ZeeCinemalu – Oct 27

Monday,October 26,2020 - 09:16 by Z_CLU

అఖిల్ నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్ డైరెక్టర్ : V.V.వినాయక్ ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్ రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015 అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.

===============================

బలాదూర్ నటీనటులు : రవితేజ, అనుష్క శెట్టి ఇతర నటీనటులు : కృష్ణ, చంద్ర మోహన్, ప్రదీప్ రావత్, సునీల్, బ్రహ్మానందం, సుమన్ శెట్టి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధాకృష్ణన్ డైరెక్టర్ : K.R. ఉదయ శంకర్ ప్రొడ్యూసర్ : D. రామానాయుడు రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2008 బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు చంటి. అందుకే అస్తమానం తండ్రితో మాటలు పడుతుంటాడు. అలాంటప్పుడు కూడా చంటి పెదనాన్న రామకృష్ణ చంటికి సపోర్టివ్ గా ఉంటాడు. అందుకే చంటికి పెదనాన్న అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉంటే ఉమాపతి రామకృష్ణని ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు చంటి ఏం చేస్తాడు..? ఎలా తన కుటుంబాన్ని… రామక్రిష్ణని కాపాడుకుంటాడు..? అనేదే సినిమా ప్రధాన కథాంశం.

==========================

శైలజారెడ్డి అల్లుడు నటీనటులు : నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యువెల్ ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్, నరేష్, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, వెన్నెల కిషోర్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్ డైరెక్టర్ : మారుతి దాసరి ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018 ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ). తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

==========================

లింగ నటీనటులు : రజినీకాంత్, అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానం, కరుణాకరన్, దేవ్ గిల్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్ డైరెక్టర్ : K.S. రవి కుమార్ ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్ రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014 సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

==============================

ABCD నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని రిలీజ్ డేట్ : 17th మే 2019 న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు. అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.

==========================

కిల్లర్ నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్ సంగీతం : సైమన్ కే కింగ్ సాహిత్యం , సంభాషణలు: భాష్యశ్రీ సినిమాటోగ్రఫీ : మాక్స్ ఎడిటర్ : రిచర్డ్ కెవిన్ ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్ బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ రచన & దర్శకత్వం : ఆండ్రూ లూయిస్ ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.