'హౌరా బ్రిడ్జ్' రివ్యూ

Saturday,February 03,2018 - 04:10 by Z_CLU

నటీనటులు : రాహుల్ రవీంద్రన్,చాందినీ చౌదరి,మనాలీ రాథోడ్,రావ్ రమేష్,అజయ్, ఆలీ,పోసాని కృష్ణ మురళి, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ తదితరులు

మ్యూజిక్ : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రాఫర్ : విజయ్ మిశ్రా

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

మాటలు : శ్యాం మండల

నిర్మాత : ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం – రేవన్ యాదు

రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2018

 

రాహుల్ రవీంద్రన్ – చాందిని చౌదరి జంటగా రేవన్ యాదు డైరెక్షన్ లో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ‘హౌరా బ్రిడ్జ్’. ఇప్పటికే పలు మార్లు పోస్ట్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకి థియేటర్స్ లో అడుగుపెట్టింది. రొమాంటిక్ పోస్టర్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఎంటర్టైనర్.. తెలుసుకుందాం.

కథ :

కోల్ కొత్తాలో సెటిల్ అయిన అర్జున్(రాహుల్ రవీంద్రన్) తన చిన్ననాటి స్నేహితురాలు స్వీటీని ప్రేమిస్తూ తనని పెళ్లిచేసుకోవాలనే ఉద్దేశ్యంతో మాచవరం వస్తాడు. చిన్నతనంలో తమనిద్దరినీ కలిపిన బ్రిడ్జ్ దగ్గర స్వీటీ(చాందిని చౌదరి) ని కలుసుకుంటాడు అర్జున్. కానీ చిన్నతనం నుంచి తన బావ(అజయ్)నే భర్తగా ఊహించుకున్న స్వీటీ.. మొదట్లో అర్జున్ ప్రేమను నిరాకరించినా.. ఆ తర్వాత తన ప్రేమలో నిజాయితి తెలుసుకుని పెళ్లికి అంగీకరిస్తుంది. కానీ ఈలోపు తను ఎన్నేళ్ళుగానో ప్రేమిస్తున్న స్వీటీ.. ఈ స్వీటీ ఒకరు కాదని తెలుసుకుంటాడు అర్జున్.
అయితే అర్జున్ ప్రేమించిన స్వీటీ ఎవరు.. ? చివరికీ అర్జున్ తన చిన్ననాటి స్వీటీని చేసుకున్నాడా.. లేక తాను పొరబడి ప్రేమ పేరుతో డిస్టబ్ చేసిన మరో స్వీటిని పెళ్లిచేసుకున్నాడా ? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

హీరోగా తను నటించిన ప్రతీ సినిమాతో బెస్ట్ అనిపించుకున్న రాహుల్ రవీంద్రన్ మరో సారి తనకి ఆప్ట్ అనిపించే రోల్ తో అర్జున్ గా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా చాందిని చౌదరి ఆకట్టుకుంది కాని నటన పరంగా ఇంకా బెటర్ అవ్వాలి. మనాలీ రాథోడ్ తన జస్ట్ పరవాలేదనిపించుకుంది. రావు రమేష్ తన క్యారెక్టర్ తో కొన్ని సందర్భాల్లో ఎంటర్ టైన్ చేశాడు. పోసాని-మధు నందన్ తమ కామెడీ పండలేదు. అలీ- విధ్యుల్లేఖ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రభాస్ శ్రీను, మిగతా నటీ నటులు తమ క్యారెక్టర్స్ పరవాలేదనిపించుకున్నారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు సంబందించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ శేకర్ చంద్ర గురించే.. తన మార్క్ లవ్ సాంగ్స్ తో పాటు అదిరిపోయే బాగ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు శేఖర్ చంద్ర. ‘ఏవో ఏవో,’చిన్ననాటి నేస్తం’,’తొలి సారిగా’,’ఉదయించే సూర్యుడిలా’ సాంగ్స్ బాగున్నాయి. ఈ పాటలకు శ్రీమణి, భాగ్యలక్ష్మి , పూర్ణా చారి, కరుణాకర్ అందించిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. విజయ్ మిశ్రా సినిమాటోగ్రఫీ పరవాలేదు. సాంగ్స్ పిక్చరైజేషన్ లో అలాగే కొన్ని సీన్స్ లో విజయ్ తన కెమెరా పనితనం చూపించాడు. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాల్లో వచ్చే మాటలు ఆకట్టుకున్నాయి. రేవన్ యాద్ కథ-కథనం రొటీన్ అనిపించాయి . ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.


జీ సినిమాలు సమీక్ష :

శివాజీ హీరోగా తెరకెక్కిన ‘బూచమ్మ బూచోడు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రేవన్ యాదు ఆ సినిమా తర్వాత కాస్త టైం తీసుకొని తెరకెక్కించిన సినిమా ‘హౌరా బ్రిడ్జ్’. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయలేకపోయింది. మొదటి సినిమాతో దర్శకుడిగా హిట్ అందుకొని గుర్తింపు తెచ్చుకున్న రేవన్ యాదు ఈ సినిమాతో దర్శకుడిగా తన మేజిక్ రిపీట్ చేయలేకపోయాడు.

ఈ సినిమా కోసం ఓ బ్రిడ్జ్ చుట్టూ జరిగే ప్రేమకథను సెలెక్ట్ చేసుకున్న దర్శకుడు తన స్క్రీన్ ప్లే తో ఎంటర్టైన్ చేయలేక తడబడ్డాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ లో పండాల్సిన ఎమోషన్ కూడా సరిగ్గా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా ఈ సినిమాను తెరకెక్కించిన రేవన్ యాదు ఆ లవ్ స్టోరీను ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయాడు. స్టార్టింగ్ లో పరవాలేదనిపించినా రాను రాను మరింత బోర్ కొట్టించాడు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో కథ ముందుకు సాగకపోవడం ప్రేక్షకులకు చిరాకు కలిగిస్తూ వాళ్ళ అసహనాన్ని పరీక్షిస్తుంది. శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన సాంగ్స్, పిక్చరైజేషన్ ప్రేక్షకులకు కాస్త ఊరట కలిగిస్తాయి.

రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్, చాందిని చౌదరి గ్లామర్, రావు రమేష్ క్యారెక్టర్ ను తెలియజేసే సీన్స్, సాంగ్స్, బాగ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలైట్స్ కాగా కథ -కథనం ఆకట్టుకోకపోవడం, లవ్ ట్రాక్, కామెడి పండకపోవడం, సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టించడం, డైరెక్షన్ వీక్ అనిపించడం సినిమాకు మైనస్.

రేటింగ్ : 2 / 5