'A1 ఎక్స్ ప్రెస్' మూవీ రివ్యూ

Friday,March 05,2021 - 05:34 by Z_CLU

నటీ నటులు : సందీప్ కిష‌న్‌, లావ‌ణ్యా త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌, మ‌హేష్ విట్టా, ర‌ఘుబాబు, అభిజిత్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, సుద‌ర్శ‌న్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి తదితరులు.

సంగీతం ‌:  హిప్ హాప్ త‌మిళ‌

కెమెరామెన్ : కెవిన్ రాజ్‌

ఎడిటింగ్‌: ఛోటా కె. ప్ర‌సాద్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: మ‌యాంక్ సింఘానియా, దివ్య విజ‌య్, శివ చెర్రీ, సీతారామ్‌

స‌హ నిర్మాత‌: వివేక్ కూచిభొట్ల‌

నిర్మాత‌లు: టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం

ద‌ర్శ‌కుడు: డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను

నిడివి : 138 నిమిషాలు

విడుదల : 5 మార్చ్ 2021

తన 25వ సినిమాకు తమిళ్ లో  సూపర్ హిట్టైన ‘నాట్పే తుణై’ అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ రీమేక్ సినిమాను ఎంచుకున్నాడు సందీప్ కిషన్. ఈ సినిమాతో  డెన్నిస్ జీవన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరి ఈ రీమేక్ సినిమాతో సందీప్ ఎలాంటి హిట్ అందుకున్నాడు ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 A1-express-FIRST-LOOK-sundeep-kishan-3

కథ : 

యానంలో ఉండే చిట్టిబాబు హాకీ గ్రౌండ్ ని కమీషన్ కోసం ఆశపడి ఒక బిజినెస్ మెన్ కి అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తుంటాడు స్పోర్ట్స్ మినిస్టర్ రావు రమేష్(రావు రమేష్).  ఎన్నో ఏళ్లుగా అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఆ గ్రౌండ్ కోసం హాకీ కోచ్ మురళి (మురళి శర్మ) రంగంలోకి దిగి దాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు.

మరో వైపు వైజాగ్ నుండి యానంలో ఉన్న మావయ్య ఇంటికొచ్చిన సంజు హాకీ  లేడీ టీం లీడర్ లావ్(లావణ్య) తో ఇష్టపడుతూ ఆమెను ప్రేమలో దింపుతాడు. ఒకానొక టైంలో గ్రౌండ్ కాపాడుకోవడం కోసం సంజు సహాయం కొరతాడు మురళి. ఒక సంఘటన కారణంగా హాకీ గేమ్ వదిలేసి కొత్త జీవితం మొదలుపెట్టిన సంజు అలియాస్ సందీప్ నాయుడు మళ్ళీ యానం చిట్టిబాబు గ్రౌండ్ కోసం హాకీ బ్యాట్ పట్టుకుంటాడు. ఇంతకీ సందీప్ నాయుడు హాకీ గేమ్ కి దూరమవ్వడానికి కారణమేమిటి ? చివరికి మళ్ళీ హాకీ బ్యాట్ పట్టిన సంజు తన గేమ్ తో యానం గ్రౌండ్ ను కాపాడాడా ? లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

స్క్రీన్ పై నిజమైన హాకీ ప్లేయర్ లా కనిపించాడు సందీప్ కిషన్. సందీప్ నాయుడు పాత్రలో మంచి నటన కనబరిచి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. లావణ్య త్రిపాఠి అందంతో ఆకట్టుకుంది. నటిగా ఛాలెంజింగ్ రోల్ దక్కడంతో మరోసారి మెప్పించింది. గతంలో చేసిన క్యారెక్టరే కావడంతో ఎప్పటిలాగే మంచి మార్కులు అందుకొని తన పాత్రతో సినిమాకు ప్లస్ అయ్యాడు రావు రమేష్. ప్రియదర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌ కి నటించేందుకు స్కోప్ ఉన్న పాత్రలు దొరకడంతో బెస్ట్ ఇచ్చారు.

