చూసీ చూడంగానే మూవీ రివ్యూ

Friday,January 31,2020 - 01:00 by Z_CLU

న‌టీన‌టులు: శివ కందుకూరి, వ‌ర్ష బొల్ల‌మ్మ, మాళవిక సతీశన్, వెంకటేష్ కాకుమాను, అనీష్, పవిత్రా లోకేష్,
డైరెక్ట‌ర్: శేష సింధు రావు
నిర్మాత: రాజ్ కందుకూరి
బ్యాన‌ర్‌: థ‌ర్మప‌థ క్రియేష‌న్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌
సంగీతం: గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: వేద రామ‌న్‌
డైలాగ్స్‌: ప‌ద్మావ‌తి విశ్వేశ్వ‌ర్‌
ఎడిట‌ర్: ర‌వితేజ గిరిజాల‌
సెన్సార్: U/A
రన్ టైమ్: 1 గంట 53 నిమిషాలు
రిలీజ్: జనవరి 31, 2020

ఓ కొత్త హీరో సినిమాను ఎగబడి చూడాల్సిన అవసరం లేదు. కానీ పెళ్లిచూపులు, మెంటల్ మదిలో లాంటి సినిమాలు తీసిన మేకర్స్ నుంచి మరో సినిమా వస్తుందంటే కచ్చితంగా చూడాలనిపిస్తుంది. అదే బజ్ తో ఈరోజు థియేటర్లలోకి వచ్చింది చూసీ చూడంగానే సినిమా. మరి ఈ సినిమా చూడగానే నచ్చుతుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

అమ్మ చెప్పిందని ఇంజనీరింగ్ జాయిన్ అవుతాడు సిద్ధూ. కానీ అది నచ్చక డిస్-కంటిన్యూ చేస్తాడు. ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అవుదామనుకుంటాడు, కానీ కాంప్రమైజ్ అయి వెడ్డింగ్ ఫొటోగ్రఫీతో నెట్టుకొస్తుంటాడు. ఇంజినీరింగ్ లోనే లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. ప్రేమించిన అమ్మాయి ఐశ్వర్య (మాళవిక) దూరమౌతుంది. దీంతో తను ఓ పెద్ద ఫెయిల్యూర్ అనే ఫీలింగ్ లో ఉంటాడు సిద్ధూ.

ఓ పెళ్లిలో శృతి (వర్ష బొల్మమ్మ)ను చూస్తాడు. ఆమెకు ఎట్రాక్ట్ అవుతాడు. శృతి కూడా అతడ్ని రెగ్యులర్ గా కలుస్తుంది. ఇద్దరూ ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారు. అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో శృతికి పెళ్లి ఫిక్స్ అవుతుంది. అదే టైమ్ లో శృతి తన కాలేజ్ లోనే చదివే అమ్మాయని తెలుసుకుంటాడు సిద్ధూ. అంతకంటే ముఖ్యంగా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్య, శృతి ఫ్రెండ్స్ అనే విషయం కూడా తెలుసుకుంటాడు.

ఇంతకీ సిద్ధూ ఫస్ట్ లవ్ ఎందుకు బ్రేకప్ అవుతుంది? ఐశ్వర్య తనకు ఫ్రెండ్ అనే విషయాన్ని శృతి ఎందుకు దాస్తుంది? ఫైనల్ గా సిద్ధూ-శృతి ఒకటయ్యారా లేదా అనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి ఈ సినిమాతో హీరోగా మారాడు. లుక్స్ పరంగా కుర్రాడిలో హీరో మెటీరియల్ ఉంది. యాక్టింగ్ పరంగా మాత్రం ఎక్కాల్సిన మెట్లు చాలా అంటే చాలానే ఉన్నాయి. తొలి సినిమా కాబట్టి కంప్లయింట్ చేయడం తప్పే అవుతుంది. కాకపోతే ఉన్నంతలో బాగానే హోం వర్క్ చేశాడనే విషయం సినిమా చూస్తే అర్థమౌతుంది.

హీరోయిన్లు ఇద్దరూ బాగా చేశారు. వర్ష అయితే సెకెండాఫ్ కు బ్యాక్ బోన్ గా నిలిచింది. కాలేజ్ లో హీరోను ప్రేమించే సన్నివేశాలతో పాటు.. సెకెండాఫ్ లో ఏడ్చే సీన్ చాలా బాగా చేసింది. మాళవిక కూడా తన లుక్స్, యాక్టింగ్ తో ఆకట్టుకుంది. కమెడియన్ కమ్ నటుడు వెంకటేష్ కాకుమానుకు ఈసారి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పడింది. అతడికి ఈ సినిమా ప్లస్ అవుతుంది. హీరో తల్లిదండ్రులుగా నటించిన అనీష్, పవిత్ర తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

తన సినిమాటోగ్రఫీతో మూవీకి టెక్నికల్ హైలెట్ గా నిలిచాడు వేదరామన్. హీరోహీరోయిన్లను అందంగా చూపించడంతో పాటు సినిమా మొత్తం అతడి మార్క్ కనిపించింది. గోపీసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటల విషయానికొస్తే అన్నీ కథలో సింక్ అయ్యాయి కానీ మైండ్ లో సింక్ అయ్యే మెలొడీ మాత్రం ఒక్కటి కూడా లేదు. పద్మావతి విశ్వేశ్వర్ డైలాగ్స్, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగున్నాయి.

