపడే ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాయి. కొన్ని సందర్భాలలో దర్శకుడిగా తన మార్క్ స్క్రీన్ ప్లే తో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేశాడు బోయపాటి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

బోయపాటి నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందనగానే ఆ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొనడం కామనే. అయితే బోయపాటి ఈసారి ‘జయ జానకి నాయక’ అనే క్లాస్ టైటిల్ తో వస్తున్నాడగానే ఈ సినిమా బోయపాటి స్టైల్లో ఉంటుందా.. లేదా..అనే డౌట్ అందరిలో కలిగింది. ఈ సినిమాకు లవ్ & ఫ్యామిలీ స్టోరీను సెలెక్ట్ చేసుకున్న బోయపాటి తన మార్క్ యాక్షన్ ను కూడా మిక్స్ చేసి ఫైనల్ గా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. స్టార్టింగ్ లో సినిమాకి క్లాస్ టచ్ ఇచ్చిన బోయపాటి ఆ వెంటనే తన మార్క్ యాక్షన్ లోకి సినిమాను దింపాడు. ఇక తన కథకి అప్ కమింగ్ హీరో శ్రీనివాస్ ను సెలెక్ట్ చేసుకున్న బోయపాటి హీరోను ఓ వైపు క్లాస్ లుక్ లో చూపిస్తూనే మరో వైపు మాస్ హీరోగా ప్రెజెంట్ చేసి మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో పాటు ఫైట్, సెకండ్ హాఫ్ లో హంసలదీవి దగ్గర వచ్చే భారీ ఫైట్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్, రకుల్ గ్లామరస్ పెర్ఫార్మెన్స్, ప్రగ్య గ్లామర్, క్యాథరిన్ ఐటెం సాంగ్, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ పార్ట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు, రొటీన్ అనిపించే కథ, స్క్రీన్ ప్లే మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా యాక్షన్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ ను ఈ సినిమా ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేస్తుంది.

రేటింగ్ : 2 .75 /5