ZeeCinemalu -Sep 13

Saturday,September 12,2020 - 10:30 by Z_CLU

నాగభరణం నటీనటులు : విష్ణువర్ధన్, దిగంత్, రమ్య ఇతర నటీనటులు : సాయి కుమార్, రాజేష్ వివేక్, దర్శన్, సాదు కోకిల, అమిత్ తివారీ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్ డైరెక్టర్ : కోడి రామకృష్ణ ప్రొడ్యూసర్స్ : సాజిద్ ఖురేషి, సోహెల్ అన్సారి, ధవళ్ గాద రిలీజ్ డేట్ : 14 అక్టోబర్ 2016 సూర్య గ్రహణం రోజు తమ శక్తి అంత కోల్పోతామని గ్రహించి దేవుళ్లందరూ కలిసి తమ శక్తితో ఓ శక్తివంతమైన ‘శక్తి కవచం‘ సృష్టిస్తారు. లోకాన్ని అంతా కాపాడే ఈ అతి శక్తివంతమైన శక్తికవచాన్ని తమ సొంతం చేసుకోవడానికి కోసం ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. అయితే ఆ దుష్ట శక్తుల నుంచి కవచాన్ని శివయ్య(సాయి కుమార్) కుటుంబం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తుంది. శివయ్య తరువాత ఆ శక్తి కవచాన్ని తమ కుటుంబం తరుపున కాపాడుకుంటూ వస్తున్న నాగమ్మ(రమ్య) ఒకానొక సందర్భంలో మరణించి మరో జన్మలో మానస గా పుట్టి ఆ శక్తి కవచం సుస్థిర స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ శక్తి కవచం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారి దగ్గర ఉందని దానిని ఢిల్లీ మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గా ఇస్తారని తెలుసుకున్న మానస… నాగ్ చరణ్ (దిగంత్) అనే మ్యూజిషియన్ ద్వారా ఆ కవచాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ కవచాన్ని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విలన్స్ ను దుష్ట శక్తులను మానస ఎలా అంతం చేసింది? చివరికి శక్తి కవచాన్ని ఎలా కాపాడుకుంది? అనేది ఈ సినిమా స్టోరీ.

=========================

శివలింగ నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్ ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్, రాధా రవి, వడివేలు, సంతాన భారతి మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్ డైరెక్టర్ : P. వాసు ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్ రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017 ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.

============================

వసంతం నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్ డైరెక్టర్ : విక్రమన్ ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్ రిలీజ్ డేట్ : 11 జూలై 2003 స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

=============================

నవ వసంత నటీనటులు : తరుణ్, ప్రియమణి ఇతర నటీనటులు : ఆకాష్,అంకిత, సునీల్, రోహిత్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ,ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఏ.రాజ్ కుమార్ డైరెక్టర్ : కె.షాజహాన్ ప్రొడ్యూసర్ : ఆర్.బి.చౌదరి రిలీజ్ డేట్ : 9 నవంబర్ 2007 తరుణ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు షహజాహాన్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నవ వసంతం‘. అందమైన లవ్ స్టోరీ తో పాటు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే కథ తో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలిం గా అందరినీ ఆకట్టుకొని అలరిస్తుంది. తరుణ్ ప్రియమణి మధ్య వచ్చే లవ్ సీన్స్, తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఎస్.ఏ. రాజ్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్…

=========================

లింగ నటీనటులు : రజినీకాంత్, అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానం, కరుణాకరన్, దేవ్ గిల్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్ డైరెక్టర్ : K.S. రవి కుమార్ ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్ రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014 సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

============================

చిరుత నటీనటులు : రామ్ చరణ్ తేజ, నేహా శర్మ ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఆలీ, సాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ డైరెక్టర్ : పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్ రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.