'2 కంట్రీస్' రివ్యూ

Friday,December 29,2017 - 03:00 by Z_CLU

నటీ నటులు : సునీల్, మనీషా రాజ్, సాయాజీ షిండే, రాజా రవీంద్ర, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

సినిమాటోగ్రఫీ : సి.రాంప్రసాద్

సంగీతం : గోపీసుందర్

డైలాగ్స్ : శ్రీధర్ సీపాన

స్క్రీన్ ప్లే-దర్శకత్వం-నిర్మాణం : ఎన్.శంకర్.

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2017

 

ఎన్ శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ హీరోగా మలయాళ సూపర్ హిట్ సినిమా “2 కంట్రీస్” కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ‘2 కంట్రీస్’. ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమాతో సునీల్ తో ఎలా ఎంటర్టైన్ చేసాడో..చూద్దాం.


కథ :

ఉల్లాస్(సునీల్) ఓ పల్లెటూరి కుర్రాడు.. సొంత ఊరిలో ఉంటూ కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం వెతుకుతూ ఉంటాడు.. ఈ క్రమంలో అందరినీ మోసం చేస్తూ డబ్బు సంపాదించే పనిలో ఉన్న ఉల్లాస్ చిన్నతనంలోనే అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయిన  తన చిన్నప్పటి స్నేహితురాలు లయ(మనీషా రాజ్) ను డబ్బుకోసం పెళ్లి చేసుకొని లైఫ్ లో హ్యాపీ గా సెటిల్ అయిపోవాలి అనుకుంటాడు. లయని పెళ్లిచేసుకొని అమెరికా వెళ్లి లైఫ్ లో ఎలాంటి కష్టం లేకుండా సెటిల్ అవుదాం అనుకున్న ఉల్లాస్ లయ కి ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉందని తెలుసుకొంటాడు. ఆ అలవాటుకి బానిసగా మారిన లయను ఆ జీవితం నుంచి ఎలా బయటకి తీసుకొచ్చాడు. ..ఈ క్రమంలో లయ కి భర్తగా దూరమైన  ఉల్లాస్  మళ్ళీ లయ కి ఎలా దగ్గరయ్యాడు… అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

సునీల్ ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ తో హీరోగా ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా కామెడీ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. మనీషా రాజ్ తన గ్లామర్ తో పాటు నటన పరంగానూ ఆకట్టుకుంది. పృథ్వి కామెడీ తో ఎంటర్టైన్ చేశాడు. ఇక సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పని తీరు :

సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగిన విధంగా అందించాడు గోపి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కానీ కొంత భాగం ట్రిమ్ చేయొచ్చు. కొన్ని సందర్భాలలో శ్రీధర్ సీపాన అందించిన మాటలు ఆకట్టుకున్నాయి.తన స్క్రీన్ ప్లే తో శంకర్ పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

సునీల్ హీరోగా ఎన్.శంకర్ మలయాళ సినిమా 2 కంట్రీస్ అనే సినిమాను రీమేక్ చేస్తున్నాడనగానే ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. మలయాళం లో సూపర్ హిట్ అయిన సినిమా కావడం, పవన్ కళ్యాణ్ ఈ సినిమా టీజర్ లాంచ్ చేయడంతో  రిలీజ్ కి ముందే  సినిమా పాజిటివ్ బజ్ అందుకుంది.

ఇక సినిమా విషయానికొస్తే ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడానికి రీజన్స్ చెప్పుకొచ్చిన దర్శకుడు శంకర్ తన రీమేక్  సినిమాతో కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయాడు. సునీల్ కి పర్ఫెక్ట్ అనిపించే కథే అయినప్పటికీ ఆ క్యారెక్టర్ తో కామెడీ పండించడంలో విఫలం అయ్యాడు దర్శకుడు.

సునీల్ కామెడీ, సెకండ్ హాఫ్ లో కామెడీ డైలాగ్స్, ప్రీ క్లైమాక్స్ కామెడీ, మనీషా రాజ్ క్యారెక్టర్, సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలవగా బోర్ కొట్టించే సీన్స్, స్క్రీన్ ప్లే, కామెడీ పెద్దగా పండకపోవడం, సెకండ్ హాఫ్ లో మరీ ఎక్కువ సాగదీయడం, ఎమోషనల్ సీన్స్ పండకపోవడం సినిమాకు మైనస్.

ఫైనల్ గా కామెడీ ని ఇష్టపడే వారిని ‘2 కంట్రీస్’ కొంత వరకూ ఎంటర్టైన్ చేస్తుంది.

రేటింగ్ : 2 .5 / 5