బాహుబలి - ది కంక్లూజన్ రివ్యూ

Friday,April 28,2017 - 11:15 by Z_CLU

నటీనటులు : ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా

ఇతర నటీనటులు : రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ : కె.కె.సెంథిల్ కుమార్

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరావు

కథ : విజయేంద్ర ప్రసాద్

నిర్మాణం : ఆర్కా మీడియా వర్క్స్

నిర్మాతలు : శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎస్.ఎస్.రాజామౌళి

రిలీజ్ : ఏప్రిల్ 28 , 2017

 

రెండేళ్లుగా ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రశ్నకు జవాబు దొరికింది. బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడు అని తెలుసుకోవాలనుకుంటున్న చిక్కుముడి ఎట్టకేలకి వీడింది.. ప్రపంచమంతా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్న ‘బాహుబలి – ది కంక్లూజన్’ ఎట్టకేలకి ఆడియన్స్ ముందుకొచ్చింది.

కథ :

బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో మొదలైన బాహుబలి ది కంక్లూజన్ కథ. ఎన్నో మలుపులు తిరుగుతూ అమరేంద్ర బాహుబలి దేవసేనని ఎలా కలిశాడు.. వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమాయణం కొనసాగింది.. చివరికి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? భల్లాలదేవాను శివుడు ఎలా అంతం చేశాడు..? అనే కంక్లూజన్ తో ఎండ్ అయింది..


నటీనటుల పనితీరు :

మొదటి భాగంలో శివుడిగా- అమరేంద్ర బాహుబలి గా తన నటనా ప్రతిభ తో ఎంటర్టైన్ చేసిన ప్రభాస్… ఈ సినిమాలోఅమరేంద్ర బాహుబలి గా, శివుడిగా తన లుక్, యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసి మెయిన్ హైలైట్ గా నిలిచాడు.. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ లో, కొన్ని కీలకమైన సన్నివేశాల్లో, క్లైమాక్స్ లో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మొదటి భాగంలో భళ్లాలదేవ గా ఆకట్టుకొని సినిమాకు హైలైట్ గా నిలిచిన రానా.. కంక్లూజన్ కి కూడా హైలైట్ గా నిలిచాడు.. మొదటి భాగం లో కేవలం ఒక చిన్న పాత్ర లో మాత్రమే కనిపించి నటిగా ఆకట్టుకున్న అనుష్క ఈ సినిమాలో దేవసేన గా తన గ్లామరస్ యాక్టింగ్ తో యాక్షన్ పార్ట్ లో సైతం ఆకట్టుకుని సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది.. శివగామి గా రమ్య కృష్ణ, కట్టప్పగా సత్య రాజ్ మరోసారి సినిమాను ముందుకు నడిపించారు. బిజ్జల దేవ గా నాజర్, కుమార వర్మ గా సుబ్బరాజు తమ కామెడీతో ఎంటర్టైన్ చేశారు. మిగతా నటీనటులందరూ తమ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు.


టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్క టెక్నీషియన్ తన ప్రతిభ చాటుకున్నాడు.. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు మెయిన్ హైలైట్. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 లో విజువల్ గా మరెన్నో అద్భుతాలు సృష్టించారు కమల కణ్ణన్.. విజయేంద్ర ప్రసాద్ కథ, రాజమౌళి స్క్రీన్ ప్లే బాగా ఆకట్టుకున్నాయి. కీరవాణి సంగీతం సినిమాకు మరో హైలైట్. దండాలయ్యా, సాహోరే బాహుబలి పాటలు సాహిత్య పరంగానూ సంగీతం పరంగానూ బాగా ఆకట్టుకున్నాయి.. కొన్ని సందర్భాల్లో కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం పోసింది.. సెంథిల్ తన కెమెరాతో మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఎంతో అద్భుతంగా చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ లో, సాంగ్స్ పిక్చరైజేషన్స్ సినిమాటోగ్రాఫర్ గా తన పనితనం చూపించాడు. హంస నావ పాట చిత్రీకరణ పరంగా బాగా ఆకట్టుకుంది.. దర్శకుడిగా రాజమౌళి ప్రతీ విషయంపై చాలా జాగ్రత్త వహించాడు.. మాహిష్మతి సామ్రాజ్యం సెట్, సరికొత్త అందమైన లొకేషన్స్ మరోసారి అందరినీ ఆకట్టుకున్నాయి.. సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ కళ్ళు మిరమిట్లుగొట్టేలా చేశాయి. కోటగిరి వెంకటేశ్వరావు ఎడిటింగ్ బాగుంది.. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ క్యారెక్టర్స్ ను మరింత అందంగా చూపించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాకు పని చేసిన 24 క్రాఫ్ట్స్ అద్భుతంగా పనిచేశారు.. సన్నివేశాల పరంగా అంతా బాగానే ఉన్నా సంభాషణల పరంగా ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది… ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి..


