'ఆచారి అమెరికా యాత్ర' మూవీ రివ్యూ

Friday,April 27,2018 - 04:27 by Z_CLU

నటీ నటులు : విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్, కోట శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, రాజా రవీంద్ర, ఠాకూర్ అనూప్ సింగ్ తదితరులు

రచన: మల్లాది వెంకటకృష్ణ మూర్తి

ఛాయాగ్రాహణం: సిద్దార్థ్

సంగీతం: ఎస్ ఎస్ థమన్

మాటలు: డార్లింగ్ స్వామి

నిర్మాణం : పద్మజ పిక్చర్స్

సమర్పణ : ఎం ఎల్ కుమార్ చౌదరి

నిర్మాతలు : కీర్తి చౌదరి , కిట్టు

స్క్రీన్ ప్లే , దర్శకత్వం : జి నాగేశ్వర రెడ్డి

విడుదల తేది : 27 ఏప్రిల్ 2018

విష్ణు మంచు హీరోగా జి.నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కిన ‘ఆచారి అమెరికా యాత్ర’ ఈరోజే విడుదలైంది. ఫుల్లెంగ్త్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం.


కథ :

కృష్ణమా చారి( విష్ణు), అప్పలా చారి (బ్రహ్మానందం) గురు శిష్యులు… తమ టీంతో కలిసి పూజలు చేస్తుంటారు.అయితే ఓసారి చక్రపాణి(కోట శ్రీనివాసరావు)అనే పెద్ద మనిషి ఇంట్లో హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన మనవరాలు రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కృష్ణమాచార్య. అదే సమయంలో రేణుక మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. హోమం చివరి రోజు అనుకోకుండా చక్రపాణి చనిపోతాడు. రేణుక కూడా కనుమరుగై పోతుంది. అయితే రేణుక అమెరికా వెళ్లిందని తెలుసుకుని అప్పలాచారికి ఉద్యోగ ఆశ చూపించి ఎట్టకేలకు తన టీంతో కలిసి అమెరికా వెళతాడు కృష్ణమాచార్య. అలా రేణుక ను కలుసుకోవడానికి అమెరికాకు వెళ్ళిన కృష్ణమాచారి రేణుకకు విక్కీతో పెళ్లి జరగబోతుందని తెలుసుకుంటాడు. ఇక విక్కీ నుండి రేణుకను ఎలా కాపాడాడు చివరికి కృష్ణమాచార్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే బాలన్స్ కథ.

 

నటీ నటుల పనితీరు:

మంచు విష్ణు ఎప్పటిలాగే తన రోల్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఇక ఫుల్లెంగ్త్ కమెడీ రోల్ తో చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం నవ్వించాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో ఆచారి పాత్రలు చేసి అలరించిన బ్రహ్మానందం మరోసారి అప్పలాచారిగా అలరించాడు. ఇక సత్య కృష్ణ , సురేఖ వాణి, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను కామెడితో కొంత వరకూ ఎంటర్టైన్ చేశారు. ప్రదీప్ రావత్, అనూప్ సింగ్ ఠాకూర్ విలన్స్ గా పరవాలేదనిపించుకున్నారు. ఇక కోటా శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, ప్రియ, విద్యుల్లేఖ రామన్, నల్ల వేణు, టార్జాన్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

తమన్ అందించిన బాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ పరవాలేదనిపించాయి. సిద్దార్థ రామస్వామి సినిమాటోగ్రఫీ బాగుంది. వర్మ ఎడిటింగ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేయొచ్చు. మల్లాది వెంకటకృష్ణ మూర్తి రచన సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. డార్లింగ్ స్వామీ మాటలు కూడా పేలలేదు. జి.నాగేశ్వర రెడ్డి కథ , స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

నిజానికి వేసవిలో ఓ వినోదభరితమైన సినిమా వస్తుందంటే ఆ సినిమాకుండే క్రేజే వేరు. ఇక చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ఫుల్లెంగ్త్ క్యారెక్టర్ చేయడం, గతంలో విష్ణు-బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి వినోదాన్ని అందించడంతో పాటు నవ్వుల యాత్ర అనే ట్యాగ్ లైన్ పెట్టడంతో ఈసినిమాపై ఓ మోస్తరుగా అంచనాలు నెలకొన్నాయి.

గతంలో విష్ణుతో ‘దేనికైనా రెడీ’,’ఈడో రకం ఆడో రకం’ సినిమాలతో కామెడి పండించిన జి.నాగేశ్వర రెడ్డి ఈసారి కూడా కామెడినే నమ్ముకొని ఈ సినిమా తెరకెక్కించాడు. అయితే ఈసారి నాగేశ్వర రెడ్డి పూర్తిస్తాయిలో అలరించలేకపోయాడు. ముఖ్యంగా విష్ణు-బ్రహ్మానందం మధ్య సీన్స్ అలాగే మిగతా సీన్స్ కూడా గతంలో చూసిన కామెడి సినిమాలను గుర్తుచేసేలా ఉన్నాయి. దర్శకుడిగా నటీనటులను సరిగ్గా వాడుకోలేకపోయాడు. తాతా-మనవరాళ్ళ మధ్య వచ్చే సీన్స్, ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మానందం కామెడి , విష్ణు – ప్రగ్యా పెర్ఫార్మెన్స్  సినిమాకు హైలైట్స్ అని చెప్పాలి. అంత మంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ సినిమాలో హిలేరియస్ కామెడి జెనెరేట్ చేయలేకపోయాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ కాస్త డ్రాగ్ అనిపించడం, అలాగే ప్రీ క్లైమాక్స్ లో పృథ్వి కామెడి, ఫైట్స్ కాస్త బోర్ కొట్టిస్తాయి.

 

ప్లస్ పాయింట్స్ :

బ్రహ్మానందం కామెడి

విష్ణు -బ్రహ్మానందం ట్రాక్

ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడి సీన్స్

ప్రగ్యా జైస్వాల్ గ్లామర్

 

మైనస్ పాయింట్స్ :

కథ-కథనం

కామెడీ పండకపోవడం

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు

ప్రీ క్లైమాక్స్

 

ఫైనల్ గా బ్రహ్మానందం కామెడి , కొన్ని సన్నివేశాల కోసం ‘ఆచారి అమెరికా యాత్ర’ చూడొచ్చు.

రేటింగ్ : 2.5 /5