ZeeCinemalu – Oct 5

Sunday,October 04,2020 - 10:30 by Z_CLU

ఇది మా ప్రేమకథ నటీనటులు : రవి, మేఘనా లోకేష్ ఇతర నటీనటులు : ప్రభాస్ శ్రీను, ప్రియదర్శి, తులసి శివమణి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : కార్తీక్ కొడకండ్ల డైరెక్టర్ : అయోధ్య కార్తీక్ ప్రొడ్యూసర్ : P.L. K. రెడ్డి రిలీజ్ డేట్ : డిసెంబర్ 15, 2017 రవి, మేఘన లోకేష్ జంటగా నటించిన ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘ఇది మా ప్రేమకథ’. అప్పటివరకు టెలివిజన్ షోస్ లో ఎంటర్టైన్ చేసిన రవి ఏ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. హీరోయిన్ మేఘా లోకేష్ కి కూడా ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం. ఇక సినిమా విషయానికి వస్తే అరుణ్ (రవి) సంధ్యను చూసి చూడగానే ప్రేమలో పడతాడు. కొన్నాళ్ళకు సంధ్య కూడా రవికి దగ్గరవుతుంది. ఈ లవ్ స్టోరీ సరిగ్గా ట్రాక్ లో పడే మూమెంట్ లో ప్రియ అనే అమ్మాయి రావడం, దానికి మరికొన్ని ఇన్సిడెంట్స్ జతై అరుణ్, సంధ్య విడిపోతారు. అసలు అంతగా ప్రేమించుకున్న జంట విడిపోవడానికి కారణమేంటి..? వీళ్ళిద్దరినీ మళ్ళీ ఒకటి చేసిన సందర్భమేమిటన్నది జీ సినిమాలు చూడాల్సిందే.

============================

గోరింటాకు నటీనటులు : రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్ ఇతర నటీనటులు : ఆకాష్, హేమ చౌదరి,సుజిత, శివ రాజా, మాస్టర్ నిధీశ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్ డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్ ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్, పారస్ జైన్ రిలీజ్ డేట్ : జులై 4 , 2008 అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్, మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, అన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలు, ఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

===============================

వసంతం నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్ డైరెక్టర్ : విక్రమన్ ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్ రిలీజ్ డేట్ : 11 జూలై 2003 స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

===========================

నవ వసంతం నటీనటులు : తరుణ్, ప్రియమణి ఇతర నటీనటులు : ఆకాష్,అంకిత, సునీల్, రోహిత్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ,ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఏ.రాజ్ కుమార్ డైరెక్టర్ : కె.షాజహాన్ ప్రొడ్యూసర్ : ఆర్.బి.చౌదరి రిలీజ్ డేట్ : 9 నవంబర్ 2007 తరుణ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు షహజాహాన్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నవ వసంతం‘. అందమైన లవ్ స్టోరీ తో పాటు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే కథ తో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలిం గా అందరినీ ఆకట్టుకొని అలరిస్తుంది. తరుణ్ ప్రియమణి మధ్య వచ్చే లవ్ సీన్స్, తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఎస్.ఏ. రాజ్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్…

====================

శివ నటీనటులు : నాగార్జున, అమల ఇతర నటీనటులు : రఘువరన్, J.D.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, పరేష్ రావల్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా డైరెక్టర్ : రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్ రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 1990 రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ దాదాపు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక రోటీన్ ఫార్మూలాలో వెళుతున్న ట్రెండ్ ఒక పెద్ద కుదుపు లాంటిదీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 26 ఏళ్ళు గడిచినా ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి ఇళయ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది.

==============================

కందిరీగ నటీనటులు : రామ్, హన్సిక మోత్వాని ఇతర నటీనటులు : అక్ష పార్ధసాని, జయ ప్రకాష్ రెడ్డి, సోను సూద్, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్, శ్రీనివాస రెడ్డి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్ డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్ రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011 ఎనర్జిటిక్ స్టార్ రామ్, హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.