ZeeCinemalu – Sep 20

Saturday,September 19,2020 - 09:49 by Z_CLU

పోలీస్ స్టోరీ 2 హీరో – సాయికుమార్ ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, సన, శోభరాజ్, పొన్నాంబలం సంగీతం – ఆర్పీ పట్నాయక్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు విడుదల తేదీ – 1996 అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2నుతెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడాపనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే.

==============================

ఛల్ మోహన్ రంగ నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్ ఇతర నటీనటులు : మధునందన్, రావు రమేష్, నరేష్, లిస్సి, సంజయ్ స్వరూప్, ప్రగతి మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్ డైరెక్టర్ : కృష్ణ చైతన్య ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2018 చిన్నతనం నుండి పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఎప్పటి కైనా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వలనుకుంటాడు మోహన్ రంగ(నితిన్). ఎన్నిసార్లు ట్రై చేసినా వీసా రాకపోవడంతో ఓ ప్లాన్ వేసి యు.ఎస్ వెళ్తాడు. అలా వెళ్ళిన మోహన్ రంగ విలాస్(మధు నందన్) సహయంతో అక్కడ ఓ ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా పరిచయమైన మేఘా సుబ్రహ్మణ్యం(మేఘ ఆకాశ్) తో ప్రేమలో పడతాడు. మోహన్ రంగ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడంతో మేఘ కూడా ప్రేమలో పడిపోతుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకుంటారు. అలా ఒకరినొకరు ఇష్టపడుతూ చెప్పుకునేలోపే ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. అలా అనుకోకుండా దూరమయిన వీళ్ళిద్దరూ ఏడాది తర్వాత మళ్ళీ ఊటీలో కలుసుకుంటారు. ఇంతకీ మోహన్ రంగ-మేఘ వీరి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి ..? చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు… అనేది మిగతా కథ.

=============================

ABCD నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని రిలీజ్ డేట్ : 17th మే 2019 న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు. అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.

=============================

అహనా పెళ్లంట నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె డైరెక్టర్ : వీరభద్రం ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర రిలీజ్ డేట్ : 2 మార్చి 2011 రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

==============================

ఒక్కడొచ్చాడు నటీనటులు : విశాల్, తమన్నా ఇతర నటీనటులు : వడివేలు, జగపతి బాబు, సూరి, తరుణ్ అరోరా, జయప్రకాష్, నిరోషా మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా డైరెక్టర్ : సూరజ్ ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్ రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016 డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

================================

కథాకళి నటీనటులు : విశాల్, కేథరిన్ థెరిసా ఇతర నటీనటులు : కరుణాస్, ఇమ్మన్ అన్నాచి, గ్రేస్ కరుణాస్, గోపీ, పవన్, మధుసూదన్ రావు మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిళ డైరెక్టర్ : పాండిరాజ్ ప్రొడ్యూసర్ : పాండిరాజ్ రిలీజ్ డేట్ : 18 మార్చి 2016 విశాల్, కేథరిన్ థెరిసా జంటగా నటించిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళి. U.S. లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన కమల్ ( విశాల్ ) అనుకోకుండా, సాంబ అనే వ్యక్తి మర్డర్ కేస్ లో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికి, సాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు…? అసలు హీరో ఫ్యామిలీకి, సాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది..? అనేది ఈ సినిమాలో ప్రధాన కథాంశం. హీరో విశాల్, కేథరిన్ థెరిసా కి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.