'డీజే దువ్వాడ జగన్నాథం' రివ్యూ

Friday,June 23,2017 - 04:00 by Z_CLU

విడుదల : జూన్ 23 , 2017

నటీనటులు : అల్లు అర్జున్ , పూజ హెగ్డే

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత : దిల్ రాజు

రచన- స్క్రీన్ ప్లే -దర్శకత్వం : హరీష్ శంకర్

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘డీజే దువ్వాడ జగన్నాథం’ అల్లు అర్జున్ బ్రాహ్మణ గెటప్ లో కనిపిస్తూ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది.. మరి డీజే గా అల్లు అర్జున్ ఎలా ఎంటర్టైన్ చేసాడో..చూద్దాం.

కథ :

విజయవాడలో సత్యనారాయణపురం అగ్రహారం అనే ఊళ్ళో బ్రాహ్మణ కుర్రాడిగా కుటుంబంతో కలిసి పెళ్లిళ్లకు వంటచేసే దువ్వాడ జగన్నాథం(అల్లు అర్జున్) చిన్నతనంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల సమాజంలో అన్యాయాలు జరగకుండా ఓ మార్పు తీసుకురావాలనుకుంటాడు. ఇందుకోసం ఓ పోలీస్ అధికారి పురుషోత్తం(మురళి శర్మ) సహాయం అందుకున్న దువ్వాడ సమాజంలో ప్రజలకి అన్యాయం చేసే వారిని ఎలా ఏ విధంగా ఎదుర్కున్నాడు.. చివరికి పెద్ద రియల్టర్ గా పేరొంది ప్రజల నుంచి డబ్బు దండుకున్న రొయ్యల నాయుడును ఏ విధంగా ఎదిరించి అంతమొందిచాడు.. అనేది సినిమా కథాంశం..

 

నటీనటుల పనితీరు :

అల్లు అర్జున్ మరోసారి తన ఎమోషనల్ యాక్టింగ్ తో పాటు దువ్వాడ జగన్నాథం అనే క్యారెక్టర్ తో తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు.. ముఖ్యంగా బ్రాహ్మణ కుర్రాడిగా తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసి డాన్సులతో, ఫైట్స్ తో మరింతగా ఎట్రాక్ట్ చేసి సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచాడు. పూజా హెగ్డే తన గ్లామర్ తో ఆకట్టుకొని సినిమాకు ప్లస్ అయింది. రొయ్యల నాయుడు అనే డిఫరెంట్ క్యారెక్టర్ లో మరోసారి తన తండ్రి రావుగోపాలరావును గుర్తుచేసి తన నటనతో అలరించాడు రావు రమేష్. మురళి శర్మ, తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్,రాళ్ల పల్లి, పోసాని కృష్ణ మురళి, భరణి, సుబ్బరాజు, విద్యు లేఖ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది దేవిశ్రీ ప్రసాద్ గురించే. రిలీజ్ కి ముందే పాటలతో సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చిన దేవి.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో  సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు. పాటలకు సాహిత్యం కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ విజిల్స్ వేయించాయి. ముఖ్యంగా “పబ్బుల్లో వాయించే డీజే కాదు పగిలే పోయేలా వాయించే డీజే” ,’ ఈరోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్ యుద్ధం శరణం గచ్చామి”,,”మనం చేసే పనిలో మంచి కనబడాలి గాని మనిషి కనిపించనక్కర్లేదు”,’చిన్నప్పుడు మీ నాయనమ్మ పిల్లుల్ని చంపొద్దని చెప్పింది కానీ పులుల్ని కెలకొద్దని చెప్పలేదా”,’మధ్య తరగతి వాళ్లే ముందు స్కీములను నమ్ముకొని ఆ తర్వాత స్కాముల్లో తేలతారు.” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకొని  థియేటర్స్ లో విజిల్స్ వేయించాయి.దర్శకుడు హరీష్ శంకర్ స్క్రీన్ ప్లే-డైలాగ్స్ బాగున్నాయి. ‘సీటీ మార్’, ‘గుడిలో బడిలో’ పాటలకు కొరియోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి..

జీ సినిమాలు సమీక్ష

ఎంటర్ టైన్ మెంట్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లడంతో బన్నీని మించిన స్టార్ లేడు. అతడి ఎనర్జీకి ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ అయితే సినిమా సూపరే. మరోవైపు తన సినిమాల్లో ఎంటర్ టైన్ మెంట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే దర్శకుడు హరీష్ శంకర్. వీళ్లిద్దరూ కలిస్తే సినిమా కచ్చితంగా కమర్షియల్ ఎంటర్ టైనరే. ఈ ఎక్స్ పెక్టేషన్ ను డీజే యూనిట్ వందకు వందశాతం అందుకుంది. సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్.

ఓ సీరియస్ సబ్జెక్ట్ కు డీజే లాంటి ఎంటర్ టైనింగ్ క్యారెక్టర్ ను అద్భుతంగా సింక్ చేశాడు దర్శకుడు హరీశ్ శంకర్. మరీ ముఖ్యంగా తనలోని దర్శకుడ్ని, రచయితను పర్ ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ డీజేను మాస్ ఎంటర్ టైనర్ గా మలిచాడు. మరీ ముఖ్యంగా రిలీజ్ కు ముందు నుంచే చెప్పినట్టు.. క్లయిమాక్స్ అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఓ కొత్త తరహా క్లైమాక్స్ కోసం హరీష్ శంకర్, అల్లు అర్జున్ ప్రయత్నించడం మెచ్చుకోదగ్గ అంశం.

ఇక బన్నీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్టోరీ ఏదైనా, క్యారెక్టర్ ఎలాంటిదైనా తను రంగంలోకి దిగితే సీన్ పండాల్సిందే. డీజేలో కూడా అదే జరిగింది. దువ్వాడ జగన్నాథమ్ లాంటి బ్రాహ్మణ యువకుడి క్యారెక్టర్ ను, డీజే లాంటి స్టయిలిష్ ఎగ్రెసివ్ మేన్ పాత్రను ఒకే సినిమాలో అలవోకగా పోషించి తనకుతానే సాటి అనిపించుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే డీజే సినిమాలో బన్నీ విశ్వరూపం కనిపిస్తుంది. అతడి క్యారెక్టరైజేషన్ రచ్చస్య..రచ్చోభ్యహ.

డీజేకు అన్నీ కుదిరాయి. బన్నీ లాంటి హీరో దొరికాడు. పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మ కుదిరింది. హరీష్ లాంటి మాస్ డైరక్టర్ సెట్ అయ్యాడు. దేవిశ్రీ లాంటి సంగీత దర్శకుడు ఉన్నాడు. వీటికి తోడు నిర్మాణ విలువల్లో రాజీపడని దిల్ రాజున్నారు. ఇలా ది బెస్ట్ టీం కలిసి  చేసిన సక్సెస్ ఫుల్ ప్రయత్నం దువ్వాడ జగన్నాథమ్. మాస్, క్లాస్ అనే తేడాలేకుండా ప్రతిఒక్కర్ని ఎట్రాక్ట్ చేస్తాడు డీజే.

 

రేటింగ్ : 3 .5 /5