'ఈ మాయ పేరేమిటో' మూవీ రివ్యూ

Friday,September 21,2018 - 03:33 by Z_CLU

నటీ నటులు : రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ , రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌  త‌దిత‌రులు

సంగీతం : మ‌ణిశ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫీ : శ్యాం కె.నాయుడు

ఫైట్స్‌ : విజయ్‌

ఎడిట‌ర్‌ : న‌వీన్ నూలి

నిర్మాత‌ : దివ్యా విజ‌య్‌

ద‌ర్శ‌క‌త్వం : రాము కొప్పుల.

విడుదల తేది : 21 సెప్టెంబర్ 2018

 

ప్రతీ వారం కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంటాయి… ఈ వారం కూడా కొన్ని సినిమాలతో పాటు ‘ఈ మాయ పేరేమిటో’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా తెరకెక్కిన ‘ఈ మాయ పేరేమిటో’ ఈరోజే థియేటర్స్ లోకొచ్చింది… మరి ఈ డెబ్యూ హీరో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడా… ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్ శిష్యుడు రాము కొప్పుల తన డైరెక్షన్ తో మెస్మరైజ్ చేసాడా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ


కథ :

వైజాగ్ లో వ్యాపార వేత్తగా సెటిల్ అయిన ప్రమోద్ జైన్(మురళి శర్మ) తన కూతురు శీతల్ జైన్(కావ్య థాపర్) అల్లారుముద్దుగా పెంచుతాడు. ఇక అల్లరిచిల్లరిగా తిరుగుతూ తన బిహేవియర్ తో అందరితో మంచి అనిపించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు చందు(రాహుల్ విజయ్)… అయితే ఒకానొక సందర్భంలో ఎదుటివారికి సాహయపడే తనలాంటి గుణం చూసి చందు ప్రేమలో పడిపోతుంది శీతల్.. అలా చందు ప్రేమలో పడిన శీతల్ ఆ విషయాన్నీ చందూకి చెప్పకుండా అతనికి తెలియకుండా ఫాలో అవుతుంది.. తనను అమితంగా ప్రేమిస్తూ వెంటే తిరిగే
అమ్మాయి శీతల్ అని తెలుసుకున్న చందు అప్పటి నుండి శీతల్ తో ప్రేమాయణం కొనసాగిస్తాడు… ఈ క్రమంలో ఇంట్లో జరిగిన ఓ ఇంసిడెంట్ చందులో మార్పు తీసుకొస్తుంది.. ఆ మార్పు చూసి ప్రమోద్ జైన్ చందుని అల్లుడిగా ఒప్పుకుంటాడు. అయితే అనుకోకుండా శీతల్ చందు లవర్ గా రిజెక్ట్ చేస్తుంది… తన తండ్రి తర్వాత అంతగా ఇష్టపడిన చందును శీతల్ ఎందుకు రిజెక్ట్ చేసింది…చివరికి చందు శీతల్ ఎలా ఒకటయ్యారు..అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

డెబ్యూ సినిమా అయినప్పటికీ రాహుల్ విజయ్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో మెప్పించాడు. ముఖ్యంగా డాన్స్, ఫైట్స్ చాలా ఈజ్ తో చేసి మెస్మరైజ్ చేసాడు. కాకపోతే ఎమోషనల్ సీన్స్ లో తేలిపోయాడు. కావ్య థాపర్ కూడా డెబ్యూ అయినప్పటికీ తన పెర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్ కి బెస్ట్ అనిపించుకుంది. గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. ఇక రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, పవిత్ర లోకేష్, ఈశ్వరి రావు లాంటి సీనియర్ ఆర్టిస్టులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, కామెడి వర్కౌట్ అవ్వలేదు. రాళ్ళ పల్లి, పోసాని, కాదంబరి కిరణ్, జోష్ రవి తదితరులు పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :

మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.. ‘మంచి పేరు’,’నాలో నేను’,’అరి హంతనం’ పాటలు ఆకట్టుకున్నాయి.. నేపథ్య సంగీతం బాగుంది. శ్యాం కే నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్.. తన కెమెరా వర్క్ తో విజువల్ గా ఎట్రాక్ట్ చేసాడు.. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ పరవాలేదు. శ్రీమణి ల్యిరిక్స్ ఆకట్టుకున్నాయి. రాము కొప్పుల కథ, స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ అలరిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

నిర్మాతల కొడుకులు, దర్శకుల కొడుకులు హీరో అవ్వడం షరా మామూలే.. ఓ ఫైట్ మాస్టర్ కొడుకు హీరోగా మారడం అన్నది కాస్త కొత్తే.. ముప్పై ఏళ్లుగా సినీ రంగంలో ఫైట్ మాస్టర్ గా పనిచేస్తున్న విజయ్ మాస్టర్ తన తనయుడు…రాహుల్ ని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేసాడు.. ఇక విజయ్ మాస్టర్ తో అనుబంధం ఉన్న స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్స్ రాహుల్ డెబ్యూ సినిమాను తమ వంతుగా ప్రమోట్ చేస్తూ వచ్చారు.

సినిమా విషయానికొస్తే.. సినిమాకి ఆయువుపట్టు అనేది కథే.. బలమైన కథకి బలమైన సన్నివేశాలు రాసుకుంటే ప్రేక్షకులను మెప్పించడం చాలా సులువు.. సరిగ్గా ఇక్కడే దర్శకుడు రాము కొప్పుల ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమా కోసం ఆడియన్స్ కి ఎప్పుడో బోర్ కొట్టేసిన రౌటిన్ కథనే ఎంచుకోవడం దానికి సరైన స్క్రీన్ ప్లే ,బలమైన సన్నివేశాలు రాసుకోకపోవడంతో తేడా కొట్టింది.. తన డెబ్యూ సినిమాకు టాలెంట్ ఉన్న హీరో హీరోయిన్ దొరికారు.. కానీ ఈ వీక్ స్టోరీతో సినిమాను ముందుకు నడిపించడంలో తడబడ్డాడు రాము. రొటీన్ కథ కావడంతో హీరో హీరోయిన్ , సీనియర్ ఆర్టిస్టులు కూడా ఏం చేయలేకపోయారు. నాని వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన సినిమాలో ఎక్కడా కొత్తదనం కనిపించకపోవడం, ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

సినిమా చూస్తున్నంత సేపు ఏదో సాగుతుందిలే.. అన్నట్టుగా ప్రేక్షకుడు ఫీలవుతుంటాడు. మరీ ముఖ్యంగా ఈ రొటీన్ డ్రామాను కాస్త సాగదీస్తూ చెప్పడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. కమెడియన్స్ ఉన్నప్పటికీ వారిని కామెడి ఆంగిల్ లో వాడుకోలేకపోయాడు దర్శకుడు. ఇలాంటి కథతో హీరోగా పరిచయం అవ్వడం అనేది రాహుల్ రాంగ్ ఛాయస్ అనే చెప్పాలి.. కాకపోతే ఈ సినిమా రాహుల్ విజయ్ కి ఓ షో రీల్ లా ఉపయోగపడుతుంది. సినిమా ప్రారంభం నుండి ఏదో చెయ్యాలనే తపన అతనిలో కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతీ సాంగ్ లో తన డాన్స్ టాలెంట్ ను చూపించాలని ఆరాటపడ్డాడు. ఇక ఫైట్ మాస్టర్ కొడుకు కాబట్టి ఫైట్స్ కూడా చాలా ఈజీ గా చేసేసాడు.

రొటీన్ కథ – స్క్రీన్ ప్లే, కామెడి లేకపోవడం,లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ పండకపోవడం, క్లైమాక్స్ … సినిమాలో మైనస్ పాయింట్స్ కాగా…. హీరో రాహుల్ పెర్ఫార్మెన్స్ , క్యారెక్టర్స్ , సాంగ్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్స్.

రేటింగ్ : 2 /5