'బాబు బంగారం' రివ్యూ

Friday,August 12,2016 - 02:00 by Z_CLU

చిత్రం : ‘బాబు బంగారం’ రివ్యూ
నటీ నటులు : వెంకటేష్, నయనతార, పృద్వి,సంపత్, పోసాని తదితరులు
సంగీతం : జిబ్రాన్
దర్శకుడు : మారుతి
నిర్మాతలు : నాగ వంశీ, పి.డి.వి.ప్రసాద్
విడుదల తేది: 12-08-2016
కథ :-
తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఆ జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప(పోసాని),మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ ఆ ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడు? చివరికి కృష్ణ ఆ ఇద్దరి ఆట ఎలా కట్టించాడు? అనేది చిత్ర కధాంశం.

 

నటీ నటుల పని తీరు :-

నటుడిగా 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణం లో వెంకీ కృష్ణ అనే పాత్ర తో అభిమానులతో పాటు ప్రేక్షకులనూ అలరించాడు. కొన్ని సన్నివేశాల్లో , పాటల్లో చాలా ఎనర్జిటిక్ గా కనిపించి తన పాత సినిమాలు గుర్తు తెచ్చాడు వెంకీ. ఇక నయనతార తన గ్లామర్, నటన తో ఆకట్టుకుంది. బత్తాయి బాబ్జి గా పృద్వి కామెడీ తో అలరించాడు. పోసాని,ప్రియ,సంపత్ ల మధ్య కామెడీ ట్రాక్ బాగుంది.మ్యాజిక్ మంగమ్మ గా బ్రహ్మానందం నవ్వించాడు. వెన్నెల కిషోర్, గిరి,ఫిష్ వెంకట్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.

 

టెక్నీషియన్స్ పని తీరు:
ఈ సినిమాకు తన సినిమాటోగ్రఫీ తో కల తీసుకొచ్చాడు కెమెరామెన్ రిచర్డ్ ప్రసాద్. ఫారిన్ లొకేషన్స్ విజువల్స్ బాగున్నాయి.
జిబ్రాన్ అందించిన మూడు పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ‘మల్లెల వానల’ పాట ఆకట్టుకుంది. డార్లింగ్ స్వామి, మారుతీ రాసిన మాటలు అలరించాయి. పాత కథే అయినప్పటికీ మారుతీ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడు.

 

జీ సినిమాలు సమీక్ష:
కథ ప్రారంభం లోనే హీరో కృష్ణ పాత్ర కు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసి ఆ జాలి గుణం తో కామెడీ వర్కౌట్ చేసాడు దర్శకుడు మారుతి. మొదటి భాగం లో పృద్వి కామెడీ తో అలరించిన మారుతి రెండో భాగం లో పోసాని, బ్రహ్మానందం పాత్రలతో అలరించాడు. కథానాయకుడిగా 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణం లో వెంకీ ను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో? అలాగే చూపించాడు మారుతి. కృష్ణ అనే జాలి గల పోలీస్ పాత్ర లో తన దైన మార్క్ నటనతో అలరించాడు వెంకటేష్. పృద్వి నాన్నకు ప్రేమతో స్పూఫ్ బాగా పండింది. కథ కాస్త రొటీనే అయినప్పటికీ కామెడీ తో కూడిన స్క్రీన్ ప్లే తో అలరించైనా విధానం బాగుంది. వెంకటేష్, నయనతార మధ్య కెమిస్ట్రీ మరో సారి వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. ఇక ఫైనల్ గా ‘ బాబు బంగారం’ గురించి చెప్పాలంటే కుటుంబమంతా సరదాగా నవ్వుకుంటూ చూడొచ్చు.