జీ సినిమాలు సమీక్ష :

మహేంద్ర బాహుబలి బ్రతకాలి అనే రమ్య కృష్ణ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ కట్టప్ప చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో ముందుగు సాగింది. పార్ట్ 1  లో ఎన్నో ప్రశ్నలకు తావిచ్చిన రాజమౌళి  ఎట్టకేలకి వాటన్నిటికీ ఈ సినిమా ద్వారా సమాధానాలు అందించాడు.. దర్శకుడిగా తన కున్న సమయస్ఫూర్తి, అనుభవంతో మొదటి నుంచి చివరి వరకూ ఎంతో ఉత్కంఠ భరితంగా సినిమాను ముందుకు నడిపించి కంప్లీట్ గా  డైరెక్టర్ ఫిలిం అనిపించాడు.. ముఖ్యంగా పార్ట్ 1 తో  పోలిస్తే ఎన్నో రేట్లు అద్భుతమైన  హాలీవుడ్ స్టాండర్డ్ షాట్స్ తో అందుబాటులో ఉన్న విజువల్ ఎఫక్ట్స్ తో ఎన్నో అద్భుతాలు సృష్టించి ప్రేక్షకులను మైమరిపించాడు.. తన ప్రతీ సినిమాలో నటీ నటుల నుంచి పూర్తి స్థాయి నటన రాబట్టుకునే రాజమౌళి ఈ సినిమాలో కూడా ప్రభాస్-అనుష్క-రానా-రమ్య కృష్ణ-సత్య రాజ -నాజర్-సుబ్బరాజు ఇలా ప్రతీ ఒక్కరి నుంచి మంచి నటన రాబట్టి మెస్మరైజ్ చేశాడు.. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్ అద్భుతంగా నటించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు.. మొదటి భాగం లో కాసేపు మాత్రమే కనిపించి ఆకట్టుకున్న అనుష్క పార్ట్ 2 లో దేవసేన గా గ్లామర్, నటనతో మెస్మరైజ్ చేసింది. ఇక రానా మరో సారి తన దైన విలనిజం తో భళ్లాల దేవ గా ఎట్రాక్ట్ చేశాడు.. ప్రభాస్ ఎంట్రీ సీన్ నుంచి ఎన్నో సందర్భాలలో ప్రేక్షకుడి ని సంతోషపరుస్తూ ఎంటర్టైన్ చేస్తూ కొన్ని సందర్భాలలో వారిచే చప్పట్లు కొట్టేలా సన్నివేశాలను తెరకెక్కించాడు రాజమౌళి.. టైటిల్ వర్క్ నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకూ దర్శకుడిగా ఎంతో జాగ్రత్త వహించి ఎక్కడ పెద్దగా లోపాలేవీ లేకుండా సినిమాను నడిపించాడు.. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం జరిగేటప్పుడు ప్రతీ ప్రేక్షకుడికి రోమాలు నిక్కపొడుస్తాయంటే అతిశోయక్తి కాదు… ఇంటర్వెల్ సన్నివేశంతో పాటు మరి కొన్ని సన్నివేశాల్లో కూడా ప్రేక్షకుడిని ఎంతో ఉద్వేగ పరిచాడు రాజమౌళి.అమరేంద్ర  బాహుబలి  అను నేను అంటూ బాహుబలి ప్రమాణం చేసే సమయంలో మాహిష్మతి  ప్రజలు ఉత్తేజానికి లోనయ్యే సన్నివేశం, మాహిష్మతి రారాజు మహేంద్ర బాహుబలి అని రమ్య కృష్ణ చెప్పే సీన్, ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల అంటూ సభ లో బాహుబలి సేతుపతి తల నరికే సన్నివేశం, మొదటి భాగం లో వచ్చే యాక్షన్ పార్ట్ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచాయి..  క్యారెక్టరైజేషన్స్, బాహుబలి దేశ యాటన చేసే సన్నివేశాలు, అమరేంద్ర బాహుబలి- దేవ సేన మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, శివగామి-బాహుబలి మధ్య  ఎమోషనల్ సెంటిమెంట్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, మెస్మరైజ్ చేసే విజువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ స్థాయి షాట్స్, హంస నావలో పాట చిత్రీకరణ, ప్రీ ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్, కామెడీ సీన్స్, డ్రామా, యాక్షన్ పార్ట్,ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్… ఇక 5 ఏళ్ళ పాటు బాహుబలి అనే కథ ను ఒక గొప్ప సినిమాగా తెరకెక్కించాడానికి అహర్నిశలు శ్రమించి ఒక కథను రెండు భాగాలుగా రూపొందించి తెలుగు ప్రేక్షకులందరూ గర్వపడే ఒక గొప్ప సినిమాగా మలిచి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన రాజమౌళి ని ఈ సినిమా చూశాక కచ్చితంగా అభినందించాల్సిందే… ఇక ‘బాహుబలి (ది కంక్లూజన్) చూశాక ‘బాహుబలి (ది బిగినింగ్) కేవలం ఒక ట్రెయిలర్ మాత్రమే అనిపించడం సహజమే.. ఫైనల్ గా బాహుబలి(ది కంక్లూజన్) ప్రతీ ఒక్కరు చూసి గర్వపడే తెలుగు సినిమా..

 

రేటింగ్ : 4 /5