ZeeCinemalu – Oct 31

Friday,October 30,2020 - 11:20 by Z_CLU

సైజ్ జీరో నటీనటులు : అనుష్క శెట్టి, ఆర్య ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, అడివి శేష్, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతి రావు, తనికెళ్ళ భరణి మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి డైరెక్టర్ : ప్రకాష్ కోవెలమూడి ప్రొడ్యూసర్ : ప్రసాద్ వి. పొట్లూరి రిలీజ్ డేట్ : 27 నవంబర్ 2015 అధిక బరువు ఉన్నప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గని సౌందర్య అభిషేక్ తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమని పొందటం కోసం, అతి తక్కువ కాలంలో బరువు తగ్గించే క్లినిక్ లో కూడా జాయిన్ అవుతుంది. సౌందర్య అక్కడేం తెలుసుకుంటుంది..? చివరికి సౌందర్య బరువు తగ్గుతుందా..? అభిషేక్ ప్రేమను తను పొందగలుగుతుందా..? అనేదే ఈ సినిమా కథ. అనుష్క పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

==========================

అ..ఆ నటీనటులు : నితిన్, సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్ ఇతర నటీనటులు : నరేష్, నదియా, హరితేజ, అనన్య, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్ డైరెక్టర్ : త్రివిక్రమ్ ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 2 జూన్ 2016 నితిన్, సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా), తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి వెళ్తుంది. ఆనంద్ విహారి ( నితిన్) తో పాటు, తక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తి, ఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ. ఆ తరవాత ఏం జరుగుతుంది..? అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

=============================

నేను లోకల్ నటీనటులు : నాని, కీర్తి సురేష్ ఇతర నటీనటులు : నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, తులసి, రామ్ ప్రసాద్, రావు రమేష్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : త్రినాథ రావు నక్కిన ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2017 బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్ పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

====================================

బ్రాండ్ బాబు నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : J.B. డైరెక్టర్ : ప్రభాకర్ P. ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018 వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు. అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొని, ఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న వ్యక్తి , పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

================================

కోటికొక్కడు నటీనటులు: సుదీప్‌, నిత్యమీనన్‌, ప్రకాష్‌ రాజ్‌, నాజర్‌ తదితరులు సినిమాటోగ్రఫీ : రాజారత్నం డైలాగ్స్‌ : శశాంక్‌ వెన్నెలకంటి సాహిత్యం: భువనచంద్ర, వెన్నెలకంటి, రాకేందు మౌళి సంగీతం: డి. ఇమ్మాన్‌ నిర్మాత: కళ్యాణ్‌ ధూళిపాళ్ల దర్శకత్వం: కె.ఎస్‌. రవికుమార్‌ సత్యం (సుదీప్) ఓ రియల్‌ఎస్టేట్ బిజినెస్ మేన్. నలుగురిలో మంచివాడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే సత్యంలో మరో యాంగిల్ ఉంటుంది. అదే దొంగతనాలు, దోపీడీలు. శివం పేరుతో బిగ్ షాట్స్ వద్ద వద్ద ఉన్న వందల కోట్ల బ్లాక్ మనీని కొల్లగొడుతూ ఉంటాడు.

అయితే బయటి ప్రపంచానికి మాత్రం తన అన్నయ్య శివం ఆ దొంగతనాలన్నీ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తుంటాడు. తాము ఇద్దరం అని అందర్నీ నమ్మిస్తుంటాడు. సత్యం, శివం ఇద్దరు కాదని... ఇద్దరూ ఒకడేనని అసిస్టెంట్ కమీషనర్ (రవిశంకర్) కు అనుమానం. ఎలాగైనా సత్యంను ఆధారాలతో పట్టుకోవాలని చూస్తుంటాడు.

మరి సత్యం దొరికాడా.. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడు? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

========================

బెండు అప్పారావు నటీనటులు : అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్, మేఘన రాజ్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, L.B. శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : కోటి డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ ప్రొడ్యూసర్ : D. రామానాయుడు రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009 R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినా, చిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావ, ఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.