'అజ్ఞాతవాసి' రివ్యూ

Wednesday,January 10,2018 - 03:18 by Z_CLU

నటీనటులు: పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్, ఖుష్బూ, ఆది పినిశెట్టి, బోమన్ ఇరాని, తనికెళ్ళ భరణి, రావు రమేష్,మురళి శర్మ, సంపత్, వెన్నెల కిషోర్,ఇంద్రజ,పరాగ్ త్యాగి, అజయ్,శ్రీనివాస్ రెడ్డి తదితరులు
సినిమాటోగ్రఫీ : మనికందన్
మ్యూజిక్ : అనిరుద్
నిర్మాణం : హారిక & హాసిని క్రియేషన్స్
నిర్మాత : ఎస్ రాధాకృష్ణ
రచన- దర్శకత్వం : త్రివిక్రమ్
రిలీజ్ డేట్ : 10 జనవరి 2017

‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ భారీ అంచనా మధ్య ఈరోజే గ్రాండ్ గా రిలీజ్ అయింది. సంక్రాంతి బరిలో భారీ హైప్ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసింది… పవన్ -త్రివిక్రమ్ హిట్ కాంబినేషన్ రిపీట్ అయిందా?

థ :

ఏబీ గ్రూప్ ఆఫ్ ఫార్మా కంపనీ అధినేత గోవింద్ భార్గవ్ వింద(బోమన్ ఇరాని)కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కృష్ణవేణి(ఇంద్రజ) సంతానం అభిషిక్త్ భార్గవ్(పవన్ కళ్యాణ్). మొదటి భార్య కృష్ణవేణి చనిపోవడంతో ఇంద్రాణి(ఖుష్బూ)ని పెళ్లి చేసుకుంటాడు గోవింద్. అభిషిక్త్ చిన్నప్పుడే మంచి వ్యక్తిత్వంతో డబ్బుకి దూరంగా పెరగాలన్న ఉద్దేశ్యంతో అప్పాజీ(తనికెళ్ళ భరణి)దగ్గర అభిషిక్త్ ను వదిలి వెళతాడు గోవింద్. ఇంద్రాణికి మరో కొడుకు మోహన్ భార్గవ్ పుడతాడు. ఇద్దరు పెరిగి పెద్దయాక గోవింద్ తన చిన్న కొడుకుతో పాటు అనుకోకుండా హత్యకు గురవుతాడు. అయితే విషయం తెలిసిన అభిషిక్త్ బాలసుబ్రమణ్యం పేరుతో హైదరాబాద్ వచ్చి తన AB సంస్థలోనే ఉద్యోగిగా చేరుతాడు . తన కంపెనీలో బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ లో ఒకడిగా ఉన్న సీతారాంకి తన తండ్రి హత్యతో(ఆది పినిశెట్టి)ప్రమేయం ఉందని గుర్తించిన అభిషిక్త్ వేట మొదలుపెడతాడు. ఈ క్రమంలో అభిషిక్త్ తన తండ్రి, తమ్ముడి చావుకు కారణమైన వాళ్ళని ఎలా అంతమొందించాడు. చివరికి తన ఆస్తిని ఎలా కాపాడుకుని తన కుటుంబాన్ని చక్కదిద్దుకున్నాడు అనేది అజ్ఞాతవాసి కథ.

 

