ZeeCinemalu – Oct 19

Sunday,October 18,2020 - 09:34 by Z_CLU

కొత్త జంట నటీనటులు :అల్లు శిరీష్ , రెజీనా ఇతర నటీనటులు : మధు నందన్, సప్తగిరి, మధురిమ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : జె.బి డైరెక్టర్ : మారుతి ప్రొడ్యూసర్ : బన్నీ వాస్ రిలీజ్ డేట్ : మే 1 , 2014 అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’ ఓ సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్, రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రోగ్రాం కామెడీ, మ్యూజిక్ హైలెట్స్.

==========================

పేపర్ బాయ్ నటీనటులు : సంతోష్ శోభన్, రియా సోమన్ ఇతర నటీనటులు : తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్ డైరెక్టర్ : V. జయశంకర్ ప్రొడ్యూసర్ : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018 పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధానా కథాంశం.

=============================

నిన్నే ఇష్టపడ్డాను నటీనటులు - తరుణ్, అనిత, శ్రీదేవి, రాజీవ్ కనకాల, శరత్ బాబు, బ్రహ్మానందం, గిరిబాబు దర్శకుడు - కొండ డైలాగ్స్ - కోన వెంకట్ బ్యానర్ - శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మాత - కేఎల్ నారాయణ సంగీతం - ఆర్పీ పట్నాయక్ రిలీజ్ - జూన్ 12, 2003 వైజాగ్ లో ఉండే చెర్రీ (తరుణ్) సరదాగా ఉండే ఓ కాలేజ్ స్టూడెంట్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన సంజన(అనిత), చరణ్ కాలేజ్ లో చేరుతుంది. ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు, ఆట పట్టించుకోవడాలు జరుగుతుంటాయి. దీంతో చరణ్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావించిన సంజన, అతడ్ని ప్రేమించినట్టు నాటకం ఆడుతుంది. పెళ్లి వరకు తీసుకొచ్చి హైదరాబాద్ చెక్కేస్తుంది.

భగ్నప్రేమికుడిగా మారిన చెర్రీ, సంజన కోసం హైదరాబాద్ వెళ్తాడు. సంజన తనను మోసం చేసిందని తెలుకుంటాడు. సంజనకు కాబోయే భర్త బోనీ (రాజీవ్ కనకాల) సహాయంతో ఆమె ఇంట్లోకి ఎంటరైన చరణ్.. సంజనకు ఎలా బుద్ధిచెప్పాడు. ఈ క్రమంలో మరో అమ్మాయి గీత (శ్రీదేవి)కు ఎలా దగ్గరయ్యాడనేది ఈ సినిమా కథ.

ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియా ఇందులో ఐటెంసాంగ్ చేసింది.

==============================

దేవత హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి ఇతర నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు సంగీతం – చక్రవర్తి దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4 దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

==============================

కురుక్షేత్రం నటీనటులు -అర్జున్, శృతి హరిహరణ్, సుమన్, ప్రసన్న, వరలక్ష్మి శరత్ కుమార్, వైభవ్ దర్శకుడు - అరుణ్ వైద్యనాథన్ బ్యానర్ - శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత - శ్రీనివాస్ మీసాల సంగీతం - ఎస్.నవీన్ రిలీజ్ - 2018, సెప్టెంబర్ 21 యాక్షన్ హీరో అర్జున్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించినా, క్యారెక్టర్ పోషించినా... ఆయన స్థానం ప్రత్యేకం. అందుకే అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. మరి అలాంటి యాక్షన్ హీరో అర్జున్ నటించిన 150వ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం.

శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా, థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది కురుక్షేత్రం సినిమా. అర్జున్ యాక్టింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

==============================

రామయ్యా వస్తావయ్యా నటీనటులు : NTR, శృతి హాసన్, సమంత రుత్ ప్రభు ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్, ముకేష్ రిషి, కోట శ్రీనివాస్ రావు, రావు రమేష్, తనికెళ్ళ భరణి సంగీతం : S.S. తమన్ డైరెక్టర్ : హరీష్ శంకర్ నిర్మాత : దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్, సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లా, జాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.