డైరక్టర్ శేష సింధూరావు రాసుకున్న కథ బాగుంది. కథకు ఆమె యాడ్ చేసిన లింక్స్ కూడా, పెట్టుకున్న ట్విస్టులు కూడా బాగున్నాయి. కానీ చెప్పాలనుకున్న పాయింట్ మొత్తాన్ని సెకెండాఫ్ కు దాచేయడంతోనే సమస్య వచ్చింది. ఫస్టాఫ్ లో రాసుకున్న బిల్డప్ సీన్స్ ఇంకాస్త ఎఫెక్టివ్ గా రాసుకుంటే బాగుండేది. నిజానికి ఫస్టాఫ్ సన్నివేశాలన్నింటికీ సెకెండాఫ్ లో కూడా లింక్ ఉంటుంది కానీ ఆ సీన్స్ అన్నీ ఇంకాస్త డెప్త్ గా రాసుకుంటే బాగుండేది. మొదటి సినిమాకు ఆమె ఎంచుకున్న పాయింట్ మాత్రం బాగుంది.

ధర్మపథ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కొడుకు సినిమా అని కాకుండా, ఈ కథకు ఎంత అవసరమో అంతే ఖర్చుచేశాడు నిర్మాత రాజ్ కందుకూరి.

జీ సినిమాలు రివ్యూ

హీరోగా డెబ్యూకి ప్రేమకథకు మించిన ఆప్షన్ లేదు. యాక్షన్, థ్రిల్లర్స్, ఫ్యామిలీ లాంటి జానర్స్ టచ్ చేసే బదులు అందమైన ప్రేమకథతో తెరపైకొస్తే అన్ని వర్గాల ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయొచ్చు. తన కొడుకు శివ కందుకూరి కోసం రాజ్ కందుకూరి కూడా అదే పనిచేశాడు. కానీ అందులో కూడా తన మార్క్ చూపించాడు. రొటీన్ ప్రేమకథలా అనిపించినా, మంచి ట్విస్టులు ఇస్తూ.. చిన్న చిన్న సన్నివేశాలతోనే చెప్పాల్సిన పాయింట్ ను చెబుతూ ప్రేమభావాన్ని సమతూకంలో అందించాడు. చూసేకొద్దీ చూడాలనిపించే సన్నివేశాలు లేకపోయినా, ఆల్రెడీ చూసేశాం అనే ఫీలింగ్ కలిగించకపోవడం చూసీ చూడంగానే సినిమాను ఫ్రెష్ స్టఫ్ గా మార్చింది. యూత్ హార్ట్స్ కు దగ్గర చేసే ఎలిమెంట్ కూడా ఇదే.

పెళ్లిచూపులు, మెంటల్ మదిలో సినిమాలతో రాజ్ కందుకూరిపై ఓ ఇమేజ్ ఏర్పడింది. ఇతడి నుంచి ఓ సినిమా వస్తుందంటే కాస్త బాగుంటుందనే ఫీల్ ఉంది. పైగా ఈసారి తన కొడుకునే లాంఛ్ చేస్తుండడంతో మరింత కేర్ తీసుకుంటాడని అంతా అనుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టే ఉంది సినిమా. కానీ ఆ అంచనాలన్నీ అందుకునేది సెకెండాఫ్ మాత్రమే. ఫస్టాఫ్ ఎంతమాత్రం కాదు.

నీరసంగా స్టార్ట్ అవుతుంది సినిమా. అంతే నీరసంగా సన్నివేశాలు వస్తుంటాయి. ఇంతేనా సినిమా అనిపిస్తుంది. ఇంత బోర్ కొడుతుందేంటి అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడ్నుంచి వరుసగా ట్విస్టులు మొదలుపెట్టి ఇంటర్వెల్ బ్యాంగ్ వేయడంతో సినిమా ఊపందుకుంటుంది. ఇక ఇంటర్వెల్ నుంచి సినిమాలో వంకలు పెట్టడానికేం లేవు. అనుకున్న పాయింట్ ను దర్శకురాలు శేష సింధు యాజ్ ఇటీజ్ గా చూపించారు. సినిమాను నిలబెట్టే స్టఫ్ అంతా సెకెండాఫ్ లోనే ఉంది. డైరక్టర్ విజన్ కు సంగీత దర్శకుడు గోపీసుందర్, సినిమాటోగ్రాఫర్ వేదరామన్ నుంచి ఫుల్ సపోర్ట్ దక్కింది.

ఇక హీరో విషయానికొస్తే, మొదటి సినిమా కాబట్టి అతడి యాక్టింగ్ గురించి తక్కువగా మాట్లాడుకుంటే బెటర్. అయినప్పటికీ ఈ కథకు ఉన్నంతలో బాగానే యాక్ట్ చేశాడు. క్లైమాక్స్ పార్ట్ తో పాటు, తల్లితో నటించే సీన్ దగ్గర ఇంకాస్త బెటర్ గా చేసుంటే బాగుండేది. తొలిసినిమా కాబట్టి తప్పులేదు. లుక్ పరంగా మాత్రం శివ కందుకూరి ఈ సినిమాతో హీరో మెటీరియల్ అనిపించుకున్నాడు. హీరోయిన్ తొలి చూపులోనే ఇతడితో ప్రేమలో పడినట్టు సినిమాలో చూపించడంలో తప్పులేదనిపిస్తుంది. అలా లుక్ వైజ్ ఫుల్ మార్కులు కొట్టేశాడు శివ కందుకూరి. హీరోయిన్లు వర్ష, మాళవిక బాగా చేశారు.

ఓవరాల్ గా చూసీ చూడంగానే సినిమాను ఓసారి చూడొచ్చు. కాకపోతే ఇంతకుముందు రాజ్ కందుకూరి నుంచి వచ్చిన పెళ్లిచూపులు, మెంటల్ మదిలో స్థాయి సినిమా మాత్రం కాదు. శివ కందుకూరికి మాత్రం ఇది మంచి డెబ్యూ. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు మరిన్ని ప్రేమకథలు చేయడానికి ఈ సినిమా బాగా పనికొస్తుంది.

రేటింగ్2.5/5