'ఇది నా లవ్ స్టోరి' రివ్యూ

Wednesday,February 14,2018 - 03:12 by Z_CLU

నటీ నటులు : తరుణ్, ఒవియా తదితరులు

సంగీతం : శ్రీనాథ్ విజయ్

ఛాయాగ్రహణం : క్రిస్టోఫర్ జోసఫ్

నిర్మాత : ఎస్.వి.ప్రకాష్

నిర్మాణం  : రామ్ ఎంటర్ టైన్మెంట్స్ 

దర్శకత్వం : రమేష్-గోపి

విడుదల తేదీ : 14 ఫిబ్రవరి 2018

ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ కాస్త గ్యాప్ తర్వాత నటించిన ‘ఇది నా లవ్ స్టొరి’ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పట్లో వరుస లవ్ స్టోరీస్ తో సూపర్ హిట్స్ అందుకున్న తరుణ్ కి ఈ వెల్ కం బ్యాక్ మూవీ ఎలాంటి హిట్ అందించిందో.. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసిందో.. తెలుసుకుందాం..

 

కథ :

అభిరామ్(తరుణ్) ఒక యాడ్ ఫిల్మ్ మేకర్.. గతంలో లవ్ ఫెయిల్యూర్ కావడంతో కెరీర్ పై దృష్టి పెడతాడు. తన యాడ్ ఫిల్మ్ కు లొకేషన్స్ చూడటం కోసం అరకు వెళ్లిన అభి అనుకోకుండా శ్రుతి(ఓవియా) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే తను ప్రేమిస్తున్న శ్రుతి..  అభినయ అని, తను ఓ హెల్త్ ప్రాబ్లమ్ తో భాదపడుతుందని తెలుసుకుంటాడు. అసలు అభినయ ఎవరు..? ఆమెకి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి..? చివరికి  అభిరామ్-అభినయ ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

కెరీర్ స్టార్టింగ్ లో వరుస లవ్ స్టోరీస్ తో లవర్ బాయ్ ఇమేజ్ అందుకున్న తరుణ్ మరోసారి ప్రేమికుడిగా బెస్ట్ అనిపించుకున్నాడు. గ్యాప్ వచ్చినప్పటికీ ఎప్పటిలాగే తన పెర్ఫార్మెన్స్ తో హైలైట్ గా నిలిచాడు. మలయాళం, తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి, తమిళ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులరిటీ పొందిన ఒవియా ఇందులో హీరోయిన్ గా నటించి, తన గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. గెస్ట్ రోల్ లో మంచు మనోజ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఇక అశోక్, ఖయ్యుం తదితరులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

టెక్నిషియన్స్  పనితీరు :

ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్లకు మ్యూజిక్ ఎంత కీలకమో తెలిసిందే.. రిలీజ్ కి సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేసిన సంగీత దర్శకుడు  శ్రీనాథ్ విజయ్, బాగ్రౌండ్ స్కోర్ తో కూడా ఆకట్టుకున్నాడు. క్రిస్టోఫర్ జోసఫ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో మంచి ఔట్ పుట్ ఇచ్చాడు జోసఫ్. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాల్లో వచ్చే పంచ్ డైలాగ్స్ ఎంటర్టైన్ చేశాయి. రమేష్-గోపి డైరెక్షన్ వీక్ అనిపించింది. తమ మొదటి సినిమాకు ఒక రీమేక్ సినిమాను ఎంచుకున్న దర్శకులు రమేష్-గోపి.. స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డారు. ప్రొడక్షన్ వాల్యూస్  ఓకే.

 

జీ సినిమాలు సమీక్ష :

హీరోగా కాస్త గ్యాప్ తీసుకున్న తరుణ్ తనకి కలిసొచ్చిన లవ్ స్టోరీతోనే మళ్ళీ లక్ చెక్ చేసుకున్నాడు. ఈ సినిమా టీజర్ ని నాగార్జున రిలీజ్ చేయడం, రిలీజ్ కి ముందు తరుణ్ టూర్ ద్వారా కొన్ని కాలేజీలు చుట్టేయడంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది.

ఇక సినిమా విషయానికొస్తే ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ తన రీఎంట్రీ సినిమాకు కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ లవ్ స్టోరీ ని సెలక్ట్ చేసుకోవడం బాగానే ఉన్నా.. ఈ రీమేక్ తో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు. నిజానికి ఈ సినిమా విషయంలో సాంగ్స్, డైలాగ్స్ మీద పెట్టిన శ్రద్ధ ఎమోషనల్ సీన్స్, లవ్ ట్రాక్ మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది. గతంలో తన పెర్ఫార్మెన్స్ తో హైలైట్ గా నిలిచి సక్సెస్ లో భాగమైన తరుణ్, ఈ సినిమా విషయంలో ఏం చేయలేకపోయాడు. ఒకానొక  సందర్భంలో  సంచులకొద్ది  వచ్చే పంచ్ డైలాగ్స్, కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ప్రేక్షకులకు విసుగు రావడం ఖాయం. ఓ భాషలో హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దర్శకులు రమేష్-గోపి ఇంకాస్త జాగ్రత్త వహించి లవ్ ట్రాక్ మీద, ఎమోషనల్ సీన్స్ మీద దృష్టి పెట్టి ఉంటే రిజల్ట్  బెటర్ గా ఉండేది.

ఎన్ని ప్రేమకథలు వచ్చినా, మెస్మరైజ్ చేసే స్క్రీన్ ప్లే ఉంటే ఈ జోనర్ సినిమాకి ఢోకా ఉండదనే విషయాన్ని చాలా సినిమాలు నిరూపించాయి. కాని రమేష్- గోపి ఈ లవ్ స్టొరీని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో ఫెయిలయ్యారు.

తరుణ్ క్యారెక్టర్, ఒవియా గ్లామర్, సాంగ్స్, కొన్ని డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా బోర్ కొట్టించే సన్నివేశాలు, అసందర్భంగా వచ్చే పంచ్ డైలాగ్స్, లవ్ ట్రాక్, ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీస్ సినిమాకు మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా “ఇది నా లవ్ స్టోరీ” సినిమా ఆడియన్స్ ను డిసప్పాయింట్ చేస్తుంది.

రేటింగ్ : 2 /5