ZeeCinemalu – Oct 8

Wednesday,October 07,2020 - 09:07 by Z_CLU

బుర్రకథ న‌టీనటులు: ఆది సాయికుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి ఇతర నటీనటులు : నైరా షా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప‌థ్వీరాజ్‌, గాయ‌త్రి గుప్తా, అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు సంగీతం : సాయికార్తీక్‌ ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం : డైమండ్ ర‌త్న‌బాబు నిర్మాత‌: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌ రిలీజ్ డేట్: జూన్ 28, 2019 అభిరామ్ (ఆది సాయికుమార్) పేరుకు మాత్రమే ఒకడు. కానీ అతడిలో ఇద్దరుంటారు. దానికి కారణం అతడు రెండు మెదళ్లతో పుట్టడమే. ఒక మైండ్ యాక్టివేట్ అయినప్పుడు అభిలా, మరో మైండ్ యాక్టివేట్ అయినప్పుడు రామ్ లా మారిపోతుంటాడు అభిరామ్. అభి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. రామ్ మాత్రం పుస్తకాల పురుగు. దీనికి తోడు హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవాలని చూస్తుంటాడు. ఇలా రెండు విరుద్ధమైన పాత్రలతో తనలోతాను సంఘర్షణకు గురవుతుంటాడు అభిరామ్. ఇలా రెండు వేరియేషన్స్ తో ఇబ్బంది పడుతున్న టైమ్ లో ప్రేమలో పడతాడు అభిరామ్. హ్యాపీ (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయిని కష్టపడి తన దారిలోకి తెచ్చుకుంటాడు. అయితే అభిలో ఇలా రెండు షేడ్స్ ఉన్నాయనే విషయం హ్యాపీకి తెలియదు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఎంటర్ అవుతుంది ఆశ్చర్య (నైరా షా). ఇంతకీ ఈ ఆశ్చర్య ఎవరు? ఈమె రాకతో అభిరామ్ జీవితం ఎలా మారిపోయింది? హీరోకు రెండు బ్రెయిన్స్ ఉన్నాయనే విషయం హీరోయిన్ కు ఎలా తెలుస్తుంది? అసలు తనలోనే ఉంటూ తనను ఇబ్బంది పెడుతున్న మరో క్యారెక్టర్ ను అభిరామ్ ఎలా అధిగమించగలిగాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది బ్యాలెన్స్ స్టోరీ.

=========================

పండగచేస్కో నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : సాయికుమార్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్, రావు రమేష్, పవిత్ర లోకేష్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్ డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని ప్రొడ్యూసర్ : రవి కిరీటి రిలీజ్ డేట్ : 29 మే 2015 రామ్, రాకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..? సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

============================

రారండోయ్ వేడుక చూద్దాం నటీనటులు : అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : జగపతి బాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, పృథ్విరాజ్, చలపతి రావు మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని రిలీజ్ డేట్ : 26 మే 2017 పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆదికృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరి.

=========================

రెడీ నటీనటులు : రామ్, జెనీలియా ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాజర్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు,జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, షఫీ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : శ్రీను వైట్ల ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్ రిలీజ్ డేట్ : 19 జూన్ 2008 రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. కామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

============================

అరవింద సమేత నటీనటులు : N.T. రామారావు, పూజా హెగ్డే ఇతర నటీనటులు : ఈషా రెబ్బ, సునీల్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్, నాగబాబు, రావు రమేష్, నరేష్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : తమన్ డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 11 అక్టోబర్ 2018 కొమ్మద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)కి కొన్నేళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలు. ఈ క్రమంలో నారపరెడ్డిని చంపడానికి బసిరెడ్డి ఓ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో లండన్ నుండి వచ్చిన వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అదే అవకాశంగా భావించి నారపరెడ్డిని హతమారుస్తాడు బసిరెడ్డి. కళ్ళ ముందే తండ్రి ప్రత్యర్దుల చేతిలో చనిపోవడంతో బసిరెడ్డిపై కత్తి దూస్తాడు వీర రాఘవ.. అక్కడి నుండి మళ్ళీ గొడవలు మొదలవుతాయి. అయితే తన కొడుకు చావుతో గొడవలు ఆపేయమని వీర రాఘవుణ్ణి కోరుతుంది నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)… అలా నానమ్మ మాటకి కట్టుబడి గొడవలు ఆపేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ వెళ్ళిపోయిన రాఘవ.. నీలంబరి(సునీల్) గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు. ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే)పరిచయం ప్రేమగా మారుతుంది. ఇక చావు నుండి బ్రతికి బయటపడ్డ బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర) ద్వారా శత్రువు వీరరాఘవ రెడ్డి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో రాఘవ హైదరాబాద్ లో ఉన్నాడని పసిగట్టి చంపడానికి చూస్తుంటాడు బసి రెడ్డి. ఈ క్రమంలో వీర రాఘవ ఫ్యాక్షన్ గొడవలను ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. చివరికి పగతో రగిలిపోతూ క్రూరంగా తయారైన బసిరెడ్డిని వీరరాఘవ మార్చగలిగాడా.. లేదా… అనేది సినిమా కథ.

============================

నక్షత్రం నటీనటులు : సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, రెజినా ఇతర నటీనటులు : తనిష్, శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్ డైరెక్టర్ : కృష్ణవంశీ ప్రొడ్యూసర్స్ : K. శ్రీనివాసులు, S. వేణు గోపాల్ రిలీజ్ డేట్ : 4 ఆగష్టు రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో.. సమాజంలో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. పోలీస్ అంటే హనుమంతుడు అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది నక్షత్రం. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. అతడ్ని పోలీస్ కాకుండా అడ్డుకున్నది ఎవరు.. చివరికి సందీప్ కిషన్ పోలీస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఈ బేసిక్ ప్లాట్ కు లవ్, రొమాన్స్, సెంటిమెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ ప్లే చేశాడు.