స‌త్యా,  మ‌హేష్ విట్టా కామెడీ టైమింగ్ తో ఫరవాలేదనిపించారు. కోచ్ గా మురళీ శ‌ర్మ , గవర్న మెంట్ ఆఫీసర్ గా రఘుబాబు, ప్లేయర్స్ గా అభిజిత్‌, భూపాల్‌ , మినిస్టర్ పి.ఏ గా సుదర్శన్ , గ్రౌండ్ ఇంచార్జ్ గా ఖయ్యుం తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు హిపాప్ తమిళ అందించిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎసెట్. మంచి సాంగ్స్ తో పాటు సన్నివేశాలు ఎలివేట్ అయ్యే నేపథ్య సంగీతం అందించాడు హిపాప్. “సింగిల్ కింగులం” సినిమాకు హైలైట్ గా నిలిచింది. కెవిన్ రాజ్‌ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా పిక్చరైజ్ చేశాడు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ సాగేందుకు ఛోటా కత్తెర బాగా పనిచేసింది.

మొదటి సినిమా అయినప్పటికీ కొన్ని సన్నివేశాలను డెన్నిస్ బాగానే డీల్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 Sundeep Kishan 25th Film A1 Express Releasing On March 5

జీ సినిమాలు సమీక్ష : 

క్రీడా నేపథ్యంతో ఎమోషనల్ సినిమా తీయడం చాలా కష్టం. అందుకే తమిళ్ లో ఆల్రెడీ వచ్చిన సినిమానే ఎంచుకొని తొలిసారి ఈ జాన్రలో సినిమా చేశాడు సందీప్ కిషన్. స్పోర్ట్స్ డ్రామాలో ఎమోషన్ మిక్స్ చేసి ఆడియన్స్ ని కొంత వరకు మెప్పించాడు సందీప్ కిషన్.

దర్శకుడిగా ఇదే మొదటి సినిమా అయినప్పటికీ రీమేక్ ను బాగానే హ్యాండిల్ చేశాడు డెన్నిస్. ఒరిజినల్ కంటెంట్ లో కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కించాడు. కాకపోతే ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఆల్రెడీ కొన్ని వచ్చాయి. సినిమాలో ఉన్న గ్రౌండ్ ఇష్యూ గతం మనం చూసిన ‘సై’ ని గుర్తుచేస్తుంది. కాకపోతే అందులో ఓ రౌడీ గ్రౌండ్ పై కన్నేస్తే ఇందులో ఓ కార్పోరేట్ సంస్థ, పొలిటికల్ లీడర్ గ్రౌండ్ ని ఆక్రమించుకోవాలని చూస్తారు. స్నేహితుల కోసం గేమ్ వదిలేయడం అనేది మాత్రం కొత్తగా ఉంటుంది. మొదటి భాగమంతా లవ్ ట్రాక్ మీదే నడిచిన సినిమా రెండో భాగం అయ్యాకే అసలు కథలోకి వెళ్తుంది. అక్కడి నుండి సినిమా ఆసక్తి కరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ కథపై ఆసక్తి కలిగించేలా ఉంటుంది. అప్పటి వరకు వచ్చే లవ్ ట్రాక్ మాత్రం ఆకట్టుకోదు. మొదటి భాగంలో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే లవ్ ట్రాక్ , గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఇంకా బాగుండేది.

రెండో భాగంలో వచ్చే  ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్  సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఆ ఎపిసోడ్ లో ఫ్రెండ్ షిప్ సన్నివేశాలు , ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. మొదటి సినిమాకే స్పోర్ట్స్ , పాలిటిక్స్ , యాక్షన్ , డ్రామా ఇలా అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన కథ దొరకడంతో డెన్నిస్ సినిమాను ఎంగేజ్ చేస్తూ తెరకెక్కించాడు. ఓవరాల్ గా ‘A1 ఎక్స్ ప్రెస్’ కొంత వరకు ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 2.75/5