'హ్యాపీ వెడ్డింగ్' మూవీ రివ్యూ

Saturday,July 28,2018 - 05:02 by Z_CLU

న‌టీన‌టులు : సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌ త‌దిత‌రులు.

స‌మ‌ర్ప‌ణ‌ : యువి క్రియేష‌న్స్

కెమెరా : బాల్ రెడ్డి

మ్యూజిక్ : శ‌క్తికాంత్ కార్తిక్‌

నిర్మాత‌ : పాకెట్ సినిమా

ద‌ర్శ‌క‌త్వం : ల‌క్ష్మ‌ణ్ కార్య‌

విడుదల తేది : 28 జులై 2018

సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా తెరకెక్కిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ఈరోజే రిలీజైంది… పెళ్ళికి ముందు జరిగే సంఘటనలతో లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? ఈ జంటతో కొత్త దర్శకుడు లక్ష్మణ్ ఎంటర్టైన్ చేయగలిగాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

కథ :

విజయవాడ కుర్రాడు ఆనంద్(సుమంత్ అశ్విన్), హైదరాబాద్ అమ్మాయి అక్షర(నీహారిక) ప్రేమించుకుంటారు. ఇరువురి కుటుంబ పెద్దలు గోపాల్(నరేష్), హనుమంతరావు(మురళిశర్మ) వీరికి పెళ్లి ఖాయం చేసి ఏర్పాట్లు మొదలుపెడతారు. ఇంతలో గతంలో అక్షర ప్రేమికుడు విజయ్(రాజా) తిరిగి వస్తాడు. గతంలో ఇద్దరు కలిసి చేసిన బొటీక్ బిజినెస్ పేరుతో తనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు విజయ్. జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కన్ఫ్యూజ్ అయ్యే అక్షర.. పెళ్లి దాకా వచ్చి ప్రేమ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది.

ఈ క్రమంలో ఆనంద్ కి కూడా బ్రేకప్ చెప్పేస్తుంది. ఆనంద్ మాత్రం అక్షరను విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అక్షరలో మార్పు కోసం ఓపిగ్గా ఎదురుచూస్తుంటాడు. చివరికి అక్షర పెళ్లి ఆనంద్ తోనే జరిగిందా.. లేదా మాజీ ప్రేమికుడు విజయ్ తో జరిగిందా ? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

 

నటీనటుల పనితీరు:

సుమంత్ అశ్విన్ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ కుర్రాడిగా మెప్పించాడు. ముఖ్యంగా ఈ సినిమా కోసం సుమంత్ అశ్విన్ ట్రై చేసిన లుక్ బాగుంది. మొదటి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నిహారిక కి మంచి క్యారెక్టర్ లభించింది. కొన్ని సన్నివేశాల్లో ఎట్రాక్ట్ చేసిన నిహారిక, అక్షర క్యారెక్టర్ కి ఉన్నంతలో బెస్ట్ అనిపించుకుంది. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ ఇస్తే బాగుండేది.

మురళి శర్మ, నరేష్, పవిత్ర లోకేష్, తులసి వారి క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. పూజిత పోన్నాడ తన పెర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకుంది. రాజా కేవలం దర్శకుడు చెప్పినట్టు చేస్తూ వెళ్ళాడనిపించింది. ఇక అన్నపూర్ణమ్మ, ఇంద్రజ, మధుమణి, ప్రీతీ తదితరులు వారి క్యారెక్టర్స్ కి ఓ మోస్తరుగా న్యాయం చేశారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. శక్తికాంత్ కార్తీక్ అందించిన ‘కాదని నువ్వంటున్నది’,’దీంతనా తొంతనా’ పాటలు బాగున్నాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు తగినట్టుగా ఉంది. ఎడిటింగ్ పరవాలేదు. ఇంకా కొన్ని సీన్స్ తొలగించి ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాల్లో భవాని ప్రసాద్ అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. లక్ష్మణ్ కార్య డైరెక్షన్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే బెడిసికొట్టింది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా ఓ లవ్ & ఫ్యామిలీ ఎంటక్ టైనర్ రాబోతుందనగానే ‘హ్యాపీ వెడ్డింగ్’ పై ప్రేక్షకుల్లో కాస్త బజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ కూడా సినిమాపై పాజిటీవ్ వైబ్స్ తీసుకొచ్చాయి. పైగా యు.వి.సంస్థ సినిమాను రిలీజ్ చేయడం, రామ్ చరణ్ ప్రమోట్ చేయడం సినిమాపై హైప్ తీసుకొచ్చాయి.

ఇక సినిమా విషయానికొస్తే కొత్త దర్శకుడు లక్ష్మణ్ కార్య మొదటి సినిమాకు సేఫ్ సబ్జెక్టే ఎంచుకున్నప్పటికీ దాన్ని సరైన స్క్రీన్ ప్లే తో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా పెళ్ళికి ముందు అమ్మాయిల ఆలోచన విధానాన్ని ఒక కన్ఫ్యూజన్ క్యారెక్టర్ తో చెప్పాలనుకున్న దర్శకుడు ఆ విషయాన్ని మరీ సాగదీస్తూ చెప్పడం సినిమాకు మైనస్. పైగా కథ కూడా ఎక్కడికి కదలకుండా అక్కడే తిరుగుతూ ఉండటం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది.

తెలిసిన కథే అయినా ఇలాంటి స్టోరీలను పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో వర్కౌట్ చేస్తే రిజల్ట్ బెటర్ గా ఉంటుంది. దర్శకుడు సరిగ్గా ఇక్కడే తడబడ్డాడు. సినిమా చూస్తున్నంత సేపు హీరోయిన్ కోసం హీరో ఓపిక పట్టినట్టుగా ప్రేక్షకుడు ఓపిక పట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా సినిమాకి మెయిన్ ఇంపార్టెంట్ అనిపించే క్లైమాక్స్ కూడా సింపుల్ గానే తేల్చేసాడు దర్శకుడు. ఇక సినిమాలో రెండు ప్రేమకథలను చూపించిన దర్శకుడు ఒక్క స్టోరీ ను కూడా హైలైట్ చేయలేకపోయాడు. మరీ ముఖ్యంగా అక్షర ఫస్ట్ లవ్ స్టోరీ ఎందుకు బ్రేక్ అప్ అయ్యిందనే దాని మీద పెద్దగా క్లారిటీ ఇవ్వని దర్శకుడు, ఆనంద్ అక్షర కి మరీ అంతలా కనెక్ట్ అవ్వడానికి రీజన్ కూడా చెప్పలేకపోయాడు.ముఖ్యంగా సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే కథేంటో…ఏం జరగబోతుందో తెలిసిపోవడంతో పెద్దగా ఆసక్తి కలిగించదు.

ఈ మైనస్ ల సంగతి పక్కనపెడితే మెగా హీరోయిన్ నిహారిక చూడ్డానికి చాలా బాగుంది. ఆమె ప్రజెన్స్ సినిమాకు మేజర్ హైలెట్. ఇక సుమంత్ అశ్విన్, నిహారిక కెమిస్ట్రీ కూడా కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు తోడవ్వడంతో కొన్ని సన్నివేశాలు బాగా పండాయి. ఈ ఫ్యామిలీ కథకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శక్తి కాంత్ 2 హిట్ సాంగ్స్ యాడ్ అవ్వడం మరో అడ్వాంటేజ్.

ఓవరాల్ గా.. ‘హ్యాపీ వెడ్డింగ్’ అక్కడక్కడా మెరుస్తూ, కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తూ పరవాలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2.5 /5