Movie Review - హిట్ 2

Friday,December 02,2022 - 01:52 by Z_CLU

నటీనటులు: అడివిశేష్‌, మీనాక్షి చౌదరి, రావు రమేష్‌,  పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ:  మణికందన్‌.ఎస్

సంగీతం: ఎం ఎం శ్రీలేఖ , సురేష్ బొబ్బిలి

ఎడిటింగ్‌:  గ్యారీ బి.హెచ్

నిర్మాణం :  వాల్‌పోస్టర్‌ సినిమా

సమర్పణ:  నాని

నిర్మాత:  ప్రశాంతి త్రిపిర్‌నేని

రచన, దర్శకత్వం: డా. శైలేష్‌ కొలను

నిడివి : 120 నిమిషాలు

విడుదల తేది : 2 డిసెంబర్ 2022

సెన్సార్ : A

 

‘మేజర్’ తో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న అడివి శేష్ హీరోగా , సక్సెస్ ఫుల్ క్రైం థ్రిల్లర్ హిట్  సిరీస్ నుండి వచ్చిన సినిమా కావడంతో HIT2 పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ తో  థియేటర్స్ లో అడుగుపెట్టిన ఆడియన్స్ ను హిట్ 2 మెస్మరైజ్ చేసిందా ? నిర్మాతగా నాని మరో హిట్ అందుకున్నాడా ? శేష్ సక్సెస్ కంటిన్యూ అయ్యిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

వైజాగ్ ఎస్పీ కృష్ణ దేవ్ KD (అడివి శేష్) ఎలాంటి క్రైం కేసునైనా ఇట్టే చేదిస్తుంటాడు. కిల్లర్స్ అందరూ కోడి బుర్రతో ఉంటారనే భావనతో ఉంటాడు. అలాంటి కేడీ కి అనుకోని విధంగా ఓ కేస్ వచ్చి పడుతుంది. ఒక కిల్లర్ మర్డర్ చేసి వివిధ భాగాలుగా పార్ట్స్ వదిలి వెళ్తాడు. అప్పటి వరకూ చిన్న చిన్న మర్డర్ కేసులను డీల్ చేసిన కేడీ కి కిల్లర్ సంజన మర్డర్ మిస్టరీ తో ఛాలెంజ్ విసురుతాడు.

సంజన కేసు టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన కేడీ కి కేసులో చాలా చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని మరో వ్యక్తిని పట్టుకొని అతన్ని కస్టడీలోకి తీసుకుంటాడు కేడీ. తర్వాత చేసిన పొరపాటు తెలుసుకుంటాడు.  ఇంతకీ ఈ మర్డర్ మిస్టరీ వెనుకున్న కిల్లర్ ఎవరు ? ఫైనల్ తన ఇంటిలిజెన్స్ తో కేడీ సైకో కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

నటీ నటుల పనితీరు : 

అడివి శేష్ బ్రిలియన్ యాక్టర్. స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేయడంతో పాటు తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంటాడు. హిట్2 కి కూడా తన యాక్టింగ్ తో హైలైట్ గా నిలిచాడు శేష్. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో శేష్ లో కొంచెం ఎనర్జీ మిస్ అయ్యింది. క్లైమాక్స్ లో శేష్ నటన మెప్పిస్తుంది. మీనాక్షి చౌదరి తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కానీ లవ్ ట్రాక్ కి కావల్సినంత గ్లామర్ ఆమెలో లేకపోవడం నిరాశ పరుస్తుంది. కొన్ని ఇంపార్టెన్స్ అనిపించే కేరెక్టర్స్ కి తెలిసిన నటీ నటులను తీసుకుంటే బాగుండేది.

హర్ష వర్ధన్ తన పాత్రకు పర్ఫెక్ట్ అనిపించాడు. తనికెళ్ళ భరణి ,  రావు రమేష్ , పోసానీ కృష్ణమురళి , శ్రీకాంత్ అయ్యంగార్ , గీతా భాస్కర్  తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

జాన్‌ స్టీవర్స్‌ ఎడురి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను , క్లైమాక్స్ ఎపిసోడ్ ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. ఎం ఎం శ్రీలేఖ , సురేష్ బొబ్బిలి అందించిన సాంగ్స్ బాగున్నాయి.  క్రైం థ్రిల్లర్ కి  విజువల్స్ చాలా ముఖ్యం. ఆ మూడ్ లోకి తీసుకెళ్ళే విజువల్స్ పడితే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. మణికందన్‌.ఎస్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. గ్యారీ బి.హెచ్ క్రిస్ప్ ఎడిటింగ్ సినిమాకు కలిసొచ్చింది. సౌండ్ డిజైనింగ్ బాగుంది.

