'బాబు బాగా బిజీ' రివ్యూ

Friday,May 05,2017 - 02:32 by Z_CLU

రిలీజ్ డేట్ : మే 5, 2017

నటీనటులు : అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మడివాడ, సుప్రియ ఐసోల, శ్రీముఖి

ఎడిటింగ్ – ఎస్.బి. ఉద్దవ్

మాటలు – మిర్చి కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ బోద

సినిమాటోగ్రఫీ – సురేష్ భార్గవ

సంగీతం – సునీల్ కశ్యప్

నిర్మాత – అభిషేక్ నామా

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – నవీన్ మేడారo

అవసరాల శ్రీనివాస్ హీరోగా మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీముఖి హీరోయిన్లుగా హిందీ లో హంటర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటెర్టైనర్ ‘బాబు బాగా బిజీ’. టీజర్ తో అందరిని ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకొచ్చింది… మరి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం..


కథ :

చిన్నతనం నుంచే అమ్మాయిలను అమితంగా ఇష్టపడుతూ అందాలను ఆస్వాదిస్తూ ప్లే బాయ్ జీవితాన్ని గడిపే మాధవ్ (అవసరాల శ్రీనివాస్) ఫైనల్ గా ప్రేమలో విఫలం అయిన రాధా(మిస్త్రీ చక్రవర్తి) అనే అమ్మాయి తో పెళ్లికి రెడీ అవుతాడు.. అలా రాధని పెళ్లిచేసుకోవడానికి సిద్ధమైన మాధవ్ చివరికి తన వైఖరిని మార్చుకున్నాడా… ఇంతకీ రాధని పెళ్లిచేసుకున్నాడా..లేదా .. అనేది సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు :

ఇప్పటి వరకూ సపోర్టింగ్ రోల్స్ తో తనదైన మార్క్ కామెడీ తో ఎంటర్టైన్ చేసిన అవసరాల.. ఈ సినిమాలో ప్లేబాయ్ గా తన పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేశాడు.. మిస్త్రీ చక్రవర్తి పరవాలేదనిపించుకుంది. తేజస్వి మడివాడ, సుప్రియ ఐసోల గ్లామర్ తో మెరుపులు మెరిపించారు. శ్రీముఖి కేవలం ఒక గెస్ట్ రోల్ లో మాత్రమే మెరిసింది.. చేసిన పాత్ర చిన్నదే అయిన తన నటనతో పరవాలేదనిపించుకుంది.. పోసాని, ప్రియదర్శి తమ కామెడీ టైమింగ్ తో అలరించారు… ఇక తనికెళ్ళ భరణి, ప్రభాకర్, రవి ప్రకాష్ , ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు…

 

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గురించే.. సునీల్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.. అన్ని పాటలు అలరించాయి.. ముఖ్యంగా ‘నీలా ఎవరు లేరే’ పాట వినసొంపుగా ఉంది.. పాటలకు సాహిత్యం బాగుంది. కొన్ని సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది.. సినిమాటోగ్రఫీ బాగుంది.. పాటల చిత్రీకరణలో, కొన్ని సన్నివేశాల్లో సురేష్ తన కెమెరా పనితనం చూపించాడు. ఎడిటింగ్ పరవాలేదు. మాటలు ఆకట్టుకున్నాయి.. స్క్రీన్ ప్లే మరీ నెమ్మదిగా సాగింది.. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు…

జీ సినిమాలు సమీక్ష :

హిందీలో హంటర్ సినిమా ఓ ఊపు ఊపేసింది. బోల్డ్ సీన్స్ తో పచ్చిగా తెరకెక్కిన ఆ సినిమాను చూసేందుకు కుర్రాళ్లంతా ఎగబడ్డారు. ఆ స్థాయిలో తీస్తే తెలుగులో సెన్సార్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మన నేటివిటీకి తగ్గట్టు ఉన్నంతలో కాస్త హాట్ గానే సినిమా తీస్తారని కొందరు ఆశించారు. కానీ బాబు బాగా బోర్ కొట్టించేశాడు. అక్కడక్కడ వచ్చే చిన్నచిన్న సీన్లకు ఆశపడి సినిమాకెళ్తే ఆశాభంగం తప్పదు. మరీ ముఖ్యంగా ట్రయిలర్ చూసి థియేటర్ కు వెళ్తే ట్రయిలర్సే బాగున్నాయనిపిస్తాయి.

సినిమాను టైటిల్ సాంగ్ తో స్పీడ్ గా స్టార్ట్ చేసిన దర్శకుడు… హంటర్ ఫ్లేవర్ ను తెలుగులో సక్సెస్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చిరాకు తెప్పిస్తుంది. ఒకే సినిమాలో రిపీటెడ్ షాట్స్ వచ్చాయంటే స్క్రీన్ ప్లే ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. దర్శకత్వం, స్క్రీన్ ప్లే లో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.

అవసరాల శ్రీనివాస్ ఈ స్టోరీని సెలక్ట్ చేసుకున్నప్పుడే చాలామంది అనుమానించారు. నీకెందుకు బాసూ ఈ ప్రయోగాలని అతడ్ని ఓపెన్ గానే అడిగినవాళ్లు కూడా ఉన్నారు. కానీ అవసరాల మాత్రం ఏదో మేజిక్ జరుగుతుందని ఎక్స్ పెక్ట్ చేశాడు. కొత్త జానర్ లో వర్కవుట్ అవుతుందని ఊహించాడు. కానీ అలాంటి మేజిక్ ఏదీ సినిమాలో కనిపించదు.

ఫైనల్ గా చెప్పాలంటే అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్, ఓ 3 పాటలు, మరో 3 రొమాంటిక్ సీన్లు తప్ప బాబు బాగా బిజీ సినిమాలో ఏమీ లేదు.

రేటింగ్ : 2 / 5.