ZeeCinemalu – Oct 24

Friday,October 23,2020 - 10:45 by Z_CLU

కిల్లర్ నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్ సంగీతం : సైమన్ కే కింగ్ సాహిత్యం , సంభాషణలు: భాష్యశ్రీ సినిమాటోగ్రఫీ : మాక్స్ ఎడిటర్ : రిచర్డ్ కెవిన్ ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్ బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ రచన & దర్శకత్వం : ఆండ్రూ లూయిస్ ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

===========================

సుప్రీమ్ నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, కబెర్ దుహాన్ సింగ్, రవి కిషన్, సాయి కుమార్, మురళీ మోహన్, తనికెళ్ళ భరణి మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్ డైరెక్టర్ : అనిల్ రావిపూడి ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : మే 5, 2016 సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్, మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

========================

లక్ష్మి తారాగణం : ప్రభుదేవా , ఐశ్వర్య రాజేష్, కోవై సరళ, దిత్య బండే , సల్మాన్ యూసుఫ్ ఖాన్, చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్. రచన మరియు దర్శకత్వం: ఎఎల్ విజయ్ నిర్మాతలు: సి. కల్యాణ్, ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప మరియు ఆర్.రవీంద్రన్ బ్యానర్లు: సి.కె ఎంటర్టైన్మెంట్స్, ప్రమోద్ ఫిల్మ్స్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్ సంగీతం: సామ్ సీఎస్ డీఓపీ : నీరవ్ షా ఎడిటర్ : ఆంథోనీ ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘లక్ష్మి’.. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే బాలనటిగా పరిచయమైంది. డాన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో దిత్య డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపించాడు. దిత్య స్టెప్పులు, కథలో ఎమోషన్స్ ఈ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్స్.

===========================

శతమానంభవతి నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్ డైరెక్టర్ : సతీష్ వేగేశ్న ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : 14 జనవరి 2017 ఆత్రేయపురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

============================== Donga-karthi-దొంగ-కార్తి

దొంగ నటీనటులు - కార్తి, జ్యోతిక, సత్యరాజ్, నిఖిలా విమల్, సీత, ఇళవరసు దర్శకుడు - జీతూ జోసెఫ్ బ్యానర్ - వయకామ్ స్టుడియోస్, పారలల్ మైండ్స్ ప్రొడక్షన్ నిర్మాత - రావూరి వి శ్రీనివాస్ సంగీతం - గోవింద వసంత్ రిలీజ్ డేట్ - డిసెంబర్ 20, 2019 విలక్షణ నటుడు కార్తి, సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన సినిమా దొంగ. జ్యోతిక, కార్తీ కలిసి నటించిన తొలి చిత్రం ‘దొంగ’ (Donga). నిజ జీవితంలో వదిన-మరిది అయిన వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసేఫ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యరాజ్‌ తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో Karthi సరసన ‘మేడ మీద అబ్బాయి’, ‘గాయత్రి’ ఫేమ్‌ నిఖిలా విమల్‌ హీరోయిన్ గా నటించింది. గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ ఫ్రీ బర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు విక్కీ(కార్తీ). 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతుంటారు తండ్రి జ్ఞానమూర్తి (సత్య రాజ్), అక్క పార్వతి(జ్యోతిక). బాగా డబ్బున్న ఈ కుటుంబంలోకి శర్వాలానే ఉన్న విక్కీని ప్రవేశపెడతాడు పోలీసాఫీసర్ జీవానంద్ (ఇళవరసు). డబ్బు కోసం అతడు ఈ పని చేస్తాడు. మరి శర్వా గా జ్ఞానమూర్తి కుటుంబంలోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏమిటి? ఆ కుటుంబం అతనిని నమ్మిందా? అసలు శర్వా ఏమయ్యాడు? చివరికి విక్కీ, పార్వతి, జ్ఞానమూర్తిల కథ ఎలా ముగిసింది? అనేది ఈ 'దొంగ' స్టోరీ.

=======================

టాక్సీవాలా నటీనటులు : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ ఇతర నటీనటులు : మాళవిక నాయర్, మధునందన్, కళ్యాణి, విష్ణు, రవి వర్మ, శిజు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజాయ్ డైరెక్టర్ : రాహుల్ సంక్రిత్యాన్ ప్రొడ్యూసర్ : SKN, బన్ని వాస్ రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2018 అతి కష్టం మీద ఐదేళ్లు చదివి డిగ్రీ పూర్తిచేసిన శివ (విజయ్‌ దేవరకొండ), అన్నయ్య(రవి ప్రకాష్) వదిన(కళ్యాణి)లకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్‌(మధు నందన్‌) దగ్గరకు ఉద్యోగం కోసం వస్తాడు. అలా ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివ 2-3 ఉద్యోగాలు చేసి వర్కౌట్ కాకపోవడంతో చివరికి ఓ టాక్సీవాలా గా సెట్ అవ్వాలనుకుంటాడు. కారు కొనడానికి డబ్బు లేకపోవడంతో తన బంగారం అమ్మి శివ కి డబ్బులు ఇస్తుంది వదిన. అలా వదిన ఇచ్చిన డబ్బుతో కారు కొనేందుకు వెతుకుతున్న క్రమంలో రఘు రామ్(సిజ్జు) దగ్గర ఓ పాత కాంటెస్సా ఉందని తెలుసుకొని ఆ కారుని కొంటాడు శివ. అలా క్యాబ్‌ డ్రైవర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ ఫస్ట్ డ్రైవ్ లో పరిచయం అయిన అనూష(ప్రియాంక జవాల్కర్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో శివకి తను నడుపుతున్న కారులో దెయ్యం ఉందని తెలుస్తుంది. టాక్సీలో నిజంగానే దెయ్యం ఉందా..? ఇంతకీ టాక్సీలో ఉన్న ఆ పవర్‌ ఏంటి..? ఈ కథకి శిశిర (మాళవిక నాయర్‌) అనే అమ్మాయికు సంబంధం ఏంటి..? అనేది ‘టాక్సీవాలా’ కథ.