ఇగో మూవీ రివ్యూ

Friday,January 19,2018 - 03:01 by Z_CLU

నటీ నటులు : ఆశిష్ రాజ్, దీక్షాపంత్, రావు రమేశ్, పోసాని, పృధ్వి, శకలక శంకర్, చంద్ర చమ్మక్, గౌతంరాజు తదితరులు

సంగీతం : సాయికార్తీక్

కెమెరా : ప్రసాద్‌ జి.కె

నిర్మాతలు : విజయ్‌ కరణ్‌–కౌసల్‌ కరణ్‌–అనిల్‌ కరణ్‌

కథ- దర్శకత్వం : సుబ్రహ్మణ్యం ఆర్.వి. (సుబ్బు).

రిలీజ్ డేట్ : 19 జనవరి 2018

 

“ఆకతాయి” ఫేమ్‌ ఆశిష్‌ రాజ్, సిమ్రాన్‌ జంటగా ఇందు –గోపి మధ్య జరిగే ప్రేమకథతో రూపొందిన సినిమా ‘ఇగో’. సుబ్రమణ్యం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. సంక్రాంతి తర్వాత థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఎలా ఎంటర్ టైన్ చేసిందో..తెలుసుకుందాం.

కథ :

అమలాపురంలో ఉండే గోపి(ఆశిష్ రాజ్) కి , ఇందు(సిమ్రాన్) కి ఇగో ఫీలింగ్ ఎక్కువ. తమ ఇగోతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు. పైకి ద్వేషిస్తున్నట్లు నటిస్తూనే ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో తన ఇగో తో తనకంటే అందమైన అమ్మాయిని పెళ్ళిచేసుకుంటానని ఇందుకి చెప్పి హైదరాబాద్ వస్తాడు గోపి. ఇక తను ప్రేమించిన గోపి మరొకరికి దగ్గరవ్తున్నాడని తెలుసుకుకొని తన మనసులో మాట చెప్పాలని ఇందు కూడా హైదరాబాద్ వస్తుంది. అయితే అలా హైదరాబాద్ వచ్చిన గోపి ఓ అమ్మాయి(దీక్షా పంత్) మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అయితే ఆ కేసు నుండి గోపి ఎలా భయటపడ్డాడు. ఆ హత్య కేసులో గోపిని ఇరికించిందెవరూ ? చివరికి గోపి – ఇందు ఎలా ఒక్కటయ్యారు… అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

ఆకతాయి సినిమాతో హీరోగా పరవాలేదనిపించుకున్న ఆశిష్ రాజ్ మరో సారి తన పెర్ఫార్మెన్స్ తో ఎంటర్ టైన్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇందుగా సిమ్రాన్ తన గ్లామర్ , పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకొని మెయిన్ హైలైట్ గా నిలిచింది. దీక్షా పంత్ తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఆవుగడ్డ అప్పారావు అనే క్యారెక్టర్ తో పృథ్వి చేసిన కామెడి, డైలాగ్స్ ఎంటర్ టైన్ చేశాయి. పోసాని, శకలక శంకర్ , చమ్మక్ చంద్ర కొన్ని సందర్భాలలో ఎంటర్ టైన్ చేసారు. రావు రమేష్ తెలంగాణా స్లాంగ్ తో కూడిన క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేశాడు. అజయ్, మిగతా నటీ నటులందరూ తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

సినిమాకు సాయి కార్తిక్ అందించిన మ్యూజిక్ ప్లస్ అయ్యింది. సాంగ్స్ తో పాటు సినిమాకు తగిన బాగ్రౌండ్ స్కోర్ అందించాడు సాయి కార్తిక్. ముఖ్యంగా ‘కుర్రోడు పర్ఫెక్ట్ రోయ్’…’ఓ నాటు కోర్రోడా’,అక్కడ ఉందో- ఇక్కడ ఉందో’ సాంగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రసాద్‌ జి.కె తన ఫ్రేమింగ్ తో సినిమాను అందంగా చూపించాడు. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాలలో వచ్చే కామెడి పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కథ కి కొన్ని ట్విస్టులు ఆడ్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సుబ్రమణ్యం దర్శకుడిగా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ మెస్మరైజ్ చేయలేకపోయాడు. అమలాపురం లో తమ ఇగోలతో మనసులోని మాటను చెప్పలేకపోతున్న గోపి-ఇందు అనే ఇద్దరు క్యారెక్టర్స్ తో ఓ ప్రేమకథ ను రాసుకున్న దర్శకుడు దానికి కొన్ని హంగులు హద్దే ప్రయత్నం చేశాడు కాని దర్శకుడిగా కథను ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే పూర్తి స్థాయిలో వినోదం అందించలేకపోయాడు. ఒకానొక సందర్భంలో దర్శకుడిగా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఎప్పటి నుంచో తెలుగు సినిమాల్లో చూస్తున్న మూస ధోరణి నే కంటిన్యూ చేస్తూ చిరాకు తెప్పించాడు. ముఖ్యంగా ప్రెజెంట్ ఇంత డెవలప్ అవ్తున్న టైంలో కూడా ఇంకా ఏమి తెలియని పల్లెటూరి యువకుడిగా చూపిస్తూ వచ్చే సీన్స్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ మరీ బోర్ కొట్టించాయి.

హీరో క్యారెక్టర్ – రావు రమేష్ క్యారెక్టర్, సిమ్రాన్ గ్లామర్, సాంగ్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ సీన్స్, సినిమాకు ప్లస్ కాగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ మరీ బోర్ కొట్టించడం, లవ్ ట్రాక్, కామెడి పండకపోవడం, హీరోయిజం ఎలివేట్ చేస్తూ వచ్చే కొన్ని సీన్స్ , రొటీన్ స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్.

రేటింగ్ : 2 /5