'చెలియా' రివ్యూ

Friday,April 07,2017 - 04:36 by Z_CLU

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 7, 2017

నటీనటులు : కార్తీ, అదితి రావు

మ్యూజిక్ : ఏ.ఆర్.రెహ్మాన్

సినిమాటోగ్రఫీ : రవి వర్మన్

సమర్పణ : దిల్ రాజు

నిర్మాణం : మద్రాస్ టాకీస్

రచన -స్క్రీన్ ప్లే–నిర్మాణం- దర్శకత్వం : మణి రత్నం

ప్రేమకథలు తీయాలంటే మణిరత్నం తర్వాతే ఎవరైనా. అంతలా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు మణిరత్నం. ఈ లెజెండరీ డైరక్టర్ నుంచి వచ్చిన మరో ఇంటెన్సివ్ లవ్ స్టోరీ “చెలియా”. కార్తి, అదితిరావు జంటగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా… మణిరత్నం మరోసారి తన మేజిక్ చూపించారా..

కథ :

ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా జీవితాన్ని కొనసాగించే వరుణ్(కార్తీ) ఒకానొక సందర్భంలో లీలా (అదితిరి రావు) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా లీలతో ప్రేమాయణం సాగిస్తున్న వరుణ్.. తన విభిన్న ప్రవర్తన వల్ల లీలాను దూరం చేసుకుంటాడు. అంతలోనే ఓ యుద్దంలో పాకిస్థాన్ జైల్లో బందీ అవుతాడు. మరి వరుణ్ ఆ జైలు నుంచి తప్పించుకోగలిగాడా.. చివరికి తన లీలాను కలుసుకోగలిగాడా..అనేది చెలియా సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు :

లీలా క్యారెక్టర్ లో అదితి రావు తన గ్లామర్, పర్ఫార్మెన్స్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచింది. కార్తీ ఫస్ట్ టైం ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా, లవర్ బాయ్ గెటప్ లో తన యాక్టింగ్ తో మెప్పించాడు. ఇక ఆర్.జె.బాలాజీ, లలిత,రుక్మిణి విజయ్ కుమార్, శ్రద్ద శ్రీనాథ్, ఢిల్లీ గణేష్, శివ కుమార్ అనంత్, విపిన్ శర్మ,హరీష్ రాజ్ తదితరులు తమ క్యారెక్టర్స్ న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పని తీరు :

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ఇద్దరు గురించి మెయిన్ గా చెప్పుకోవాలి. వారిలో మొదట చెప్పుకోవాల్సింది ఏ.ఆర్.రెహ్మాన్ గురించే. తన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో యాజ్ యూజువల్ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు మ్యూజిక్ డైరక్టర్ రెహ్మాన్. ముఖ్యంగా రెహ్మాన్ అందించిన 6 పాటలు సంగీత ప్రియుల్ని మెస్మరైజ్ చేశాయి. ఇక సినిమాటోగ్రాఫర్ రవివర్మ ఎన్నో అందమైన లొకేషన్స్ ని తన కెమెరాతో మరింత అందంగా చూపించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో, సాంగ్స్ పిక్చరైజేషన్ లో కెమెరామెన్ టాలెంట్ కనిపించింది. ఇక మణిరత్నం స్క్రీన్ ప్లే బాగున్నా కాస్త స్లో గా సాగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది.. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

మణిరత్నం డైరెక్షన్ లో ఓ లవ్ ఎంటర్టైనర్ సినిమా వస్తుందంటే చాలు యూత్ ఆ సినిమా కోసం థియేటర్స్ కు క్యూ కడతారు. గతంలో కొన్ని లవ్ ఎంటర్టైనర్లతో యూత్ ను ఎట్రాక్ట్ చేసిన ట్రాక్ రికార్డు మణిరత్నంకు ఉంది. ఈమధ్య ‘ఓకే బంగారం’ తో మళ్ళీ తన సత్తా చాటడంతో మరోసారి “చెలియా”తో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడనుకున్నారంతా. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం మణిరత్నం తన గత బ్రాండ్ చిత్రాల స్థాయిలో మెప్పించలేకపోయాడు. కొన్ని విజువల్స్, తన మార్క్ రొమాంటిక్ సీన్స్ తో మాత్రమే కాస్త ఎంటర్టైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ తో మొదలుపెట్టి రొమాంటిక్ సీన్స్ తో ఎంటర్టైన్ చేసిన మణి.. సెకండ్ హాఫ్ లో స్లో స్క్రీన్ ప్లే, రొటీన్ సీన్స్ తో కాస్త బోర్ కొట్టించాడు. ఫైనల్ గా ”చెలియా” సాధారణ ప్రేక్షకులకు జస్ట్ పరవాలేదనిపిస్తుంది. మణిరత్నం ఫ్యాన్స్ ను మాత్రం  బాగానే ఎంటర్టైన్ చేస్తుంది.

 

రేటింగ్ : 2.5 /5