'దర్శకుడు' మూవీ రివ్యూ

Friday,August 04,2017 - 06:14 by Z_CLU

నటీనటుల : అశోక్, ఈషా

సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ అనుమోలు

ఎడిటింగ్ : నవీన్‌ నూలి

సంగీతం : సాయికార్తీక్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రమేష్ కోలా

నిర్మాణం : సుకుమార్ రైటింగ్స్

నిర్మాతలు : సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి

కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం : హరిప్రసాద్ జక్కా

 

కుమారి 21 ఎఫ్ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ నిర్మాణంలో మరో సినిమా వస్తుందనగానే దర్శకుడు సినిమా పై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాను ప్రమోట్ చేయడం, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడంతో టాలీవుడ్ లో ఈ సినిమా చిన్న సైజు బజ్ క్రియేట్ చేసింది. మరి ఇన్ని అంచనాల మధ్య వచ్చిన “దర్శకుడు” మెప్పించాడా..?

 

కథ :

చిన్నతనం నుంచి దర్శకుడవ్వాలనే మహేష్(అశోక్) ఓ నిర్మాత సహాయంతో దర్శకుడిగా ఛాన్స్ అందుకొని కథను సిద్ధం చేసే పనిలో పడతాడు. అదే సమయంలో ఓ ప్రయాణంలో మహేష్ కి పరిచయమవుతుంది నమ్రత(ఈషా రెబ్బ). అలా
ప్రయాణంలో పరిచయమైన మహేష్ – నమ్రత ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే మహేష్ దర్శకుడు కావడంతో ప్రేమలో ప్రతీ సన్నివేశాన్ని దర్శకుడి కోణంలోనే చూస్తుంటాడు. అది ఇష్టంలేని నమ్రత అశోక్ ను ద్వేషించడం మొదలుపెట్టి దూరం అవుతుంది. ఈ క్రమంలో తను అమితంగా ఇష్టపడే సినిమాకు, ప్రేమించిన అమ్మాయికి ఒకేసారి దూరమవుతాడు మహేష్. అసలు ఏం జరిగింది.. మహేష్ ఈ రెండిటికి ఎందుకు దూరం అవుతాడు.. చివరికీ మహేష్ దర్శకుడిగా సినిమా పూర్తి చేశాడా… తన ప్రేమను దక్కించుకున్నాడా… అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన అశోక్.. మహేష్ అనే దర్శకుడి క్యారెక్టర్ తో ఓవరాల్ గా పరవాలేదనిపించుకున్నప్పటికీ కొన్ని సన్నివేశాల్లో మాత్రం అనుభవం ఉన్న నటుడిగా ఆకట్టుకున్నాడు. తన నేచురల్ పెరఫార్మెన్స్ తో నమ్రత క్యారెక్టర్ తో ఆకట్టుకుని సినిమాకు హైలైట్ గా నిలిచింది ఈషా. తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశాడు సుదర్శన్. ఇక జెమినీ సురేష్, నవీన్ నేని, పూజిత, ప్రియదర్శి, నోయెల్, తదితరులు తమ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ గురించే. తన కెమెరా పనితనం చూపించి సినిమాకు ప్లస్ అయ్యాడు. సాయి కార్తీక్ అందించిన సాంగ్స్ పరవాలేదనిపించగా, కొన్ని సందర్భాలలో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ పరవాలేదు. సినిమా పరిశ్రమ గురించి వచ్చే డైలాగ్స్ ఆకట్టుకొని ఎంటర్టైన్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు. కొన్ని సందర్భాలలో స్క్రీన్ ప్లే మైనస్ గా నిలిచింది.

జీ సినిమాలు సమీక్ష :

టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న దర్శకుడు హరిప్రసాద్ జక్కా.. డైరెక్టర్ గా పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు. తొలి సినిమా కావడంతో కాస్త తడబడ్డాడు. కథ బాగున్నప్పటికీ.. అక్కడక్కడ కొన్ని సీన్స్ తో బోర్ కొట్టించాడు. సెకండాఫ్ లో మాత్రం డైరక్టర్ గా మంచి మార్కులు సంపాదించాడు.

క్యారెక్టర్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్, కామెడీ, రొమాంటిక్ సీన్స్, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే, ప్రీ క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన ‘దర్శకుడు’ ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేస్తాడు.

రేటింగ్ : 2.5 /5