నటీ నటుల పనితీరు:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి చలాకీ కుర్రాడిగా ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా సినిమా అంతా తన భుజాలపై పెట్టుకొని వన్ మేన్ షో గా నిలిచాడు. స్టైలిష్ లుక్ తో బాగా ఎట్రాక్ట్ చేశాడు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ సీన్ లో అదుర్స్ అనిపించుకున్నాడు. సుకుమారి క్యారెక్టర్ తో కీర్తి సురేష్ ఆకట్టుకుంది. అను ఇమ్మానుయేల్ తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసి పరవాలేదనిపించుకుంది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ తెలుగుతెరపై కనిపించిన ఖుష్బూ హుందా పాత్రతో ఆకట్టుకుంది. ఆది పినిశెట్టి స్టైలిష్ విలన్ గా తన పెర్ఫార్మెన్స్ తో బెస్ట్ అనిపించుకున్నాడు కాని పెద్దగా స్కోప్ లేని క్యారెక్టర్ కావడం క్యారెక్టర్ పరంగా తేలిపోయాడు. బోమన్ ఇరానీ తన పెర్ఫార్మెన్స్ తో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. రావు రమేష్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ కామెడీ పండలేదు. జయప్రకాశ్, అజయ్, సంపత్, ఇంద్రజ, పరాగ్ త్యాగి,శ్రీనివాస్ రెడ్డి, సమీర్ తదితరులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ తమ పరిధిలో బెస్ట్ అనిపించుకున్నారు. ముఖ్యంగా మణి కందన్ సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. ప్రతీ ఫ్రేమ్ అందంగా పెయింటింగ్ లా అనిపిస్తుంది. అనిరుద్ అందించిన సాంగ్స్ బాగున్నాయి కాని బాగ్రౌండ్ స్కోరు తో సీన్స్ ఎలివేట్ చేయడంలో విఫలమయ్యాడనిపిస్తుంది. ‘గాలి వాలుగా’, ‘బైటికొచ్చి చూస్తే’,’ఏ బి ఎవరో నీ బేబీ’ సాంగ్స్ బాగున్నాయి. సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, శ్రీమణి అందించిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
రవివర్మ కంపోజ్ చేసిన స్టంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి . ముఖ్యంగా బల్గేరియాలో చేజింగ్ సీన్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. సాంగ్స్ వినడానికి బాగున్నా పిక్చరైజేషన్ సరిగ్గా కుదరలేదు. కోటగిరి వెంకటేశ్వరావు ఎడిటింగ్ పరవాలేదు. ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. తన ప్రతీ సినిమాలో స్క్రీన్ ప్లే తో మేజిక్ చేసే త్రివిక్రమ్ ఈసారి అది మిస్ అయ్యాడనిపిస్తుంది. త్రివిక్రమ్ రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష:

త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేయడంతో ‘అజ్ఞాతవాసి’ పై ఎక్కడలేని హైప్ వచ్చేసింది. ఇక టీజర్, ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా అందరినీ ఎట్రాక్ట్ చేయడం, పైగా పవన్ కళ్యాణ్ కి ఇది 25వ సినిమా కావడంతో ‘అజ్ఞాతవాసి’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం పక్కా అనే టాక్ రిలీజ్ కి ముందే అందుకుంది.
ఇక సినిమా విషయానికొస్తే త్రివిక్రమ్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆ బ్రాండ్ చూసి సినిమాకెళ్లే వాళ్ళు అధికంగా ఉంటారు. గతంలో త్రివిక్రమ్ తన మేజికల్ స్క్రీన్ ప్లే- డైలాగ్స్ తో సూపర్ హిట్స్ అందుకోవడమే దీనికి రీజన్. ‘అ ఆ’ సినిమా కూడా త్రివిక్రమ్ బ్రాండ్ తోనే భారీ కలెక్షన్స్ అందుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే గత సినిమాలతో పోలిస్తే త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో పెద్దగా కనిపించలేదు. సినిమా స్టార్టింగ్ లో ప్రేక్షకుడిని కథలోకి ఇంట్రెస్టింగ్ గా ఇవాల్వ్ చేసిన త్రివిక్రమ్ ఆ తర్వాత ఎంటర్టైన్ మెంట్ లోకి దిగి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్స్ తో బోర్ కొట్టించాడు. ఒక సీరియస్ కథలో కామెడీని ఇరికించి ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదు. భారీగా ఆశలు పెట్టుకున్న క్లయిమాక్స్ లో కూడా త్రివిక్రమ్ మేజిక్ కనిపించలేదు.
పవన్ కళ్యాణ్ లుక్, క్యారెక్టర్, ఎంట్రీ సీన్, కొన్ని డైలాగ్స్, హాలీవుడ్ స్టైల్ లో ఉన్న ఫైట్స్, బల్గెరియాలో ఛేజింగ్ సీన్, సాంగ్స్, పవన్ కళ్యాణ్ – కుష్బూ కి మధ్య వచ్చే సీన్స్, కీర్తి -అను లతో పవన్ రొమాంటిక్ సీన్స్, కొడకా కోటేశ్వరరావు సాంగ్ , ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాలో ప్లస్ పాయింట్స్. బోర్ కొట్టించే సీన్స్, కామెడీ పండకపోవడం, స్క్రీన్ ప్లే, బలమైన సీన్స్ లేకపోవడం, ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ మిస్ అవ్వడం సినిమాకు మైనస్.

రేటింగ్ : 2 .75