'జై సింహా' రివ్యూ

Friday,January 12,2018 - 03:15 by Z_CLU

నటీనటులు : బాలకృష్ణ , నయనతార, నటాషా, హరిప్రియ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, మురళీమోహన్ తదితరులు

మ్యూజిక్ : చిరంతన్ భట్

సినిమాటోగ్రఫీ : రామ్ ప్రసాద్

నిర్మాణం : సి.కే. ఎంటర్టైన్ మెంట్స్

నిర్మాత : సి.కళ్యాణ్

కథ – మాటలు : ఎం.రత్నం

కథ- స్క్రీన్ ప్లే – డైరెక్షన్ : కె.ఎస్.రవి కుమార్

రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

 

ప్రతీ ఏడాది తన సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచే నందమూరి నటసింహం బాలయ్య ఈ సంక్రాంతి కి ‘జై సింహ’ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేసిందో తెలుసుకుందాం.

కథ :

వైజాగ్ లో ఓ మెకానిక్ జీవితాన్ని గడిపే నరసింహ(బాలయ్య) అప్పుడే పుట్టిన తన కొడుకుతో వైజాగ్ విడిచి పెట్టి అనేక రాష్ట్రాలు తిరుగుతూ చివరికి కుంభకోణంలో సెటిల్ అవుతాడు. అలా కుంభకోణంలో మురళి (మురళీమోహన్) అనే ఆలయ ధర్మకర్త దగ్గర డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అలా కుంభకోణంలో సాధారణ జీవితం గడుపుతున్న నరసింహానికి అనుకోకుండా గతంలో తను ప్రేమించిన గౌరి (నయనతార) ఎదురవుతుంది. పోలీస్ ఆఫీసర్ ను పెళ్ళిచేసుకొని ఓ బిడ్డకి తల్లి అయిన గౌరీ నరసింహాన్ని చూడగానే అసహ్యించుకుంటుంది. ఇంతకీ నరసింహ వైజాగ్ విడిచి వెళ్ళడానికి కారణం ఏమిటి ..? ప్రాణంగా ప్రేమించిన గౌరి నరసింహాన్ని ఎందుకు అసహ్యించుకుంటుంది ? అసలు వీరిద్దరూ ఎందుకు విడిపోయారు… అనేదే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

నటీనటుల పనితీరు :

60 ఏళ్లకు దగ్గరైన బాలయ్య ఎప్పట్లాగే తన ఎనర్జిటిక్ యాక్టింగ్ – డాన్సులతో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో థియేటర్స్ లో విజిల్స్ వేయించాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో సెంటిమెంట్ పండించాడు. నయనతార ఎప్పటిలాగే తనకు పర్ఫెక్ట్ అనిపించే క్యారెక్టర్ తో ఆకట్టుకుంది. హరిప్రియ తన నటనతో క్యారెక్టర్ కి న్యాయం చేసింది. న‌టాషా దోషీ గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. ప్రకాష్ రాజ్ తన నటనతో సినిమాకు ప్లస్ అయ్యాడు. కాస్త గ్యాప్ తర్వాత తెరపైకొచ్చిన బ్రహ్మానందం కొన్ని సందర్భాల్లో నవ్వించాడు కాని పూర్తి స్థాయిలో ఎంటర్ టైన్ చేయలేకపోయాడు. విలన్ గా ఆశుతోష్ రానా పరవాలేదనిపించుకున్నాడు. ఇక మురళి మోహన్, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్, ప్రియ, శివాజీ రాజా, భద్రం తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది సంగీత దర్శకుడు చిరంతన్ భట్ గురించే… ‘అమ్ము కుట్టి’ అంటూ బాలయ్య ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా మంచి బీట్ ఇచ్చాడు. ‘ప్రియం’, ‘అనగనగా అందాల లోకం’ పాటలతో కూడా ఆకట్టుకున్నాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాలతో పాటు సాంగ్స్ పిక్చరైజేషన్ లో తన ప్రతిభ చూపించాడు రామ్ ప్రసాద్ ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాల్లో ఎం.రత్నం అందించిన పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. కథ పాతదే అయినప్పటికీ తన స్క్రీన్ ప్లే-డైరెక్షన్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు కె.ఎస్.రవి కుమార్. సి.కళ్యాణ్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

బాలయ్య నుంచి ఓ మాస్ ఎంటర్ టైనర్ సినిమా వస్తుందంటే ఆ సినిమా పై భారీ అంచనాలు నెలకొనడం సహజమే.. ప్రతీ ఏడాది ఓ సినిమాతో సంక్రాంతి హీరోగా నిలుస్తున్న బాలయ్య ఈ సంక్రాంతికి జైసింహా అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నాడనగానే అటు నందమూరి అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడనగానే జై సింహ రిలీజ్ కి ముందే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది.

సినిమా విషయానికొస్తే గతంలో ‘స్నేహం కోసం’ సినిమాకు దర్శకత్వం వహించిన కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాతో బాలయ్య ను నరసింహ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి ఎంటర్ టైన్ చేశాడు. ఇదివరకే చూసేసిన కథే అయినప్పటికే ఆ కథను కుంభకోణం వైపు తీసుకెళ్ళి తన స్క్రీన్ ప్లే- డైరెక్షన్ తో మేజిక్ చేశాడు. సినిమా ప్రారంభంలో నరసింహ అనే క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలిగించిన దర్శకుడు ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్ తో ఇంకాస్త ఇంట్రెస్ట్ కలిగించాడు. కాకపోతే బాలయ్య నుంచి అభిమానులు గాని మిగతా ప్రేక్షకులు గాని ఆశించే పవర్ ఫుల్ డైలాగ్స్ , ఫైట్స్… ఎక్కువగా లేకపోవడం నిరాశ పరుస్తుంది.

బాలయ్య క్యారెక్టర్, నయనతార పెర్ఫార్మెన్స్, నటాషా గ్లామర్, సాంగ్స్, బాగ్రౌండ్ స్కోర్, కుంభకోణం లో బ్రాహ్మణ కులం గురించి బాలయ్య చెప్పే డైలాగ్స్, కొన్ని సందర్భాల్లో వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్, ప్రీ ఇంటర్వెల్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్ సినిమాలో హైలైట్స్. కామెడి పండకపోవడం, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు మరీ బోర్ కొట్టించడం, ఆశించిన రీతిలో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ లేకపోవడం, కొన్ని సందర్భాల్లో వచ్చే సీన్స్ రొటీన్ అనిపించడం సినిమాకు మైనస్. ఫైనల్ గా బాలయ్య సినిమాల్ని ఇష్టపడేవాళ్లకు జై సింహా నచ్చుతాడు.

 

రేటింగ్ : 2.75/5