శైలేష్ కొలను స్క్రీన్ ప్లే , సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే పార్ట్ 2 కి తను ఎంచుకున్న పాయింట్ బాగుంది. వాల్ పోస్టర్ సినిమా నిర్మాత విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

మంచితనం నిండుగా ఉండే ఓ వ్యక్తిని తన భార్య మోసం చేసే సన్నివేశాలతో సినిమాను స్టార్ట్ చేశాడు దర్శకుడు. హర్షవర్ధన్ తో ఆ పాత్ర చేయించి అతను ఏదో రీవెంజ్ కోసం ప్లాన్ చేసుకున్నట్లు చూపిస్తూ అక్కడి నుండి కథ స్టార్ట్ చేశాడు. ఆ వెంటనే కేడీ కేరెక్టర్ ని కూల్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ అతని బిహేవియర్ , ఎలాంటి మర్డర్ కేసు నైనా యిట్టె పసిగట్టేసే టాలెంట్ తో సన్నివేశాలు వస్తాయి. కేరెక్టర్స్ ఎష్టాబిలిష్మెంట్ , లవ్ ట్రాక్ , ఆ తర్వాత హీరో డీల్ చేసే మర్డర్ మిస్టరీ ఇలా చాలా  క్రైం థ్రిల్లర్ సినిమాల్లో లానే అదే  టెంప్లెట్ ఫాలో అయ్యాడు దర్శకుడు శైలేష్. కాకపోతే సినిమా ఆరంభంలో కిల్లర్ తాలూకు ఎపిసోడ్ చూపించేసి చిన్న హింట్ ఇచ్చాడు.

శేష్ కేరెక్టర్ , క్రైం సీన్ , లవ్ ట్రాక్ తో ఫస్ట్ హాఫ్ సాదా సీదాగా నడిచింది. కానీ ఇంటర్వెల్ కి ముందు  జరిగే ఊహించని మర్డర్ కేసుతో సినిమా గ్రిప్పింగ్ గా అనిపిస్తూ పరిగెడుతుంది. ఇంటర్వెల్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను ఇంట్రెస్టింగ్ గా నడిపించడంలో దర్శకుడు శైలేష్ సక్సెస్ అయ్యాడు. హిట్ తీసిన అనుభవంతో మరో సారి థ్రిల్ చేశాడు కూడా. అలాగే శేష్ ను హీరోగా తీసుకోవడం మంచి ఆలోచన. కేడీ పాత్రతో శేష్ సినిమాకు హైలైట్ గా నిలిచాడు. క్రైం థ్రిల్లర్ సినిమాలో కిల్లర్ ఎవరో ? తెలుసుకోవాలని ఆడియన్ చివరి వరకు తన బుర్రకి పదును పెడితే ఈ జోనర్ లో హిట్ కొట్టినట్టే. సినిమాలో కిల్లర్ ఎవరు అనే క్యూరియాసిటీ చివరి వరకూ కలిగించాడు శైలేష్. కానీ విలన్ ఎవరనేది తెలిసాక మాత్రం అంతగా కిక్ అనిపించలేదు. బహుశా కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశ్యంతో విలన్ కేరెక్టర్ కి ఫలానా యాక్టర్ ను తీసుకొని ఉండొచ్చు. కానీ విలన్ గా ఆ యాక్టర్ రాంగ్ ఛాయిస్ అనిపించింది.

ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో  కిల్లర్ హీరోకి వరుసగా ఛాలెంజెస్ విసురుతూ ఇంకా మర్డర్స్ చేస్తే ఇంకా బెటర్ గా ఉండేది కానీ అది రొటీన్ అవుతుందని దర్శకుడు భావించి ఉండొచ్చు. ల్యాగ్ లేకుండా రెండు గంటల్లో పర్ఫెక్ట్ రన్ టైంతో ఈ కథను చెప్పడం సినిమాకు బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. శేష్ పెర్ఫార్మెన్స్ , సెకండాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్ , గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , క్రిస్ప్ రన్ టైం సినిమాకు మేజర్  హైలైట్స్.  విలన్ , అతని వీక్  ఫ్లాష్ బ్యాక్ మైనస్ అనిపించాయి.  క్లైమాక్స్ లో  మూడో కేస్ ను డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ గా  నాని కనిపిస్తాడని రివీల్ చేసి ఎండ్ కార్డ్ వేశాడు దర్శకుడు శైలేష్.

ఓవరాల్ గా క్రైం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారితో పాటు మాములు ఆడియన్స్  కూడా  ఈ వీకెండ్  ‘హిట్ 2’ చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్ : 3 /5